పచ్చనాకు సాక్షిగా

పచ్చనాకు సాక్షిగా పుస్తకం తెలుగు కథల సంకలన పుస్తకం.ఇందులోని కథల రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు.

పచ్చనాకుసాక్షిగా-బొమ్మ-బాపు

ఈ పుస్తకాన్ని- అందులోని కతలను

          నా అణకవైన అక్క
          జయలక్ష్మికి...
          నా మోసకారి అక్క
          జయలక్ష్మికి...

అంటూ కన్నీళ్లతో, ప్రేమతో, భక్తితో అంకితమిచ్చాడు. కథలకు బాపుబొమ్మలేసాడు.

రచయిత గురించి మార్చు

రచయిత గురించిన ప్రధాన వ్యాసం:నామిని సుబ్రమణ్యం నాయుడు

పుస్తకంలోని విషయాను క్రమనిక మార్చు

ఇందులోని మొత్తం కథలు 31.అవి.

1.ఎర్రని ఎండలో మా అమ్మ కడుపు,2....ఇందంతా నాకడుపు మంట,3.మా ఇంట్లో మాసంకూర,4.మూడేళ్ళూ విద్యాశాఖామంత్రినే...,5.ఊపిరిపోయిన ఊదోడు,6.మా పగోళ్ళు-ఎన్నుమీది గువ్వలు,7.థూ ఈ బతుకు బతకాల్నా?,8.మా ఆవు వంటిదే మా అమ్మ.9.నా రెక్కలున్నంత కాలం,10.లబలబ నోరుకొట్టుకోనా?,11.కష్టం బలే పుణ్యం కదా,12.మా అమ్మ-(మా తాత),13....పడిన వాడిని నాకు తెలుసు, 14.మా నాయిన మట్టిపాదం,15.మా నవ్వులోడి దుఃఖం,16.బండెడు కష్టం చేసినా...,17.అన్నం మాకెంతో పిరిం,18.ఎండలో దీనురాలు,19.మా గడపెక్కిన కత్తెరపల్లాయన,20.నీడ బలే కరువు కదా,21.అంగడి బియ్యం తంగేడుకట్టె,22.మా పూలపూల కోడిపెట్ట,23.అత్తినీరా,ఇడ్నీలో,రొట్టెబిస్కే,24.మాకు చేతనైన వైద్యం,25.ఏడుపుపాట-మా అమ్మది,26.తిరపతి మార్కెట్టులో మాకూరగాయలు,27.నా మీద అలిగిన మాఅమ్మ, 28.పొయ్యి మంటెయ్యకుండా ఇదేమి ముదిగారం?,29.రాత్రిపూట మాఅమ్మ గోష్ట,30.ఒంటికి మించిన కష్టం,31.కొడవకంటి సినక్క-నామిని నారప్ప.

కథల్లోని సారాంశం మార్చు

సుబ్రమణ్యంపుట్టి బుద్దెరిగినప్పటినుంచి మొదలుకొని మనోడు మిట్టూరులోని ఇస్కూలులో(ఎలిమెంటరి స్కూల్లో)సదువు పూర్తైయ్యెంతవరకు,ఇంట్లో,వీధిలో,వూర్లో,ఇస్కూల్లో జరిగిన కతలే "పచ్చనాకుసాక్షిగా".ఇంట్లో పిల్లలకు తండ్రికన్న తల్లిదగ్గరే చనువెక్కువ.నామినికుడా తల్లి కొడవకంటి సినక్క తాన ఎక్కడిలేని ముదిగారం.అమ్మంటే వల్లమాలీన ప్రేమ,అమ్మకొంగువదలడు,అంతలోనే స్టీలుకేరియరుకొనలేదనో,అత్తినీరిపించ్చలేదనో,సీయలకూర వండలేదనో , కొత్తబట్టలు కొనివ్వలేదనో,చెప్పులుకొనలేదనో ఇట్లా దేనికో ఒకదానికి అమ్మమీద అలవికాని రొస్టు,అలక వస్తుంది.అమ్మానాబూతులు తిట్తుకుంటాడు,మరుక్షణం అమ్మపక్కలో చేరిపోతాడు.నామిని నాన్న నారప్ప,అన్న నాగేంద్ర,అక్క జయక్క, పలుకోటంఅయ్యవారు,సవాసగాల్లు ఊదోడు,జయ,జమున, భూలోకరంభ,నవ్వులోడు నాగరాజు,పుష్పావతి, కత్తెరపల్లాయన అందరు కూడా కతల్లోవచ్చి మనల్ని పలకరించి పోతుంటారు.కొన్ని కతలు నవ్విస్తే,కొన్ని కతలు కన్నిళ్ళు రప్పిస్తాయి.ఊదోడిచావు-పచ్చిఎలక్కాయలో గొంతులో అడ్దుకుంటుంది.వయస్సుకొస్తున్న జయమీద వయస్సుతో సంబంధం లేకుండపెద్ద,చిన్నా వెయ్యరానిచోట చేతులేస్తుండే ఆపిల్లపడే బాధ మనుకు వళ్ళుమండివాళ్ళను పట్టుకొని అక్కడిక్కడే బాదేయ్యలనిపిస్తుంది.సుబ్రమన్యంఅమ్మ కస్ఖ్తాలు పగోడికికూడా రావద్దనిపిస్తాయి.

'ఎర్రని ఎండలో మా అమ్మకడుపు' కతలో మధ్యహన్నంపూట ఇస్కూలునుంచి వచ్చిన కొడుక్కి తనవాటా సంగటి పెట్టి మంచినీళ్లతో కడుపునింపుకున్నకన్నతల్లి.అందుకే అమ్మంటే కళ్లెదుటే నడయాడు దేవత.'మాఇంట్లో మాంసంకూర'కతలో మాంసంతెచ్చినరోజుల పిల్లల కుశాలగురించి,'ఊపిరిపోయిన ఊదోడు'కతలో,ఊదోని తల్లి కన్నకొడుకుకు అనారోగ్యంగావున్నప్పుడుకూడా కడుపునిండా పెట్టలేని దారిద్రంగురించి,'అన్నం మాకెంతో పిరిం'లో ఇంటిల్లిపాది కష్టపడిన ఒక్కోరోజు ఒకపూట అన్నంకు బియ్యంలేక పడే ఆరాటం గురించి, ఇలా ప్రతికత ఒకజీవిత సత్యాన్నిపాఠకులకళ్ళముందు సజీవంగా నిలుపుతాయి.కతలో భూతుమాటలు దారాళంగా దొర్లిన,ఎబ్బెట్తుగా అన్పించదు,కథాగమనంలో కలసిపోతాయి.పల్లెటూల్లల్లో భూతుపదాలవాడుక సామాన్యం.చిత్తూరు జిల్లా ప్రాంతియ యాసమాధుర్యాన్ని పాఠకులకు రుచిచూపించాడురచయిత.అమ్మ,నాన్నలగురించి,పిల్లలనుసాకటానికి వాళ్లుపడే కష్టాలను కళ్లముందుంచే ఇలాంటి కథలు ఇంకా ప్రజలభాషలో రావాలి.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు