ప్రధాన మెనూను తెరువు

పాలకొల్లు

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు మండలం లోని పట్టణం

పాలకొల్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. పిన్ కోడ్: 534260. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు నుండి నరసాపురం పట్టణానికి 10 కి.మీ. దూరం. పాలకొల్లుకు 7 కి.మీ. దూరంలో చించినాడ వద్ద వశిష్టగోదావరి నదిపై కట్టిన వంతెన తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతుంది.

పాలకొల్లు

క్షీరపురి, పాలకొలను
పాలకొల్లు దగ్గర కోనసీమ.
పాలకొల్లు దగ్గర కోనసీమ.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పాలకొల్లు ప్రాంతము
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పాలకొల్లు ప్రాంతము
పాలకొల్లు is located in Andhra Pradesh
పాలకొల్లు
పాలకొల్లు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పాలకొల్లు ప్రాంతము
అక్షాంశ రేఖాంశాలు: 16°32′00″N 81°44′00″E / 16.5333°N 81.7333°E / 16.5333; 81.7333Coordinates: 16°32′00″N 81°44′00″E / 16.5333°N 81.7333°E / 16.5333; 81.7333
దేశంభారతదేశం
పేరు వచ్చినవిధముపాల అభిషేకం
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంస్థానిక స్వపరిపాలన
 • నిర్వహణపాలకొల్లు పురపాలక సంస్థ
 • చైర్మన్వల్లభనేని నారాయణ మూర్తి
విస్తీర్ణం
 • నగరం4.68 కి.మీ2 (1.81 చ. మై)
 • మెట్రో
19.49 కి.మీ2 (7.53 చ. మై)
విస్తీర్ణపు ర్యాంక్34th (in state)
సముద్రమట్టము నుండి ఎత్తు
1.5 మీ (4.9 అ.)
జనాభా
(2011)
 • నగరం61,284
 • ర్యాంక్ఆంధ్రప్రదేశ్ లో 34వ
 • సాంద్రత10,939/కి.మీ2 (28,330/చ. మై.)
 • మెట్రో
81,199
భాషలు
 • అధికారికతెలుగు
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
PIN
534 26X
టెలిఫోన్ కోడ్+91–8814
వాహనాల నమోదు కోడ్AP–37
జాలస్థలిwww.palakol.cdma.ap.gov.in

పేరువెనుక చరిత్రసవరించు

పాలకొల్లుకు దుగ్ధోపవనపురం, ఉపమన్యుపురం అనేవి నామాంతరాలు. మహాభక్తుడైన ఉపమన్యుడు ఈ ప్రదేశంలో క్షీరాన్ని పొందడంతో ఉపమన్యుపురమనీ, పాలకొలను అనీ పేర్లు వచ్చాయంటారు. పాలకొలను అనే పేరు జనవ్యవహారంలో పాలకొల్లు అయింది. పాలకొల్లు అన్న పేరుకు సంస్కృతీకరణగా క్షీరారామం అన్న వ్యవహారం కూడా ఉంది.[1]

చరిత్రసవరించు

క్షీరారామిలింగేశ్వర స్వామి ఆలయ చరిత్రసవరించు

వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక క్రీ.శ.1157లో పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి అఖండదీపానికి దానం ఇచ్చింది. ఇక్కడి నాట్యమంటపానికి క్రీ.శ.1276లో కోన గణపతిదేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 150 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని క్రీ.శ.1415న అల్లాడ రెడ్డిభూపాలుడు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటోంది. చెళ్ళపిన్నమనేని నరహరినేని ఆలయ కళ్యాణమండపం నిర్మించారు. క్రీ.శ.1777లో బచ్చు అమ్మయ్య మూడు వందల సంవత్సరాల నాడు ప్రారంభించిన గోపురాన్ని పూర్తిచేయించారు.

