సాయి కుమార్

సినీ నటుడు, డబ్బింగ్ కళాకారుడు
(సాయికుమార్ నుండి దారిమార్పు చెందింది)

సాయి కుమార్ తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు. సాయికుమార్ కుటుంబ సభ్యులంతా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్నారు. తండ్రి పి. జె. శర్మ, ఇద్దరు తమ్ముళ్ళు అయ్యప్ప శర్మ, రవిశంకర్ నటులు, డబ్బింగ్ కళాకారులు. కొడుకు ఆది సినీ నటుడు.

సాయి కుమార్
నవంబర్ 27, 2010న గోవాలోని పంజిమ్‌లో జరిగిన IFFI-2010లో సాయి కుమార్
జననం
పూడిపెద్ది సాయి కుమార్

జూలై 27, 1961
ఇతర పేర్లుడైలాగ్ కింగ్
వృత్తినటుడు
అనువాద కళాకారుడు
వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1976 - ఇప్పటివరకు
గుర్తించదగిన సేవలు
పోలీస్ స్టోరీ
జీవిత భాగస్వామిసురేఖ
పిల్లలుఆది , జ్యోతిర్మయి
తల్లిదండ్రులు
  • పి. జె. శర్మ (తండ్రి)
  • కృష్ణజ్యోతి (తల్లి)
బంధువులురవి శంకర్ , అయ్యప్ప శర్మ (తముళ్లు)

బాల్యం

మార్చు

సాయికుమార్‌ నటుడు పి.జె.శర్మ కుమారుడు. ఈయన స్వస్థలం పెద్దకళ్ళేపల్లి. తల్లి కృష్ణజ్యోతి. ఈమె స్వస్థలం కర్ణాటకలోని బాగేపల్లి. సాయికుమార్‌ మద్రాసులో పుట్టి పెరిగాడు.[1] తండ్రి కూడా డబ్బింగ్ కళాకారుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే ఆ వృత్తిలో ప్రవేశించాడు. కథానాయకులు సుమన్, రాజశేఖర్ ల సినిమాలకు మొదట్లో డబ్బింగ్ చెప్పాడు. కంఠస్వరం, తెలుగు ఉచ్ఛారణ బాగుండటంతో ఆయనకు చిత్ర పరిశ్రమలో నటుడిగా కూడా అవకాశాలు లభించాయి. ఆయనకు భార్య సురేఖ, పిల్లలు ఆది , జ్యోతిర్మయి ఉన్నారు. సాయికుమార్‌ సోదరులు రవిశంకర్ డబ్బింగ్ కళాకారుడు, అయ్యప్ప శర్మ (నటుడు).[2]

సినీరంగం

మార్చు

సాయికుమార్‌ సినీ ప్రస్థానం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైంది. ఆయన డబ్బింగ్‌ చెప్పిన తొలిచిత్రం ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ నటించిన సంసారం అనే సినిమా. కొన్నాళ్ల తర్వాత బాలనటుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. బాలనటుడిగా సాయికుమార్‌ చేసిన తొలిసినిమా దేవుడు చేసిన పెళ్లి. అందులో ఆయన అంధుడిగా నటించాడు. తర్వాత దర్శకుడు మధుసూదన్‌రావు తెరకెక్కించిన జేబు దొంగ సినిమాలో నటించాడు. ముందుగా కన్నడ చిత్రాలలో కథానాయకుడిగా నటించిన తర్వాతే తెలుగు సినిమాలలో నటించాడు.

నటించిన తెలుగు చిత్రాలు

మార్చు
  1. దేవుడు చేసిన పెళ్లి (1975)
  2. స్నేహం (1977)
  3. ఛాలెంజ్ (1984)
  4. అగ్నిపర్వతం (1985)
  5. అమ్మ రాజీనామా (1991)
  6. మేజర్ చంద్రకాంత్ (1993)
  7. ఆయుధం (1990)
  8. కలికాలం (1991)
  9. అంతఃపురం (1998)
  10. [[ఎ.కె.47 (సినిమా)|ఎ.కె.47]] (1999)
  11. శిరిడి సాయి
  12. విష్ణు
  13. శ్రీరామరాజ్యం (2011)
  14. ప్రస్థానం
  15. విజయదశమి
  16. పోలీస్ స్టోరి
  17. కర్తవ్యం
  18. అయ్యారే (2012)
  19. పవిత్ర (2013)[3]
  20. ఒక్కడినే (2013)
  21. దళం (2013)
  22. గలాట (2014)[4]
  23. భగవాన్ (అనువాద చిత్రం)
  24. అబ్దుల్లా (అనువాద చిత్రం)
  25. ఆటో నగర్ సూర్య
  26. పటాస్ (2015)
  27. పండగ చేస్కో (2015)
  28. భలే మంచి రోజు (2015)
  29. శ్రీశ్రీ (2016)
  30. జనతా గ్యారేజ్ (2016)
  31. సరైనోడు (2016)
  32. చుట్టాలబ్బాయి (2016)
  33. సుప్రీమ్ (2016)
  34. నాగభరణం
  35. రాజా ది గ్రేట్ (2017)
  36. జై లవకుశ (2017)
  37. ఓం నమో వేంకటేశాయ (2017)
  38. వైశాఖం (2017)
  39. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018)
  40. సుబ్రహ్మణ్యపురం (2018)
  41. మహర్షి (2019)
  42. శ్రీకారం (2021)
  43. ఎస్ఆర్ కల్యాణమండపం (2021)
  44. అర్ధ శతాబ్దం (2021)
  45. రాజా విక్రమార్క
  46. పల్లె గూటికి పండగొచ్చింది (2022)
  47. వన్ బై టు (2022)
  48. ఎస్5 నో ఎగ్జిట్ (2022)
  49. సార్ (2023)
  50. నాతో నేను (2023)
  51. రామ్ (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) (2024)
  52. మూడో కన్ను (2024)
  53. మెర్సి కిల్లింగ్ (2024)
  54. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (2024)
  55. కమిటీ కుర్రోళ్లు (2024)
  56. లక్కీ భాస్కర్ (2024)
  57. ధూం ధాం (2024)

వెబ్ సిరీస్

మార్చు

పురస్కారాలు

మార్చు
నంది పురస్కారాలు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

టీవీ కార్యక్రమాలు

మార్చు

ఈటీవీలో ప్రసారమైన వావ్, మనం అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 విలేఖరి (27 July 2016). "బర్త్‌డే స్పెషల్‌: నటనలో 'అగ్ని'". ఈనాడు. రామోజీరావు. ఈనాడు.
  2. Sakshi (25 July 2021). "ఘనంగా సాయికుమార్‌ ష‌ష్టిపూర్తి వేడుకలు". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.
  3. "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. Archived from the original on 14 అక్టోబరు 2016. Retrieved 28 జూలై 2019.
  4. సాక్షి, సినిమా (18 March 2014). "ఆండాళ్ గలాటా". Sakshi. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.