పటేల్  సర్ 2017లో జగపతి బాబు ప్రథాన పాత్రలో విడుదలైన చలన చిత్రం .పద్మ ప్రియా, సుబ్బరాజు కిలక పాత్రలో నటించారు. సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని వారాహి చలన చితం పతాకంపై నిర్మించారు.

పటేల్ సర్
దస్త్రం:Patel S. I. R.jpg
చిత్ర పోస్టర్
దర్శకత్వంవాసు పరిమి
నిర్మాతసాయి కొర్రపాటి
రచనపి. విజయ ప్రకాష్ (సంభాషణలు)
స్క్రీన్ ప్లేవాసు పరిమి
కథసునీల్ సుదాకర్
నటులుజగపతి బాబు
పద్మప్రియ
సుబ్బరాజు
సంగీతండి.జె. వసంత్
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుగౌతంరాజు
నిర్మాణ సంస్థ
విడుదల
14 జులై 2017 (2017-07-14)
దేశంభారత దేశం
భాషతెలుగు

కథసవరించు

సుభాష్ పటేల్ (జగపతిబాబు) రిటైర్డ్ ఆర్మీ మేజర్. అతడి దగ్గర ఓ చిన్న పాప ఉంటుంది. ఆ పాపను వెంట బెట్టుకుని వెళ్లి డ్రగ్స్ తయారు చేసే డీఆర్ అనే డాన్ కు చెందిన ముఠా సభ్యుల్ని ఒక్కొక్కరిగా చంపుతుంటాడు. ఈ కేసును ఛేదించడానికి కేథరిన్ (తన్య హోప్) అనే పోలీసాఫీసర్ వస్తుంది. ఆమె పటేల్ చేసే హత్యలకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తుంటుంది. ఐతే పటేల్ తన పని తాను చేసుకుపోతుంటాడు. అతను చివరి టార్గెట్ దగ్గరికి వచ్చేసరికి.. హత్యలు చేస్తున్నది పటేలే అని కనిపెట్టేస్తుంది కేథరిన్. ఇంతకీ ఆర్మీలో పని చేసి వచ్చిన పటేల్.. ఇలా హత్యలెందుకు చేస్తుంటాడు.. ఆ చిన్న పాపతో అతడికి సంబంధమేంటి.. అతను తాను చంపాలనుకున్న వాళ్లందరినీ చంపేశాడా లేదా అన్నది మిగతా కథ.

తారగణంసవరించు

సుభాష్ పటేల్, వల్లభ్ పటేల్ గా జగపతి బాబు (ద్విపాత్రాభినయం)

రాజేశ్వరి "రాజి"గా పద్మప్రియ

ఏ.సి.పి. విశ్వాస్‌గా సుబ్బరాజు

ఏ.సి.పి. కెతరిన్‌గా తాన్యా హోప్[2]

భారతిగా ఆమని

పౌడర్ పాండుగా పోసాని కృష్ణ మురళి

పాటల జాబితాసవరించు

 డి.జే. వసంత్ రచించిన సంగీతం. వేల్ రికార్డ్స్ కంపెనీలో విడుదలయినది.

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "పటేల్ పటేల్ సర్"  భార్గవి పల్లవి, స్వీకర్ అగస్తి , రమ్యా బెహ్రా 3:24
2. "మనసే తొలిసారి"  అనురాగ్ కులకర్ణి, బేబి మేఘనా నాయిడు , బేబి జ్యోతిర్మయి 4:37
3. "యెన్ని మాటలెన్ని"  సాయి చరణ్, సత్య యమిని 4:48
4. "నిమ్మి నిమ్మి"  డి.జె. వసంత్ 3:57
మొత్తం నిడివి:
16:46

మూలాలుసవరించు

  1. "Patel S. I. R.(Overview)". Filmibeat.
  2. "review – Deccanchronicle". deccanchronicle.com. Archived from the original on 20 March 2018. Retrieved 25 January 2020.

భాహ్య లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పటేల్_సర్&oldid=2881881" నుండి వెలికితీశారు