ఫ్యాన్

(పంఖా నుండి దారిమార్పు చెందింది)

ఫ్యాన్ అనేది సాధారణంగా గాలి వంటి వాయు ప్రవాహాన్ని సృష్టించుకోవడానికి ఉపయోగించే ఒక యంత్రం. ఫ్యాను ఇరుసుకుండ వద్ద వానెస్ లేదా బ్లేడ్స్ కలిగి భ్రమణంచెందే అమరిక కలిగి ఉంటుంది. బ్లేడ్స్, హబ్ భ్రమణం చెందే దళాన్ని ఇంపెల్లర్, రోటర్, లేదా రన్నర్ అంటారు. ఈ ఫ్యానుకున్న రెక్కల ద్వారా గాలి ప్రవాహాన్ని నిర్దేశించవచ్చు. అధిక ఫ్యాన్లు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా పనిచేస్తాయి, అయితే వీటిని పనిచేయించడానికి హైడ్రాలిక్ మోటార్లు, అంతర్గత దహన యంత్రాలు సహా ఇతర సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు.

ఒక గృహ ఎలక్ట్రిక్ ఫ్లోర్ ఫ్యాన్
క్రాస్-ఫ్లో ఫ్యాన్ యొక్క క్రాస్ సెక్షన్, ఈ రకపు ఫ్యాన్ లో చాలా బ్లేడు ఉంటాయి, ఇది క్లాక్-వైజ్ గా తిరుగుతుంది, ఇది 1893 లో పేటెంట్ పొందింది.

సీలింగ్ ఫ్యాన్

మార్చు

ఇంటి పై కప్పు లోపలి భాగంన గాలి కొరకు బిగించబడిన సాధనమునే పైకప్పు పంఖా లేదా సీలింగ్ ఫ్యాన్ అంటారు. దీనిని సాధారణంగా గది మధ్య భాగంలో బిగిస్తారు. ఫ్యాన్ కు మధ్య భాగంన ఉన్న ఇరుసుకు రెక్కలు బిగించబడి ఉంటాయి. పంఖా లోపల ఉన్న విద్యుత్ యంత్రంకు విద్యుచ్చక్తిని అందిచడం ద్వారా పంఖా కు బిగించిబడిన రెక్కలు గిర్రున తిరగడం వలన గది మొత్తం గాలిని విస్తరింప జేస్తుంది. ముఖ్యంగా పైకప్పు పంఖాకు మూడు నుంచి ఐదు రెక్కలు బిగించబడి ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=ఫ్యాన్&oldid=3879600" నుండి వెలికితీశారు