వినూమన్కడ్ (ఏప్రిల్ 12, 1917 - ఆగష్టు 21, 1978) భారత మాజీ క్రికెట్ ఆటగాడు.

వినూ మన్కడ్
50px భారత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు మూల్వంత్‌రాయ్ హిమ్మత్‌లాల్ మన్కడ్
మారుపేరు Vinoo
జననం (1917-04-12) 1917 ఏప్రిల్ 12
Jamnagar, భారత దేశము
మరణం 1978 ఆగస్టు 21 (1978-08-21)(వయసు 61)
Mumbai, భారత దేశము
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Slow left arm orthodox
International information
తొలి టెస్టు (cap 30) 22 June 1946: v England
చివరి టెస్టు 11 February 1959: v West Indies
Domestic team information
Years Team
1935–1936 Western India
1936–1942 Nawanagar
1936–1946 Hindus
1943–1944 Maharashtra
1944–1951 Gujarat
1948–1949 Bengal
1950–1951 Saurashtra
1951–1956 Bombay
కెరీర్ గణాంకాలు
TestFirst-class
మ్యాచ్‌లు 44 233
పరుగులు 2,109 11,591
బ్యాటింగ్ సగటు 31.47 34.70
100లు/50లు 5/6 26/52
అత్యుత్తమ స్కోరు 231 231
వేసిన బంతులు 14,686 50,122
వికెట్లు 162 782
బౌలింగ్ సగటు 32.32 24.53
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 8 38
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 2 9
అత్యుత్తమ బౌలింగ్ 8/52 8/35
క్యాచ్ లు/స్టంపింగులు 33/– 190/–

As of 24 June, 2009
Source: Cricinfo

వినూ మన్కడ్ గా ప్రసిద్ధి చెందిన ముల్వంత్‌రాయ్ హిమ్మత్‌వాలా మన్కడ్ ఏప్రిల్ 12, 1917లో జన్మించాడు. భారత దేశం తరఫున ఇతను 44 టెస్టులు ఆడి 31.47 సగటుతో 2109 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 231 పరుగులు. బౌలింగ్ లో 32.32 పరుగుల సరాసరితో 162 వికెట్లు తీశాడు. ఇందులో 8 సార్లు 5 వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్ నుంచి చివరి వరస బ్యాట్స్‌మెన్ దాకా ఏ స్థానంలో నైనా బ్యాటింగ్ చేసిన ముగ్గురు భారతీయులలో ఇతను ఒకడు.

ఉత్తమ ప్రదర్శనసవరించు

మన్కడ్ యొక్క ఉత్తమ ప్రతిభ గురించి 1952 సం.లో ఇంగ్లాండుతో జరిగిన లార్డ్స్ టెస్ట్ సంఘటన చెప్పుకోవాలి. ఆ టెస్ట్ మొదటి ఇన్నింగ్సులో మన్కడ్ 72 పరుగులు చేసి, 73 ఓవర్లు బౌలింగ్ వేసి 196 పరుగులక్ 5 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్సులో 184 పరుగులు చేసి 378 పరుగులు చేసిన భారత జట్టులో టాప్‌స్కోరర్ గా నిల్చాడు. ఈ టెస్టులో ఇంగ్లాండు గెల్చిననూ అతని ప్రతిభను మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఒకే టెస్టులో 100 పరుగులు మరియు 5 వికెట్లు సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా అంతకు ముందు 30 సం.లలో ఏ క్రికెటర్ కూడా ఈ ఘనతను సాధించలేకపోవడం గమనార్హం.

అతని పాత్రను మెచ్చుకోదగిన మరో సఘటన అదే సం.లో జరిగిన మద్రాసు టెస్ట్. ఇంగ్లాండుతో జరిగిన ఈ టెస్టులో తొలి ఇన్నింగ్సులో 8 వికెట్లు (55 పరుగులు ఇచ్చి), రెండో ఇన్నింగ్సులో 4 వికెట్లు (53 పరుగులకు) సాధించి భారత జట్టు గెలవడాన్కి దోహదంచేశాడు. భారత్ కు అదే తొలి టెస్టు విజయం కావడం, అందులో అతని సహకారం ఉండటం విశేషం.

ప్రపంచ రికార్డు భాగస్వామ్యంసవరించు

1956లో న్యూజీలాండ్తో చెన్నై (పూర్వపు మద్రాసు) లో జరిగిన టెస్టులో అతని ఇన్నింగ్స్ జీవితంలోనే అత్యుత్తమమైనది. పంకజ్ రాయ్తో కల్సి ఓపెనర్ గా బరిలోకి దిగి తొలి వికెట్ కు 413 పరుగుల భాగస్వామ్యం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు 2008, ఫిబ్రవరి 29 నాడు దక్షిణాఫ్రికాకు చెందిన ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు 415 పరుగులు జోడించేవరకు తొలి వికెట్ కు ప్రపంచ రికార్డుగా కొనసాగింది. అతని స్కోరు ఆ నాటికి భారత్ తరఫున అత్యధిక స్కోరు.

టెస్ట్ నాయకత్వంసవరించు

మన్కడ్ మొత్తం ఆరు టెస్టులకు భారత జట్టుకు నాయకత్వం వహించి అందులో 5 టెస్టులను డ్రాగా ముగించగా మరో టెస్ట్‌లో పరాజయం లభించింది

నిష్క్రమణసవరించు

సుమారు 13 సం.లు భారత జట్టుకు తన సేవలందించి 1959లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. 1978, ఆగష్టు 21 న ఇతను మరణించాడు.