పట్శాల

అసోం రాష్ట్రంలోని బాజాలి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

పట్శాల, అసోం రాష్ట్రంలోని బాజాలి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఈ పట్టణం 11,242 జనాభాతో 2.74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.[1] మొబైల్ థియేటర్లకు ఈ పట్టణం పేరొందింది.[2]

పట్శాల
సిఖ్యా నగరి, నాట్య నగరి
పట్టణం
పట్శాల is located in Assam
పట్శాల
పట్శాల
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
పట్శాల is located in India
పట్శాల
పట్శాల
పట్శాల (India)
Coordinates: 26°29′58″N 91°10′45″E / 26.499382°N 91.179271°E / 26.499382; 91.179271
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లాబాజాలి
Government
 • Bodyపట్శాశ పట్టణ కమిటి
 • వార్డుల సంఖ్య10
విస్తీర్ణం
 • Total2.74 కి.మీ2 (1.06 చ. మై)
జనాభా
 (2011)
 • Total11,242
భాషలు
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
781325
టెలిఫోన్ కోడ్91-3666
ISO 3166 codeIN-AS
Vehicle registrationఏఎస్

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పట్శాల పట్టణాన్ని 10 వార్డులుగా విభజించారు. ఈ కమిటీకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.[3]

1968లో పట్శాల పట్టణ కమిటీ స్థాపించబడింది.

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్శాల పట్టణంలో 11,242 జనాభా ఉంది, ఈ జనాభాలో 5,824 (51.8%) మంది పురుషులు కాగా, 5,418 (48.19%) మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో 0-6 సంవత్సరాల వయస్సు గలవారు 1040 (9.25%)మంది ఉన్నారు.[4]

మొత్తం జనరల్

(ఇతర వర్గాలతో సహా)

షెడ్యూల్ కులం షెడ్యూల్ తెగ పిల్లలు
మొత్తం 11,242 10,680 350 212 1,040
పురుషులు 5,824 5,540 187 97 544
స్త్రీలు 5,418 5,140 163 115 496

స్త్రీ పురుష నిష్పత్తి

మార్చు

పట్శాల (టిసి)లో 1000 మంది పురుషులకు 930 మంది మహిళలు ఉన్నారు. 2001 నుండి 2011 వరకు లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 89 మంది మహిళలగా పెరగగా, బాలల లింగ నిష్పత్తి 1000 మంది అబ్బాయిలకు 33 మంది బాలికలగా తగ్గింది.[4]

కులాలవారిగా లింగ నిష్పత్తి (1000 మంది పురుషులకు ఆడవారు) (2011)
మొత్తం జనరల్

(ఇతర వర్గాలతో సహా)

ఎస్సీ ఎస్టీ పిల్లవాడు
2011 930 928 872 1186 945

అక్షరాస్యత

మార్చు

ఈ పట్టణంలో మొత్తం 9467 మంది అక్షరాస్యులు ఉండగా, వారిలో 5029 మంది పురుషులు కాగా, 4438 మంది మహిళలు ఉన్నారు. పట్శాల అక్షరాస్యత రేటు (6 ఏళ్లలోపు పిల్లలు మినహాయించి) 93% ఉండగా, ఇందులో 95% మంది పురుషులు, 90% మంది స్త్రీలు ఉన్నారు. అక్షరాస్యత 4% పెరగగా, పురుషుల అక్షరాస్యత 2%, మహిళా అక్షరాస్యత 6% పెరిగింది.[4]

కార్మికుల వివరాలు

మార్చు
కార్మికుడు (మొత్తం జనాభాలో) ప్రధాన కార్మికుడు (కార్మికులలో) మార్జినల్ కార్మికులు (కార్మికులలో) కార్మికుల కానివారు (మొత్తం జనాభాలో)
మొత్తం 33.3% 29.4% 3.9% 66.7%
పురుషులు 49.8% 45.3% 4.5% 50.2%
స్త్రీలు 15.5% 12.2% 3.3% 84.5%


పట్శాల పట్టణ కమిటీ పరిధిలో 2,759 ఇళ్ళు ఉన్నాయి. ఇది పట్టణ ప్రజలకు తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను అందిస్తుంది. పారిశుధ్య సౌకర్యానికి, రోడ్లు నిర్మించడానికి, ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ కమిటీకి అధికారం ఉంది. [3]

సంస్కృతి

మార్చు

మొబైల్ థియేటర్లు

మార్చు

పట్శాల పట్టణం మొబైల్ థియేటర్లకు పేరొందినది. అస్సాంలో వీటిని భ్రమ్యామన్ థియేటర్ అని పిలుస్తారు.[2] ఈ బృందాలు అస్సాంతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా ప్రదర్శనలు ఇస్తాయి. ప్రతి సంవత్సరం జూన్/జూలై నుండి ప్రారంభమై, ఆగస్టు/సెప్టెంబరు నెల నుండి నాటకాలను ప్రదర్శించి, మార్చి/ఏప్రిల్‌లో యాత్రలను ముగించుకుంటాయి. ప్రతి బృందంలో స్వంత కళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ప్రదర్శనలకు కావలసిన సామాగ్రి (విద్యుత్, ధ్వని పరికరాలు)తో పాటు ఈ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాలకు వెళతారు. ప్రస్తుతం, పట్శాల పట్టణంలో ది కోహినూర్ థియేటర్, ది అబాహన్ థియేటర్, ది రాజ్ముకుట్ థియేటర్. మూడు భ్రామ్యామన్ బృందాలు ఉన్నాయి. అస్సాం మొట్టమొదటి మొబైల్ థియేటర్ నటరాజ్ థియేటర్ పాట్శాలలోనే ప్రారంభించబడింది.[5][6]