కుతుబ్ షాహీ పాలనలోసవరించు

వస్త్ర పరిశ్రమ కేంద్రంగాసవరించు

16, 17 శతాబ్దాల్లో గోల్కొండ కుతుబ్ షాహీ పాలనా కాలంలో పాలకొల్లు ప్రాంతంలో వస్త్ర పరిశ్రమ విలసిల్లేది. కాటన్, కాలికో, లుంగీలు, దుప్పట్లు తయారయ్యేవి. ప్రత్యేకించి రంగుల అద్దకంతో రూపొందిన వస్త్రాలు కూడా పాలకొల్లులో తయారుచేసేవారు. ఈ వస్త్రాలన్నీ మచిలీపట్నం రేవుకు చేరుకుని, అక్కడ నుంచి ఓడల ద్వారా వివిధ ప్రాంతాలకు వాణిజ్యానికి తరలివెళ్ళేవి.[2] 1770లో కృష్ణా, గోదావరి డెల్టాలను దెబ్బతీసిన పెద్ద కరువు వల్ల వ్యవసాయం, వ్యాపారం దెబ్బతిన్నాయి. ఈ కరువు పాలకొల్లు కేంద్రంగా సాగుతున్న వస్త్ర పరిశ్రమ మీదా వ్యతిరేక ప్రభావం చూపించింది. 18వ శతాబ్ది చివరి దశకాల్లో పాలకొల్లు ప్రాంతంలోని వస్త్ర పరిశ్రమ చాలా మందకొడిగా సాగిందని డచ్చి వారి నివేదికలు పేర్కొన్నాయి. 19వ శతాబ్దిలో ఇంగ్లాండు నుంచి వస్త్రాల దిగుమతులు ఊపందుకోవడంతో ఇతర కోరమాండల్ తీరానికి చెందిన వస్త్ర పరిశ్రమ కేంద్రాలతో పాటు పాలకొల్లు కూడా పూర్తిగా దెబ్బతింది. పాలకొల్లు వస్త్రాలు అమ్ముడయ్యే మార్కెట్ల సంగతి పక్కనపెడితే ఈ ప్రాంతంలోనే స్థానిక వస్త్రాలు వదిలిపెట్టి ఇంగ్లండు మిల్లు బట్టలు కట్టడం మొదలైంది. దీంతో వస్త్ర పరిశ్రమ కేంద్రంగా పాలకొల్లు స్థానం చెదిరిపోయింది.[3]

మేకుల తయారీ పరిశ్రమసవరించు

కుతబ్ షాహీల పాలనలో పాలకొల్లులో ఇనుప మేకులు తయారుచేసే పరిశ్రమ సాగేది. ఇక్కడికి సమీపంలోని నరసాపురం నౌకా నిర్మాణ పరిశ్రమ విలసిల్లేది. సామాన్యంగా భారతదేశంలో ఇనుము లోటు ఉండడంతో ఇతర ప్రాంతాల్లో నౌకలు కేవలం చెక్కతోనే తయారుచేసేవారు. గోదావరి డెల్టా ప్రాంతంలో ఇనుము లభ్యతకు లోటులేకపోవడంతో నరసాపురంలో మాత్రం మేకులు, ఇతర ఇనప ఉపకరణాలు వాడి నిర్మించేవారు. ఈ స్థితిగతులు పాలకొల్లులో ఇనుప మేకుల పరిశ్రమకు వీలిచ్చాయి.[4]

పంచారామక్షేత్రంసవరించు

 
క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయము లోపల
 
పాలకొల్లు పట్టణము
 
పాలకొల్లు బస్టాండ్ మరియు శ్రీనివాసా దియేటర్స్ సముదాయములు

ఆంధ్ర ప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే ఈ చెరువు (ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు). ఆంధ్ర ప్రదేశ్‌లో ఎత్తయిన,మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.

