పక్కే కేస్సాంగ్ జిల్లా
పక్కే కేస్సాంగ్ జిల్లా, భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా.[1][2] 2018లో తూర్పు కమెంగ్ జిల్లా (విస్థీర్నం 1932 చ.కి.మీ) నుండి పక్కే కేస్సాంగ్ జిల్లా విభజించుట ద్వారా ఏర్పడింది. గతంలో తూర్పు కమెంగ్ జిల్లాలో దక్షిణపు పరిపాలనా విభాగంలో ఐదు ప్రాంతాలు ఉన్నాయి. ఒక కొత్త జిల్లా సృష్టించడం ద్వారా అవి పిజెరాంగ్, పాసా వ్యాలీ (గుమ్టే, రిల్లో గ్రామాలు), పక్కే కెస్సాంగ్ లోని పక్కే కెస్సాంగ్, డిస్సింగ్ పాసో, సీజోసా (పక్కే టైగర్ రిజర్వ్ దాని లోపల ఉంది) గా ఏర్పడ్డాయి. జిల్లా ప్రధాన కార్యాలయం లెమ్మి వద్ద (సెప్పా సమీపంలో) ఉంది.[3] దీనికి పశ్చిమాన పశ్చిమ కామెంగ్ జిల్లా, తూర్పు కామెంగ్ జిల్లా, వాయవ్య దిశలో, సోనిత్పూర్, దక్షిణాన అస్సాంలోని బిస్వానాట్ జిల్లా, ఆగ్నేయంలో పపుమ్ పరే జిల్లా, తూర్పున క్రా దాది జిల్లాతో జిల్లా సరిహద్దులను పంచుకుంది. ఇది తూర్పు కామెంగ్ జిల్లా నుండి 2018 డిసెంబరు 14 న విభజించబడింది.
పక్కే కెస్సాంగ్ జిల్లా | |
---|---|
అరుణాచల్ ప్రదేశ్ జిల్లా | |
Country | India |
State | అరుణాచల్ ప్రదేశ్ |
Established | 2018 |
Headquarters | లెమ్మి |
Time zone | UTC+05:30 (IST) |
Website | official website |
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం సరిహద్దులో జాతీయ రహదారి 13 (ఇది ట్రాన్స్ అరుణాచల్ ప్రధాన ఉన్నత రహదారి)కి దక్షిణంగా ఉన్న జిల్లాలో ఎక్కువ భాగం నమేరి జాతీయ ఉధ్యానవనం పరిధిలో ఉంది.
పరిపాలన, రాజకీయం
మార్చుజిల్లా పక్కే కెసాంగ్ శాసనసభ నియోజకవర్గం, ఇది అరుణాచల్ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గంలో ఒక భాగంగా ఉంది.[4]
పర్యాటక ఆకర్షణలు
మార్చుజిల్లా మొత్తం పచ్చదనంతో కప్పబడిన సుందరమైన పర్వత ప్రాంతంలో ఉంది. జిల్లాలో పర్యాటక ఆకర్షణలు పాసా లోయ, పక్కే లోయ ఉన్నాయి.పాసా లోయ పరిసర శ్రేణులు జిల్లా ఉత్తర భాగాన్ని పిజెరాంగ్ నుండి లుమ్డంగ్,రిల్లో ప్రాంతాల వరకు ఉన్నాయి. పక్కే లోయ, పరిసర శ్రేణులు జిల్లా మధ్య దక్షిణ భాగాలను కలిగి ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ఆకర్షణలు ఈ క్రింది విధంగాఉన్నాయి:[5]
- రాజధాని లెమ్మీ (సెప్పో): గిరిజన నృత్య ఉత్సవాలను నిర్వహిస్తుంది
- లుమ్‌డంగ్: సెప్పా నుండి దక్షిణాన 21 కి.మీ.దూరంలో ఉంది.శీతాకాలంలో వలస పక్షులకు పేరు గడించింది.