దేయోధని నృత్యం

మార్చు

పాట్శాలలో పుట్టిన దేయోధని నృత్యం దక్షిణ భారత రూపానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అస్సాం దేవదాసి నృత్యం 1,000 సంవత్సరాల పురాతన సాంప్రదాయం కలది. 7వ శతాబ్దం నుండి దేవదాసి వ్యవస్థ అమల్లో ఉంది. దేవదాసి వ్యవస్థలో భాగంగా బాలికలను శైవ, శక్తి, వైష్ణవ దేవాలయాలకు నృత్యం చేయడానికి పంపించేచారు. కాళిక పురాణం, యోగిని తంత్రం[7] వంటి పురాతన గ్రంథాలు ఈ ఆచార నృత్యాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతాయి. ఈ ప్రదర్శన చూసిన బిష్ణు ప్రసాద్ రభా అనే వ్యక్తి ఈ నృత్య రూపకానికి ప్రచారం కలిపించారని చెబుతారు. ప్రస్తుతం ఈ కళను కాపాడే ప్రయత్నంలో దిలీప్ కాకాటి అనే వ్యక్తి అమ్మాయిల బృందానికి శిక్షణ ఇస్తున్నాడు.[8]

పరిమళ ద్రవ్యమైన మాడేరికి కూడా పాట్శాల పట్టణం పేరొందింది.

చదువు

మార్చు

1926లో స్థాపించబడిన బాజాలి హయ్యర్ సెకండరీ స్కూల్, 1955లో స్థాపించబడిన బాజాలి కళాశాల[9] ఈ ప్రాంతంలోని పురాతన విద్యాసంస్థలు. పట్శాలను అస్సాం రాష్ట్ర విద్యా పట్టణం (ఎడ్యుకేషనల్ టౌన్) గా పిలుస్తారు. ఇక్కడ శంకర్దేవ్ శిశు విద్యానికేతన్, పట్శాల సిక్షపిత్ ఆదర్శ హైస్కూల్, జూనియర్ కాలేజ్, అనుందోరం బోరూహ్ అకాడమీ[10], కృష్ణకాంత హండికి జూనియర్, డిగ్రీ కళాశాల మొదలైనవి ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి.[11]

రవాణా

మార్చు

పట్శాల నుండి వివిధ ప్రదేశాలకు వెళ్ళే రైళ్ళ జాబితా[12]:

రైలు సంఖ్య (పైకి / క్రిందికి) రైలు పేరు రైలు రకం
55713/55714 రంగియా జంక్షన్ - న్యూ జల్పాయిగురి ప్యాసింజర్ ప్రయాణీకులు
55801/55802 మనస్ రినో ప్యాసింజర్ ప్రయాణీకులు
15469/15470 అలీపూర్ డువార్ జంక్షన్ - లమ్డింగ్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్
55809/55810 గౌహతి - న్యూ బొంగైగావ్ జంక్షన్ ప్యాసింజర్ ప్రయాణీకులు
55753/55754 అలీపూర్ డువార్ జంక్షన్ - గౌహతి సిఫంగ్ ప్యాసింజర్ ప్రయాణీకులు
15471/15472 అలీపూర్ దువార్ - కామాఖ్యా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్
15959/15960 కమ్రప్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్
  • రోడ్డుమార్గం: పట్శాల పట్టణం మీదుగా 31వ జాతీయ రహదారి వెళుతోంది. ఈ పట్టణం నుండి అస్సాంలోని అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. భూటాన్‌ను అస్సాంతో కలుపుతున్న 152వజాతీయ రహదారి 152 పట్శాల నుండే ప్రారంభమవుతుంది.

మూలాలు

మార్చు
  1. "Census of India 2011, Pathsala". Census Of India. Retrieved 2020-12-18.
  2. 2.0 2.1 "The mobile theatres of Assam". assam.org. Retrieved 2020-12-18.
  3. 3.0 3.1 "Pathsala Town Committee-Home". pathsalatc.org.in. Retrieved 2020-12-18.
  4. 4.0 4.1 4.2 "Pathsala Town Committee City Population Census 2011-2019". www.census2011.co.in. Retrieved 2020-12-18.
  5. "A List of Mobile theatres in Assam" (PDF). Retrieved 2020-12-18.
  6. "Pathsala Town Committee | Culture". pathsalatc.org.in. Archived from the original on 2020-02-18. Retrieved 2020-12-18.
  7. Dr. Kamal Nayan Patowari. "The Kalika Puraa and the Yogini Tantra:A Comparative Study in Reference to Great Indian Rivers" (PDF).
  8. IANS (2017-03-16). "Assam's Devadasi dance experiences a slow revival". Business Standard India. Retrieved 2020-12-18.
  9. orn
  10. How
  11. A Town is Born - How Pathsala became one of Assam’s major education hubs in the space of a decade "A Town is Born - How Pathsala became one of Assam’s major education hubs in the space of a decade"
  12. Indian Railways Data "Pathsala Station Stoppages for NFR "
"https://te.wikipedia.org/w/index.php?title=పట్శాల&oldid=3808010" నుండి వెలికితీశారు