ఇతర దేవాలయములుసవరించు

 • పాలకొల్లులో చిన్న గోపురం అని పిలువబడే మరొక ఆలయము ఉంది.ఇక్కడి మూలవిరాట్ కేశవస్వామివారు
 • అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి మందిరం ఉంది. ఇక్కడి బ్రహ్మోత్సవం ఊళ్ళో ఒక పెద్ద పండుగ. ఈ మందిరంలో ధనుర్మాసంలో జరిపే ప్రత్యేక పూజలు కూడా ప్రసిద్ధం.
 • ఎడ్ల బజారు వద్ద గల శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానము ఉంది. దసరా ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతారు. నాటకాలు బుర్రకథలు,హరికథలు మొదలగునవి పదిరోజులు పాటు ప్రదర్శిస్తారు.
 • పాలకొల్లు పట్టణ దేవత శ్రీ పెద్దింట్లమ్మ వారు. పాలకొల్లు వర్తకసంఘాల ఆధ్వర్యంలో పదిరోజులు జరిగే పెద్దింట్లమ్మ వారి ఉత్సవాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రఖ్యాత నాటక సమాజాల వారిచే నాటకాలు ప్రదర్శించబడును.
 • పాలకొల్లు గ్రామ దేవత దేసాలమ్మ వారు.
 • కాలువ మార్గములో షిర్డిసాయినాథుని మందిరము నాలుగెకరాల విస్తీర్ణములో ఉంది. ఆలయము వెనుక భోజనశాల, ధ్యాన మందిరము, ఉద్యాన వనములు ఉన్నాయి. గురువారము రోజున వేలమంది స్వామిని దర్శించేందుకు తరలి వస్తుంటారు. ప్రతి రోజూ ఉచిత భోజన కార్యక్రము జరుగును.
 • అయ్యప్పస్వామి వారి ఆలయము. సాయినాథుని దేవాలయమునకు ఎదురుగా కాలవ ఇవతలి వైపు నర్సాపురం వెళ్ళే రోడ్డులో రెండు అంతస్తులుగా అద్భుత నిర్మాణముగా మలచారు.

మరికొన్ని విశేషాలుసవరించు

లలితకళాంజలి కళాక్షేత్రం.

విద్యుదాధారిత వినోద సాధనాలు పెరుగుతుండటంతో నాటకాలకు తరిగి పోతున్న ఆదరణ ఎరిగినదే. అటువంటి కళా సంరక్షణార్ధం ఏర్పాటైన కొద్ది సంస్థలలో లలిత కళాంజలి కళా క్షేత్రం ఒకటి. ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించి ఉత్తమ నాటకాలకు, ఉత్తమ నటీ నటులకు పురస్కారములతో సత్కరించటం జరుగుతున్నది. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే ప్రసిద్దులైన ఎందరో నటీ నటులు సినిమాలకు పరిచయమయ్యారు, అవుతున్నారు.

లయన్స్ క్లబ్ మరియు సంగీతకాడమీ.

పాలకొల్లు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో ప్రజోపకార కార్యక్రమములు జరుగుతున్నవి. ఉచిత నేత్ర శస్త్ర చికిత్సా శిబిరాలు, వికలాంగులగు ఆర్థిక సహాయములు, ఆధారములేని స్త్రీలకు కుట్టు మిషన్లు పంపిణీ ఇలా పలు కార్యక్రమములు ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటారు. సంగీతాసక్తి ఉన్న వారికి మంచి ఉపాద్యాయులద్వారా శిక్షణ తరగతులు, పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటరు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు.

బాలకేంద్రం (మహిళామండలి)

బాలలకు కళా రూపాలైన భరతనాట్యం, చిత్రలేఖనం, సంగీతం లాంటివాటిలో శిక్షణ ఇస్తుంటారు. 1980 అక్టోబరు రెండున ప్రారంబించిన ఈ బాలకేంద్రం దివంగత బొండాడ వెంకట్రామగుప్త కృసి ఫలితంగా పాలకొల్లుకు కేటాయించారు. మహిళా మడలి భవనంలో కొంతభాగమును దీనికి కేతాయించారు. ఇక్కడ నామమాత్రపు రుసుము 50 రూపాయలతో వివిధ విభాగాలలో శిక్షణ ఇస్తున్నారు. కేవలం కళలోనే కాక వృత్తి విద్యా కోర్సులైన టైలరింగ్, అద్దకం వంటి వాట్ని కూడా నేర్పుతున్నారు.

