పంఖురి గిద్వానీ

పంఖురి గిద్వానీ (స్థానిక ఉచ్చారణ: పంఖుడి గిడ్వానీ) ఒక భారతీయ నటి. ఆమె పలు సినిమాలు, లీక్డ్! వంటి హిందీ ఓటీటీ సిరీస్లలలో కనిపించింది.[1]ఫెమినా మిస్ ఇండియా 2016లో ఆమె 2వ రన్నరప్ గా నిలిచింది.[2][3][4] 2021లో, ఆమెని ఖాదీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.[5][6]

పంఖురి గిద్వానీ
జాతీయతభారతీయురాలు
వృత్తిమోడల్, నటి

ప్రారంభ జీవితం

మార్చు

ఆమె తన పాఠశాల విద్యను లక్నోలోని లా మార్టినియర్ బాలికల కళాశాల నుండి పూర్తి చేసింది.[7][8] ఆమె 2017లో 12వ తరగతి పరీక్షలకు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ లో 97.25 శాతం సాధించింది.[9][10]

కెరీర్

మార్చు

పంఖురి గిద్వానీ మిస్ గ్రాండ్ ఇండియా 2016గా ఎంపికై, అమెరికాలో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2016 లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[11] ఆమె తెలుగు చిత్రం లవ్ మౌళిలో ప్రధాన పాత్ర పోషించింది. [12][13] ఆమె కావ్య-ఏక్ జజ్బా, ఏక్ జునూన్, లీక్డ్! వంటి అనేక టెలివిజన్, ఓటీటీ డ్రామా సిరీస్ లలో నటించింది.[14]

ఫిల్మోగ్రఫీ

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక
2019 ఉజ్డా చమన్ రీమా హిందీ
2021 గులాబీ రేవది హిందీ ప్రత్యేక పాత్ర
2023 ఇష్క్-ఎ-నాదాన్ హిందీ
2024 లవ్ మౌళి చిత్ర తెలుగు

టెలివిజన్

మార్చు
సంవత్సరం ధారావాహిక పాత్ర గమనిక
2024 కావ్య-ఏక్ జజ్బా, ఏక్ జునూన్ ఐపీఎస్ అనుభా మాథుర్

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం కార్యక్రమం పాత్ర గమనిక
2023 లీక్డ్! రుబీనా
చార్లీ చోప్రా & ది మిస్టరీ ఆఫ్ సోలాంగ్ వ్యాలీ యంగ్ జానకి

మూలాలు

మార్చు
  1. "'Leaked' Trailer: Pankhuri Gidwani and Noyrika Irani starrer 'Leaked' Official Trailer".
  2. "Introducing Miss Grand India 2016 Pankhuri Gidwani".
  3. "Pankhuri Gidwani profile".
  4. "Most desirable woman".
  5. "Khadi gets a glamorous makeover in Lucknow".
  6. "Khadi glammed up the runway in Lucknow".
  7. "Miss India pankhuri gidwani back in school giving boards in lucknow".
  8. "12वीं बोर्ड एग्जाम छोड़ किया पार्टिसिपेट, Miss India में रहीं 2nd रनर अप".
  9. "Former Miss India Pankhuri Gidwani scores 97.2% in ISC".
  10. "Miss India Grand scores 97.25 per cent".
  11. "Has India sent a winner to Miss Grand International?". Rediff.
  12. "review of love mouli".
  13. "Love Mouli Telugu Movie Review | Navdeep, Pankhuri Gidwani". 123telugu.com. 7 June 2024. Archived from the original on 9 June 2024. Retrieved 29 August 2024.
  14. "Who is Pankhuri Gidwani? The model who became Uttar Pradesh's first brand ambassador for khadi".