- రిల్లో: సెప్పాకు దక్షిణాన 78 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది పేరు గడించిన పర్యాటక ప్రదేశం
- పక్కే-కెస్సాంగ్ కొండ చివరి ప్రాంతం: ఇది సెప్పాకు ఆగ్నేయంగా 144 కి.మీ.దూరంలో ఉంది. హిమాలయాలను పక్కే-కెస్సాంగ్ కొండ చివరి ప్రదేశాల నుండి చూడవచ్చు.
- పాకే లోయ:సెప్పాకు నైరుతి దిశలో 144 కి.మీ.దూరంలో ఉంది.
- సీజోసా విభాగంలోని పక్కే పులుల అభయారణ్యం తేజ్‌పూర్‌కు ఉత్తరాన 64 కి.మీ; సెప్పాకు నైరుతి దిశలో 235 కి.మీ.దూరంలో ఉంది.
- పక్కే నది: చేపలు పట్టటానికి పేరు పొందింది. దీనికి జిల్లా ప్రధాన కార్యాలయం నుండి అనుమతి అవసరం. పక్కే కెస్సాంగ్ ద్వారా సీజోసా వరకు,అస్సాంలోని జియా భరాలి నదిలోకి ప్రవహించి, మధ్య ఉత్తరాన ఉన్న జిల్లాలోకి ప్రవేశిస్తుంది. తరువాత పశ్చిమాన ప్రవహిస్తుంది. చివరకు పక్కే పులుల అభయారణ్య సంరక్షణ కేంద్రం గుండా వెళుతుంది. ఇది మొదట జిల్లాకు దక్షిణం నుండి బయలుదేరుతుంది.
వృక్షజాలం, జంతుజాలం
మార్చు1977లో పక్కే కెస్సాంగ్ జిల్లా 862 చ.కి.మీ (332 చ.మైళ్లు) విస్తీర్ణం కలిగిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు నిలయం.[6]
సీజోసా
మార్చుఇది సీజోసా పక్కే కెస్సాంగ్ జిల్లాలోని ఒక ప్రాంతం. ఇక్కడ అదనపు ఉప కమిషనరు కార్యాలయం ఉంది. ప్రధానంగా నైషి, గాలో, పురోయిక్ ప్రజలు ఇక్కడ నివసిస్తారు. పాకే వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడ ఉంది.సీజోసా పట్టణం పక్కేనది వెంట ఉంది.ప్రతి గురువారం అస్సాంనుండి ప్రజలు ప్రధానంగా ఇటాఖోలా వంటి ప్రదేశాల నుండి కూరగాయలు, బట్టలు మొదలైనవి అమ్మేందుకు వస్తారు. అస్సాం సీజోసా ప్రజలు స్నేహపూర్వక సంబంధాన్ని పంచుకుంటారు. ఇది విహార యాత్రకు గొప్ప ప్రదేశం, ప్రతి సంవత్సరం చాలా మంది పర్యాటకులు సీజోసాకు విహార యాత్ర కోసం వస్తారు. సీజోసా 2004 లో భారీగా వరదలకు గురైంది.దాని అందాన్ని నాశనం చేసింది.కానీ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతోంది. సీజోసా లోపలి లైన్ చెక్ గేట్‌లో అస్సాం ప్రభుత్వం స్థానికంగా ఎన్‌డి డ్యామ్ అని పిలువబడే నీటిపారుదల ఆనకట్టను నిర్మించింది. సీజోసా పర్వత ప్రాంతాల చుట్టూ,అడవి ఏనుగులు, ఇతర అడవి జంతువులు, పక్షి రకాలు ప్రత్యేకంగా పక్కే టైగర్ రిజర్వ్ నుండి హార్బిల్స్ ఉన్నాయి. సీజోసాలో 1986 లో స్థాపించబడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఉంది. ఇది సుమారు పక్కే కేసాంగ్ నియోజకవర్గానికి, అస్సాం చుట్టుపక్కల గ్రామాల నుండి ఇటాఖోలా నుండి సీజోసా ప్రజల 7000 మందికి సేవలు అందిస్తోంది.