ఇక్కడ శిక్షణ ఇచ్చు కోర్సులు. వీణ, గాత్రం, వేణువు, భరతనాట్యం, కూచిపూడి, చిత్రలేఖనం, - టైలరింగ్, అద్దకం, ఎంబ్రాయడరీ మొదలగునవి.

బత్తాయి, నారింజ, నిమ్మ.

పాలకొల్లు బత్తాయిలకు బహు ప్రసిద్దం. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గినప్పటికిన్నీ పేరు మాత్రం మారలేదు. సినిమాలలో సైతం పాలకొల్లు బత్తాయి పేరు అత్యధికంగా వినిపిస్తుంది.మూస:ఆధారం కోరబడింది

నవారు లేదా నవ్వారు.

మంచాలకు ఉపయోగించు నవ్వారు తయారు ఇక్కడ అధికం. నవ్వారు నేయు యంత్రములు షావుకారు పేట అను ప్రాంతమందు అధికం. ఈ ప్రాంతమునుండి ఇతర ప్రాంతములకు ఎగుమతి జరుగును.

లేసు పరిశ్రమ.

పాలకొల్లులో లేసు పరిశ్రమ ద్వారా ఇతర దేశాలకు సైతం ఎగుమతి జరుగును. పాలకొల్లు కేంద్రంగా కొమ్ముచిక్కాలలో దాదాపు రెండువేలమంది పనిచేయు లేసు పరిశ్రమ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన 'పీతాని సత్యనారాయణ' తండ్రి పేరున స్థాపించిన 'పేతాని వెంకన్న'లేసు పరిశ్రమ పాలకొల్లులో అతిపద్ద పరిశ్రమ.

 • ఆంధ్ర ప్రదేశ్ లో రక్షిత మంచి నీటి పథకము ద్వారా స్వాతంత్ర్యమునకు పూర్వము నుండి మంచి నీరు సరఫరా జరిగిన అతి కొద్ది మునిసిపాలిటీలలో పాలకొల్లు మొదటి మునిసిపాలిటి.
 • పాలకొల్లు మిఠాయి తయారీలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ పూతరేకులు, సొనె పాప్పొది,బూందీ లడ్డు, జీడిపప్పు పాకం, హల్వాలు విపరీతంగానూ, అత్యదికంగానూ ఎగుమతి అయ్యే మిఠాయిలు.

గ్రేటర్ పాలకొల్లుసవరించు

పురపాలక సంఘానికి మూడు కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను విలీనం చేస్తున్నట్లు తీర్మానం కౌన్సిల్‌ ఆమోదించింది. ప్రస్తుతం 31వ వార్డులతో ఉన్న పురపాలక సంఘం సుమారు 1.29 లక్షల మంది జనాభాను కలిగి ఉంది. దానికితోడు పులపల్లి, ఉల్లంపర్రు మరియు పాలకొల్లు రూరల్ ఏరియా పంచాయతీల విలీనం జరిగితే గ్రేటర్ కార్పొరేషన్ (గ్రేటర్ సిటీ) అవుతుంది.

