పటాస్ 2015 జనవరి 23న విడుదలైన తెలుగు సినిమా[1] [2] ఎప్పుడూ విభిన్న కథాంశాలు, చిత్రానువాదంలు అంటూ వెళ్తున్న కళ్యాణ్ రామ్ కు అవేమీ కలిసి రాలేదు. అందుకేనేమో...ట్రెండ్ లో ట్రై చేసి హిట్ కొట్టాలనుకున్నాడు...రొటీన్ కథే అయినా కొత్త కామెడీ సీన్స్ తో కథనం పరుగెత్తించి పటాస్ ని అనుకున్న విధంగా భారీగా పేల్చాడు. దర్శకుడు కొత్తవాడైనా తనకున్న కలం బలంతో డైలాగులు పేల్చి స్క్రీన్ పై చెడుగుడు ఆడేసాడు. సినిమా మొత్తం ఎక్కడా గ్రాఫ్ క్రిందకి పడకుండా పట్టుకుని కళ్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చాడు. మృతి చెందిన ప్రముఖ హాస్యనటుడు ఎమ్.ఎస్ నారాయణకు ఇది ట్రిబ్యూట్ లా, నివాళిలా ఉంది. చివరి షాట్ సైతం ఎమ్.ఎస్ నారాయణ కామెడీ మీదే ఉంటుంది.

పటాస్
థియేటర్లలో విడుదల పోస్టర్
దర్శకత్వంఅనిల్ రావిపూడి
రచనఅనిల్ రావిపూడి
నిర్మాతకళ్యాణ్ రామ్
తారాగణంకళ్యాణ్ రామ్
సాయి కుమార్
ఎం. ఎస్. నారాయణ
శృతి సోధీ
బ్రహ్మానందం
కూర్పుతమ్మిరాజు
సంగీతంపాటలు:
అనూప్‌ రుబెన్స్‌
నేపథ్యం స్కోరు:
మణి శర్మ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
23 జనవరి 2015
దేశంIndia
భాషతెలుగు

కథానేపథ్యం

మార్చు

హైదరాబాద్‌లో రౌడీయిజాన్నీ, రాజకీయాన్నీ కలగలిపి పదిహేనేళ్ళ పైగా చక్రం తిప్పుతున్న వ్యక్తి, స్థానిక పార్లమెంట్ సభ్యుడు జి.కె. (ఆశుతోష్ రాణా). అతను తన రాజకీయ వారసుడిగా తమ్ముడు నానిని తీసుకురావాలని భావిస్తుంటాడు. ఊళ్లో వాళ్లు చేసే అక్రమాలు, అన్యాయాలను నిజాయతీపరుడైన డి.జి.పి. మురళీకృష్ణ (సాయికుమార్) కూడా అడ్డుకోలేకపోతుంటాడు. ఆ సమయంలో ఝార్ఖండ్‌లో ఒక రాజకీయ నాయకుణ్ణి తీవ్రవాదుల బారి నుంచి కాపాడి, అందుకు ప్రతిగా ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ కావాలని పట్టుబట్టి హైదరాబాద్‌కు వస్తాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏ.సి.పి) కల్యాణ్ (కళ్యాణ్ రామ్). తీరా ఈ పోలీసాఫీసర్ ఆ రౌడీల మీద కాకుండా, సదరు డి.జి.పి. మీద కక్షతో, పగ తీర్చుకొనే విధంగా ప్రవర్తిస్తుంటాడు. అవినీతికీ అండగా నిలుస్తుంటాడు. ఎందుకలా చేస్తున్నాడన్నది కాసేపు సస్పెన్స్.

అలాగని హీరో మరీ చెడ్డవాడేమీ కాదు. అనుకోకుండా పరిచయమైన ఒక మూగ, చెవుడు అమ్మాయి కావ్యను సొంత చెల్లెలిలాగా ఆదరిస్తాడు. ఇంతలో ఊళ్ళో ఒక యువతిని జి.కె. తమ్ముడు నాని, బృందం దారుణంగా హత్య చేస్తుంది. ఆ హంతకులకు కూడా హీరో అండగా నిలవబోతే, తీరా ఆ చనిపోయింది - కావ్యేననీ, దుండగుల అత్యాచారం నుంచి ఒక సాఫ్ట్‌వేర్ యువతిని కాపాడబోయి చివరకు తాను బలైందనీ తెలుస్తుంది. అప్పుడు డి.జి.పి. చేసిన హితబోధతో హీరో మారతాడు. నిజాయతీగా ఆ కేసులో నిందితులను బోనెక్కించడానికి ప్రయత్నిస్తాడు.

మరి, ఇంతకీ డి.జి.పీ.కీ, హీరోకూ మధ్య అనుబంధం ఏమిటి? ఆయనపై హీరోకు ఎందుకంత కోపం అనేది సినిమా మధ్యలో ఒక ఫ్లాష్‌బ్యాక్. మబ్బులు విడిపోయి, హీరో కూడా మంచి వైపు నిలబడి పోరాటానికి సిద్ధపడ్డాక, విలన్ ముఠాను ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు, చివరకు వారందరినీ ఎలా శిక్షించాడన్నది మిగతా సినిమా.

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

సంగీతం - సాయి కార్తీక్

  • కెమేరా - సర్వేష్ మురారి
  • కళ- ఎన్. కిరణ్‌కుమార్
  • పోరాటాలు- వెంకట్
  • కూర్పు - తమ్మిరాజు
  • నిర్మాత- కళ్యాణ్ రామ్
  • కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - అనిల్ రావిపూడి

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-01-25. Retrieved 2015-01-25.
  2. http://telugu.filmibeat.com/reviews/kalayan-ram-s-patas-movie-review-043382.html

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పటాస్&oldid=4148014" నుండి వెలికితీశారు