పంచుమర్తి అనురాధ

పంచుమర్తి అనురాధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైంది.[1]

పంచుమర్తి అనురాధ

పదవీ కాలం
30 మార్చి 2023 - 29 మార్చి 2029
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

పదవీ కాలం
2000 - 2005

ఏపీ మహిళ ఫైనాన్స్ కమిషన్ చైర్‌పర్సన్‌
పదవీ కాలం
2015 - 2019

వ్యక్తిగత వివరాలు

జననం 1974
విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు స్వర్గం పుల్లారావు (మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి), లక్ష్మి
జీవిత భాగస్వామి శ్రీధర్‌
సంతానం సాయి శ్రీధరణి (కూతురు)

జననం, విద్యాభాస్యం

మార్చు

పంచుమర్తి అనురాధ 1974లో స్వర్గం పుల్లారావు, లక్ష్మి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో బదిలీలు కారణంగా ప్రాథమిక విద్య హైదరాబాద్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో, ఆ తర్వాత ఆయనకు బదిలీ కావడంతో అట్కిన్‌సన్‌ హైస్కూల్‌ లో పాఠశాల విద్యను,స్టెల్లా కాలేజీల ఇంటర్ విద్యను విజయవాడలో పూర్తి చేసి, గుంటూరు జేకేసీ కళాశాలలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేసింది. ఆమెకు డిగ్రీ చివరి సంవత్సరంలో పారిశ్రామికవేత్త శ్రీధర్ తో వివాహం జరిగింది. అనూరాధ వివాహానంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

మార్చు

పంచుమర్తి అనురాధ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆమె 2000లో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ స్థానం బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో టీడీపీ అక్కడ బీసీ మహిళా అభ్యర్థి కోసం అన్వేషిస్తోందని తెలియడంతో మేయర్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా 18 మంది పోటీ పడినా విద్యాధికురాలు కావడంతో చంద్రబాబు నాయుడు ఆమెకు టికెట్‌ ఖరారు చేశాడు.

అనూరాధ 2000లో విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి  6800 ఓట్ల మెజారిటీతో గెలిచి మేయర్‌గా ఎన్నికైంది. మేయర్‌గా ఎన్నికైన నాటికీ ఆమె వయసు 26 సంవత్సరాలు. దేశంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా ఆమె లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదైంది.

పంచుమర్తి అనురాధ ఆ తరువాత పార్టీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసి 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎమ్మెల్యే కోటా నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైంది.[2]

మూలాలు

మార్చు
  1. Eenadu (24 March 2023). "స్ఫూర్తిదాయక ప్రస్థానం". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
  2. The Hindu (23 March 2023). "TDP's Anuradha pulls off a surprise win in MLC polls" (in Indian English). Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.