పంపన సూర్యనారాయణ
డా. పంపన సూర్యనారాయణ సంస్కృతాంధ్ర భాషా పండితుడు.
జీవన సంగ్రహం
మార్చుడా: పంపన సూర్యనారాయణ తూర్పు గోదావరి జిల్లా తాళ్లపొలంలో 1945 అగస్టు 1 న జన్మించాడు. పాలకొల్లు దగ్గర కొన్నాళ్ళు తెలుగు పండితునిగా చేసి, తరువాత పెద్దాపురంలోని మహారాణి కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా చేరి, చివరివరకూ అక్కడే పనిచేసాడు. 2002 డిసెంబరు 7 న న మరణించాడు.
ఉన్నత విద్య
మార్చు- ఉన్నత విద్య గురువులు గుత్తుల శ్రీరాములు, ప్రాథమిక సంస్కృత గురువులు, పంపన రామారావు, దవ్వూరి వీరభద్ర స్వామి, ఎర్రగుంట సుబ్రహ్మణ్యం.
- భాషా ప్రవీణ
- చిననిండ్రకొలను., పశ్చిమ గోదావరి జిల్లా.
- ఆంధ్ర సాహిత్య గురువులు
- డా: ఆకురాతి పున్నారావు.
- తర్క విద్యా గురువులు
- సూరికుచ్చి రామనాథం.
- ఎం.ఎ.: ఆంధ్ర విశ్వవిద్యాలయము, విశాఖ పట్నము.
ప్రసిద్ధ పద్యాలు
మార్చుపంపనకు ప్రసిద్ధ తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ అంటే అభిమానం. ఆయన గురించి పంపన చెప్పిన చాటువు:[1]
తెలుగు సాహిత్య సత్కృషీవలులయందు
వేయి యెకరాల భూస్వామి విశ్వనాథ
వారి పొలమున పండని పంట లేదు
పండినది యెల్ల పసిడి కాకుండలేదు
పెద్దాపురం గురించి ఆయన ఆశువుగా చెప్పిన పద్యం:
సీ||
ఇట పాండవుల మెట్ట ఇతిహాసముల పుట్ట వత్సవాయి పతుల ప్రభల పట్టు
ఇటనేన్గులక్ష్మణ కృత సుభాషితములు తెలుగుటెదల త్రుప్పుడులిచికొట్టు
ఇటు పట్టువస్త్రాల కితరదేశాధీశ పత్నులు సైతంబు పట్టుబట్టు
ఇట మరిడమ్మయూరేగు నుత్సవము సమస్త కళాపూజ కాటపట్టు
తే.గీ||
బుచ్చి సీతమ్మ ఈవి పెంపును నిలిపెడి
సత్రశాల వెంబడి కళాశాల వెలయ
తనవని మురిసిపోవు పెద్దాపురంబు
కడు పురాతన సంస్థాన ఘనత కలిగి
రచనలు
మార్చు- నిరుద్యోగ శతకము
- వస్తాదు రాజు జీవిత చరిత్ర
- శ్రీమద్రామాయణ కల్పవృక్షం - పద్య శిల్పం
- పంపన వారి చాటువులు
- సర్దార్ పాపన్న
- విశ్వనాథ వారి భక్తి - దేశభక్తి
- గౌతమీ కోకిల - వేదుల సాహిత్య వసంతం[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ""కవి పరిచయం"". Archived from the original on 2017-01-02. Retrieved 2017-01-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
వెలుపలి లంకెలు
మార్చుగౌతిమి కోకిల: వేదుల సాహిత్య వసంతం. ప్రథమ ముద్రణ, 1992, విశాలాంధ్ర పబ్లిషింగ్.