పడాల అరుణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.[1] ఆమె గజపతినగరం శాసనసభా నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.[2]

పడాల అరుణ
పడాల అరుణ
నియోజకవర్గం గజపతినగరం

వ్యక్తిగత వివరాలు

జననం 1957 ఏప్రిల్ 10
గజపతినగరం మండలం, విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ జనసేన
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం
జీవిత భాగస్వామి పడాల రామానాయుడు
సంతానం కొడుకు: పడాల శరత్ చంద్ర (M.B.A)

కుమార్తెలు: కెంబూరు భార్గవి (M.B.B.S), బొత్స ఇందు ప్రియాంక (M.B.A)

నివాసం గజపతినగరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకురాలు

కుటుంబ నేపథ్యం

1957 ఏప్రిల్ 10న జన్మించిన పడాల అరుణ బి.ఎ, బి.ఎల్ చదివారు. ఆమె తండ్రి బొత్స ఆదినారాయణ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా, 1955లో భోగాపురం శాసనసభా నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా ఎన్నికై ప్రజాసేవలో మంచి గుర్తింపు పొందారు. సమాజ సేవకు అంకితమైన ఈ వారసత్వం అరుణను తీవ్రంగా ప్రభావితం చేసింది. పడాల అరుణ భర్త పడాల రామునాయుడు, కుమారుడు పడాల శరత్ చంద్ర (M.B.A), కుమార్తెలు కెంబూరు భార్గవి (M.B.B.S), బొత్స ఇందు ప్రియాంక (M.B.A)లు అరుణ రాజకీయ ప్రయాణంలో చేదోడుగా నిలుస్తున్నారు.

రాజకీయ ప్రయాణం

పడాల అరుణ 1987లో తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 33 సంవత్సరాలకు పైగా, ఆమె విజయనగరం జిల్లాలోని గజపతినగరం శాసనసభా నియోజకవర్గంలో గణనీయమైన కృషి చేస్తూ పార్టీలో కీలక పదవులను నిర్వహించారు.

అరుణ నిర్వహించిన పదవులు

1987-1989: మండల పరిషత్ అధ్యక్షురాలు - బొండపల్లి మండలం

1989-1994: శాసనసభ సభ్యురాలు, గజపతినగరం శాసనసభా నియోజకవర్గం

1994-2004:  శాసనసభ సభ్యురాలు, గజపతినగరం నియోజకవర్గం

1996-1999: మహిళా & శిశు సంక్షేమం, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి

1999: బొబ్బిలి పార్లమెంటులో పార్లమెంటు సభ్యురాలుగా  పోటీ చేశారు

2000-2004: అధ్యక్షురాలు, జిల్లా తెలుగుదేశం పార్టీ, విజయనగరం

2001-2004: చైర్‌పర్సన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు

2001: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌కి పోటీ చేశారు

2004-2009: శాసనసభ సభ్యురాలు, గజపతినగరం నియోజకవర్గం

2009-2019: తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు

జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పడాల అరుణ

జనసేనలో చేరిన పడాల అరుణ

మాజీ మంత్రి పడాల అరుణ తన రాజకీయ ప్రయాణంలో అసాధారణమైన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించి, గజపతినగరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం,ప్రాంత అభివృద్ధికి విశేషమైన సేవలు అందించారు. పడాల అరుణ 2023 ఆగస్టులో పవన్ కళ్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. అరుణ రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాన్ ఆమెను జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యురాలుగా నియమించారు.

మూలాలు మార్చు

  1. "పడాల అరుణ" (PDF). 2009. Archived from the original (PDF) on 6 November 2023. Retrieved 6 November 2023.
  2. "Election Commission of India 1978-2004 results.Gajapathinagaram". Archived from the original on 2007-09-30. Retrieved 2008-07-01.
"https://te.wikipedia.org/w/index.php?title=పడాల_అరుణ&oldid=4076845" నుండి వెలికితీశారు