వాతావరణంసవరించు

Climate data for Palakollu
Month Jan Feb Mar Apr మే Jun Jul Aug Sep Oct Nov Dec Year
Average high °C (°F) 27.7 30 32.8 35 37 36.3 32.4 32.2 32 31 28.8 27.6
Average low °C (°F) 19.2 20.9 22.8 26 27.8 27.3 25.6 25.6 25.6 24.6 21.1 19.4
Precipitation mm (inches) 1 6 4 7 41 145 266 190 191 286 52 19 1208
Source: India Meteorological Department (climate data)[5]


ఈ మండలంలో పనిచేసిన తహసీల్దార్లుసవరించు

ప్రముఖులుసవరించు

 • స్వాతంత్ర్య పోరాటములో పాల్గొనిన ప్రముఖ వ్యక్తి అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి.
 • తెలుగులో గజల్ సంగీత, కవితా ప్రక్రియలకు మంచి ప్రజాదరణ తెచ్చిన గజల్ శ్రీనివాస్ కూడా పాలకొల్లు వాడే.
 • మాండొలిన్ వాయిద్యంపై సంగీతాన్ని పలికించడంలో చిన్నతనం లోనే పేరుపొందిన యు.శ్రీనివాస్ జన్మ స్థానం పాలకొల్లు.

సినీరంగములో ప్రముఖులుసవరించు

సంగీత విద్వాంసులుసవరించు

వినోద మాధ్యమంసవరించు

పాలకొల్లు పట్టణంలో ప్రజల వినోదార్థం పది సినిమా థియేటరులు మరియు లలితకళాంజలి నాటక అకాడమీలు ఉన్నాయి. సినీ రంగములో ప్రసిద్దులైన వారు సైతం వారి సొంత పట్టణములో చలన చిత్ర ప్రదర్శన శాలలు నిర్మించడంతో పట్టణం నలు మూలలా సినీ వినోదం సంమృద్ధిగా లభించుచున్నది. ప్రదర్శన శాలల జాభితా-

 • శ్రీనివాసా థియేటర్ {బస్టాండు వెనుక}
 • అడబల థియేటర్ {బస్టాండు సమీపంలో}
 • అడబల మినీ థియేటర్ {బస్టాండ్ సమీపంలో}
 • శ్రీనివాసా డిజిటల్ థియేటర్ {ఇది రాష్ట్రంలో మొట్టమొదటి మృదులాంత్ర ప్రదర్శనశాల. బస్టాండ్ వెనుక}
 • శ్రీ తేజ థియేటర్ (యడ్ల బజార్)శ్రీ తేజ మిని థియేటర్ (యడ్ల బజార్)this theaters are closed
 • శ్రీనివాసా మినీ డీలక్స్. { బస్టాండ్ వెనుక}
 • గీతా అన్నపూర్ణ థియేటర్ {రైల్వే స్టేషను రోడ్}
 • మారుతీ థియేటర్ {రామ గుండం వీధి}
 • రంజనీ సినీ చిత్ర {బస్టాండ్}

(గజలక్ష్మి, వెంకట్రమా, వీర హనుమాన్ థియేటర్లు మూడు ప్రస్తుతం తీసివేయబడినవి) (లక్ష్మీ సాయి ఛిత్రాలయ పేరు శివ పార్వతిగా మార్ఛబడింది. ఈ థియేటర్ కూడా మూతబడినది ) 106.208.122.73 16:36, 2012 జూలై 8 (UTC)

