పగడంవారిపాలెం
పగడంవారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
పగడంవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°02′N 80°40′E / 16.04°N 80.67°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | చెరుకుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 309 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం రాంభొట్లపాలెం గ్రామానికి శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ బండ్లమ్మ తల్లి ఆలయo:- పగడంవారిపాలెం గ్రామదేవత శ్రీ బండ్లమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణం పూర్తి అయినది. ఈ సందర్భంగా 2014, ఫిబ్రవరి-7 (శుక్రవారం నాడు) అమ్మవారి విగ్రహానికి గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి మహిళలు, నీళ్ళు వారపోసి హారతులిచ్చారు. వేదపండితులు యగ్నక్రతువులు నిర్వహించారు. బండ్లమ్మ తల్లి దేవాలయ పునహ్ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2014, ఫిబ్రవరి-9 ఆదివారం నాడు, వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో అమ్మవారికి 2014, ఏప్రిల్-13 నుండి 17 వరకు, ఐదురోజులపాటు కొలువులు నిర్వహించెదరు. విగ్రహప్రతిష్ఠ జరిపిన రెండు నెలలలోపు, ఆనవాయితీ ప్రకారం కొలువులు నిర్వహించుచున్నారు.
- శ్రీ రామాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నివహించెదరు.
- శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఈ గ్రామములో పగడంవారి ఇలవేలుపు అయిన శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠను, 2016, ఏప్రిల్-2వ తేదీ శనివారంనాడు ఘనంగా నిర్వహించారు. హోమం, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఆలయంలోని అమ్మవారికి పూజలు చేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. మద్యాహ్నం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.