పంజాబీ భథీ
పంజాబీ భథీ(పంజాబీ: ਭੱਠੀ) అనేది పంజాబ్ ప్రాంతంలో ఉపయోగించే ఒకరకమైన వంట చేసుకునే పరికరము.[1]
రూపకల్పన
మార్చుసాంప్రదాయమైన పంజాబీ భథీ అనే వంట చేసుకునే పరికరాన్ని ఈ రకముగా తయారుచేస్తారు. ముందుగా మట్టిలో ఒక గుంత తవ్వుతారు తరువాత ఒక గుండ్రటి ఆకారంలో ఉన్న గోట్టాన్ని పొగ బయిటకు పోవడానికి దూరంగా అమర్చుతారు.[2] రంద్రము చుట్టు ఇరువైపుల మట్టితో అలుకుతారు. తరువాత నేలకు కొంత ఎత్తులో గుండ్రముగా ఒక గోడను కడతారు. భథీకు ఒకవైపు మంట పెట్టడానికి అవసరమయ్యే పుల్లలు, వెదురు, ఆకులు పెట్టడానికి రంధ్రం పెడతారు.[3]భథీకు పై భాగంలో ఖాళీ పెడతారు కాని దాన్ని ఒక లోహపు దాకతో మూసి ఉంచి అధిక వేడి ఉత్పత్తి కావడానికి ఇసుకతో నింపి ఊంచుతారు.
ఉపయోగాలు
మార్చుపంజాబ్ వంటకాలైన గోదుమలు, జొన్నలు దీని మీద వండితే అధిక రుచి సంతరించుకుంటాయి. అలా వండిన వాటిని బెల్లం పాకంలో కలుపుతారు.[3]పూర్వం పంజాబ్లోని ప్రతి ఇంట్లో ఈ భథీలు ఉండేవి[4][3]
ఇతర ప్రదేశాల్లో వీటి వాడకం
మార్చురాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని వాడతారు.
రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కువగా బార్లీ గింజల్ని వండటానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ భథీ లోపల గిన్నెలను పెట్టి వాటిలో బార్లీ గింజల్ని పెట్టి, పైన మూత పెట్టి వండుతారు.[5]
భథీల్లో మరో రకం కూడా ఉంటాయి. పెద్ద మొత్తంలో వండేందుకు పెనం వంటి, పైన మూతలు లేని భథీలు ఉంటాయి.[6]
మూలాలు
మార్చు- ↑ Photo of a Punjabi bhathi
- ↑ Punjabi bhathi
- ↑ 3.0 3.1 3.2 Alop ho riha Punjabi virsa byHarkesh Singh Kehal Pub Lokgeet Parkashan ISBN 81-7142-869-X
- ↑ Punjabi bhathi
- ↑ The Hindu Mohammed Iqbal 14 10 2012
- ↑ "Traditional stoves". Archived from the original on 2016-10-28. Retrieved 2016-08-02.