విద్యా సౌకర్యాలుసవరించు

కళాశాలలు.
 • అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల. {బస్టాండ్ వైపు}
 • దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల..{యడ్లబజారు వద్ద}
 • చాంబర్స్ మరియు కామర్స్ కళాశాల. {పూలపల్లె మార్గములో}
 • గౌతమీ జూనియర్ కళశాల. {పూలపల్లె మార్గములో}
 • రైస్ మిల్లర్స్ జూనియర్ కళాశాల. {వీరహనుమాన్ చిత్రప్రదర్శనశాల మార్గములో}
 • ఆదిత్య జూనియర్ కాలేజ్. {బైపాస్ రోడ్డులో}
ఉన్నతపాఠశాలలు.
 • శ్రీ అల్లు వెంకట సత్యనారాయణ మున్స్సిపల్ ఉన్నత పాఠశాల (1996) బ్రాడీపేట 2వ వీధి
 • Narayana e-techno school{near railway station}
 • మాచేపల్లి మాణిక్యం-కంచర్ల నరసింహం ఉన్నత పాఠశాల (1900)
 • బంగారు రామారావు-మాచేపల్లి వెంకటరత్నం ఉన్నతపాఠశాల {ముఖ్యరహదారి}
 • సుభాష్ చంద్రబోస్ మున్స్సిపల్ ఉన్నతపాఠశాల {హౌసింగ్ బొర్దు కాలనీ}
 • Sri Venkatewara Upper Primary పాఠశాల, founder Sri Goteti Jagannadha Rao Garu {హౌసింగ్ బొర్దు}
 • బి.వి.ఆర్.ఎమ్.బాలికల ఉన్నత పాఠశాల {అన్నపూర్ణ దియేటరు వద్ద }
 • బి.వి.ఆర్.ఎమ్.బాలుర ఉన్నత పాఠశాల (అడవిపాలెం,దొడ్డిపట్ల రహదారిన విజయచిత్ర దియేటర్ వద్ద)
 • srisaraswathi sisu mandir (near railway station)
 • రైస్ మిల్లర్స్ ఉన్నత పాఠశాల. {వీరహనుమాన్ చిత్రప్రదర్శనశాల}
 • ఆదిత్య పబ్లిక్ స్కూల్. {బైపాస్ రోడ్డులో}
 • SunshineSchool (Bank Street)
 • St.Mary's School, Yallavanigaruvu.
 • Sri chitanya techno school (Bradipet 2nd street ).
బోర్డు పాఠశాలలు.

రవాణా సౌకర్యాలుసవరించు

పాలకొల్లు నుండి ఎటు వైపునకైనా ప్రయాణము చేయుట అతి సులభము.పాలకొల్లు డిపో కానప్పటికీ ఈ పట్టణం రవాణా నర్సాపురం మరియు భీమవరం మరియు తణుకు మరియు రాజోలు డిపోల మధ్య నుండుట వలన నుండి ప్రతి పది నిముషములకు ఒక బస్సు పాలకొల్లు బస్టాండు నుండి బయలు దేరుతుంటుంది. ఇవేకాక పాలకొల్లు నుండి ప్రరిసరప్రాంతముల ప్రతి చిన్న గ్రామాలకు కూడా సర్వీసులు ఉన్నాయి.

రైలు వసతిసవరించు

ఇతర సర్వీసులు.
 • ఆటోలు
 • టాక్షీలు. {మూడు టాక్షీ స్టాండులు ఉన్నాయి.
 • ప్రైవేటు బస్సులు

పాలకొల్లు మాద్యమముగా అత్యధికంగా నడిచే బస్సుల సర్వీసులు

ఇవికూడా చూడండిసవరించు

వెలుపలి లింకులుసవరించు

 1. బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి 'వేంగీ విషయం'లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35.
 2. Joshi, P. M. (1941). "TEXTILE INDUSTRY AND TRADE OF THE KINGDOM OF GOLKONDA". Proceedings of the Indian History Congress. 5: 609–617. ISSN 2249-1937. Retrieved 24 April 2019.
 3. Subrahmanyam, Sanjay (1990). "Rural Industry and Commercial Agriculture in Late Seventeenth-Century South-Eastern India". Past & Present (126): 76–114. ISSN 0031-2746. Retrieved 24 April 2019.
 4. Subrahmanyam, Sanjay (1988). "A Note on Narsapur Peta: A "Syncretic" Shipbuilding Centre in South India, 1570-1700". Journal of the Economic and Social History of the Orient. 31 (3): 305–311. doi:10.2307/3632014. ISSN 0022-4995.
 5. climate data Information For Palakollu. "Palakollu". climate data. Retrieved April 17, 2018. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=పాలకొల్లు&oldid=2693568" నుండి వెలికితీశారు