అనిల్ రావిపూడి ఒక తెలుగు సినీ రచయిత, దర్శకుడు.[3][4] పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.[5] అంతకు మునుపు కందిరీగ, మసాలా, ఆగడు మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశాడు.

అనిల్ రావిపూడి
జననం (1982-11-23) 1982 నవంబరు 23 (వయసు 41)[1][2]
విద్యఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
విద్యాసంస్థవిజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల
వృత్తిసినీ రచయిత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2008 - ప్రస్తుతం
బంధువులుఅరుణ్ ప్రసాద్ (బాబాయి)

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

అనిల్ స్వస్థలం ప్రకాశం జిల్లా, చిలుకూరువారి పాలెం. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా, అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు. [4] అతని ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్ లో సాగింది. చిన్నప్పటి నుంచే గ్రామంలో ఉండే టెంటు హాలులో కూర్చుని సినిమాలు చూసే అలవాటు కలిగింది. తండ్రికి ఆర్టీసీలో డ్రైవరుగా ఉద్యోగం వచ్చింది. తర్వాత వారి కుటుంబం అద్దంకికి తరలి వచ్చింది. పదో తరగతి దాకా అద్దంకిలో తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరులో చదివాడు. తర్వాత వడ్లమూడి లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివాడు.

సినిమాలు

మార్చు

ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీరంగంవైపు వచ్చాడు. ఇతని బాబాయి అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే. పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు. 2005 లో విడుదలైన గౌతమ్ ఎస్.ఎస్.సి. చిత్రానికి సహాయకుడిగా పనిచేశాడు.[6]

రచయితగా

మార్చు
సంవత్సరం చలన చిత్రం పాత్ర
2008 శౌర్యం సంభాషణ రచయిత
2009 శంఖం సంభాషణ రచయిత
2011 కందిరీగ కథ/ సంభాషణ రచయిత
2012 దరువు సంభాషణ రచయిత
2012 సుడిగాడు సంభాషణ రచయిత
2013 మసాలా సంభాషణ రచయిత
2014 ఆగడు కథ/ సంభాషణ రచయిత
2015 పండగ చేస్కో కథ రచయిత
2021 గాలి సంపత్ స్క్రీన్ ప్లే రచయిత

దర్శకుడిగా

మార్చు

దర్శకుడిగా అనిల్ తొలి సినిమా కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన పటాస్. రెండో చిత్రం సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్. రవితేజ కథానాయకుడిగా నటించిన రాజా ది గ్రేట్ 2017 లో విడుదలైంది.

సంవత్సరం చలన చిత్రం తారాగణం
2018 ఎఫ్2 దగ్గుబాటి వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా
2017 రాజా ది గ్రేట్ రవితేజ , మెహ్రీన్ పిర్జాదా
2016 సుప్రీమ్. సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా
2015 పటాస్ కళ్యాణ్ రామ్, శృతి సోది
2020 సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు, రష్మిక మందన్న
2023 భగవంత్ కేసరి[7] నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌శ్రీలీల

అవార్డ్స్

మార్చు

అనిల్‌ రావిపూడి 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో 2019గాను మోస్ట్‌ పాపులర్‌ డైరెక్టర్‌ (ఎఫ్2) సినిమాకు గాను అవార్డును అందుకున్నాడు.[8]

మూలాలు

మార్చు
  1. "The sequel to F2, F3 will have an extra dose of entertainment, says director Anil Ravipudi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-11-24.
  2. "Anil Ravipudi set for a double hat-trick". The New Indian Express. 9 January 2020. Retrieved 2020-11-24.
  3. కవిరాయని, సురేష్. "I was addicted to cinema: Anil Ravipudi". deccanchronicle.com. దక్కన్ క్రానికల్. Retrieved 22 October 2017.
  4. 4.0 4.1 "ఆ కథ పట్టుకుని రెండేళ్లు తిరిగా!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 22 October 2017. Retrieved 22 October 2017.
  5. వై, సునీత చౌదరి. "Anil Ravipudi's Raja The Great: Not blind to innovation". thehindu.com. ది హిందు. Retrieved 23 October 2017.
  6. "ఇంటర్వ్యూ: నా వ్యక్తిగత జీవితమే 'ఎఫ్‌-2' - cine director anil ravipudi cheppalani vundhi". www.eenadu.net. Retrieved 2021-02-15.
  7. NTV Telugu (9 June 2023). "బాలయ్య తో సినిమా నాకు లైఫ్ లో గుర్తుండి పోతుంది..!!". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
  8. Sakshi (25 September 2021). "'సాక్షి' అవార్డు నాకో సర్‌ప్రైజ్‌ : అనిల్‌ రావిపూడి". Archived from the original on 27 సెప్టెంబరు 2021. Retrieved 27 September 2021.

బయట లంకెలు

మార్చు