జనాభా
మార్చుడోని-పోలో మతాన్ని ఆచరిస్తూ,విభిన్న సంస్కృతులు, నమ్మకాలతో జిల్లాలో ఒకే రకమైన వివిధ తెగలు నివసిస్తున్నాయి. వీటిలో అత్యధిక జనాభా కలిగిన నైషి మొత్తం జిల్లా అంతటా చెల్లా చెదురుగా ఉన్నాయి. ఇతర తెగలు ముఖ్యంగా గాల్లో, పురోయిక్, పక్కే, పాసా, పాపు, డిస్సింగ్, పాసో నది సమీపంలో ఉన్న ప్రాంతాలలో కనిపిస్తారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, జనాభాలో ఎక్కువ భాగం జిల్లా రాజధాని సెప్పాకు మకాం మార్చారు. ఆధునికవాదం ఆరంభంతో, అలాంటివారి నైషికి చెందిన న్యోకుమ్, పురోయిక్ గుమ్కుమ్-గుంపా, గాలోకు చెందిన మోపిన్లు పక్కే కెస్సాంగ్ జిల్లాలో పూర్తిస్థాయిలో ఉన్నారు.
భాష
మార్చుకోరో
మార్చుకోరో అనేది టిబెటో బర్మన్ భాష ,ఇది తూర్పు కామెంగ్ జిల్లాలో అకా (హ్రూసో) లో నివసించే సుమారు 800 నుండి 1200 మంది వరకు ప్రాథమిక పదజాలానికి ప్రత్యేకమైన పదాలతో మాట్లాడతారు.వారి భాష దూర పదాలకు సంబంధించింది.[7][8] తూర్పున తానితో పోలికలు ఉన్నప్పటికీ, ఇది టిబెటో బర్మన్ ప్రత్యేక శాఖగా కనిపిస్తుంది.[9] కోరో టిబెటో బర్మన్ కుటుంబంలోని వివిధ శాఖలలోని ఏ భాషలా కాకుండా ఉంటుంది.[10] బానిసలుగా ఈ ప్రాంతానికి తీసుకువచ్చిన వ్యక్తుల సమూహం నుండి ఇది ఉద్భవించిందని పరిశోధకులు ఊహించారు.[11]
నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక బృందం "ఎండ్యూరింగ్ వాయిసెస్" ప్రాజెక్టులో భాగంగా రెండు హ్రూసో భాషలను (అకా మిజి) పరిశోధన చేస్తున్నప్పుడు కోరోను 2010 లో డేవిడ్ హారిసన్, గ్రెగొరీ ఆండర్సన్, గణేష్ ముర్ముల భాషా బృందం గుర్తించింది.[7] ఇది మునుపటి పరిశోధకులు గమనించారు.[12]
ఇది కూడ చూడు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Arunachal Assembly Passes Bill For Creation Of 3 New Districts". NDTV.com. Retrieved 2018-08-30.
- ↑ "Arunachal Pradesh gets 25th district called Shi Yomi". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2019-02-16.
- ↑ Arunachal Assembly passes bill for creation of 3 new districts: List of Indian states that took birth post-independence, India Today, 30 Aug 2018.
- ↑ "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Archived from the original on 13 August 2011. Retrieved 21 March 2011.
- ↑ Tourist places.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Archived from the original on 23 August 2011. Retrieved 25 September 2011.
- ↑ 7.0 7.1 Morrison, Dan "'Hidden' Language Found in Remote Indian Tribe". National Geographic Daily News, 5 October 2010. Retrieved 5 October 2010
- ↑ Schmid, Randolph E. "Researchers find previously undocumented language hidden in small villages in India" Archived 7 అక్టోబరు 2010 at the Wayback Machine. Sync Retrieved on 5 October 2010
- ↑ "In Search for 'Last Speakers', a Great Discovery". National Public Radio. 5 October 2010. Retrieved 6 October 2010.
- ↑ Khan, Amina (6 October 2010). "Linguists uncover 'hidden' language in north India". Los Angeles Times. Retrieved 6 October 2010.
- ↑ Weise, Elizabeth (6 October 2010). "Linguists discover new language in India". USA Today. Retrieved 6 October 2010.
- ↑ Ethnologue, "Hruso". (Some sound files)