పడ్డానండి ప్రేమలో మరి

పడ్డానండి ప్రేమలో మరి 2015లో విడుదలైన తెలుగు సినిమా. నల్లపాటి వంశీ మోహన్ సమర్పణలో పాంచజన్య మీడియా బ్యానర్ పై నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ ఉప్పుటూరి దర్శకత్వం వహించాడు. వరుణ్ సందేశ్, వితికా శేరు హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 14 ఫిబ్రవరి 2015న విడుదలైంది.

పడ్డానండి ప్రేమలో మరి
(2015 తెలుగు సినిమా)
దర్శకత్వం మహేశ్ ఉప్పుటూరి
నిర్మాణం నల్లపాటి రామచంద్రప్రసాద్
తారాగణం వరుణ్ సందేశ్, వితికా శేరు
సంగీతం ఎస్.ఆర్. ఖద్దూస్
ఛాయాగ్రహణం భరణి కె. ధరన్
నిర్మాణ సంస్థ పాంచజన్య మీడియా
విడుదల తేదీ 14 ఫిబ్రవరి 2015
నిడివి 136 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చిత్ర నిర్మాణం మార్చు

ఈ సినిమాను 2 జూన్ 2014న ప్రారంభించారు.[1] ఆడియో ను 26 జనవరి 2015న విడుదల చేశారు.[2]

కథ మార్చు

ఓ కాలేజ్ స్టూడెంట్ రామ్(వరుణ్ సందేశ్), శ్రావణి(వితికా)తో ప్రేమలో పడతాడు. కొన్ని రోజుల తర్వాత రామ్ ప్రేమను శ్రావణి అంగీకరిస్తుంది. కొంతకాలం ఇద్దరూ బాగానే వుంటారు కానీ తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోతారు. అయితే వీరు విడిపోయిన తర్వాత లంకపతి (అరవింద్) అనే రౌడీ శ్రావణిపై కన్నేస్తాడు. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, నిత్యం శ్రావణినే ఫాలో అవుతాడు. ఈ క్రమంలోనే శ్రావణిని లంకపతి కిడ్నాప్ చేస్తాడు. ఇక రామ్ ఈ లంకపతి నుంచి శ్రావణిని ఎలా కాపాడాడు? అసలు రామ్, శ్రావణిల మధ్య మనస్పర్థలు ఎందుకు వచ్చాయి ? చివరకు రామ్, శ్రావణిల ప్రేమ కలిసారా?? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్ : పంచజన్య మీడియా
  • దర్శకుడు: మహేష్ ఉప్పుటూరి
  • నిర్మాత : నల్లపాటి రామాచంద్ర ప్రసాద్
  • సంగీతం: ఖుద్దూర్ ఎఆర్
  • ఛాయాగ్రహణం: భరణి.కె.ధరణ్
  • ఎడిటర్: ప్రవీణ్ పూడి

మూలాలు మార్చు

  1. Sakshi (2 June 2014). "ప్రేమలో పడ్డానంటున్న వరుణ్ సందేశ్". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
  2. The Times of India (2015). "Paddanandi Premalo Mari's audio launched - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 6 సెప్టెంబరు 2017. Retrieved 28 June 2021.
  3. The Times of India (2015). "Paddanandi Premalo Mari". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.