వితికా శేరు

దక్షిణ భారతదేశ చలనచిత్ర నటి

వితిక షేరు దక్షిణ భారతదేశ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది.

వితిక షేరు
Vithika Sheru receiving a memento by director Dr.Prathibha Penumalli and correspondent Dr.A.Madhusudhana Reddy in the 9th Annual Day celebrations of Rainbow Concept School, Mahabubnagar, Telangana State (cropped).jpg
మహుబాబ్ నగర్ లోని రెయిన్ బో కాన్సెప్ట్ స్కూల్ 9వ వార్షికోత్సవంలో పాల్గొన్న వితిక షేరు
జననంఫిబ్రవరి 3, 1993
ఇతర పేర్లువితిక రావు
కీర్తి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామివరుణ్ సందేశ్

జననం - విద్యాభ్యాసంసవరించు

వితిక 1993, ఫిబ్రవరి 3న భీమవరంలో జన్మించింది. ముంబై, హైదరాబాదుల్లో స్కూల్ విద్యను పూర్తిచేసిన వితిక, హైదరాబాదులోని లోహిత ఇన్సిట్యూట్ ఆఫ్ డిజైన్ కళాశాల నుండి డిప్లొమా పట్టా అందుకుంది.[1]

వివాహంసవరించు

సినీనటుడు వరుణ్ సందేశ్ తో 2016, ఆగస్టు 19న వితిక వివాహం జరిగింది.

సినిమారంగ ప్రస్థానంసవరించు

వితిక 11 సంవత్సరాల వయస్సులో బాలనటిగా తన నటన జీవితాన్ని ప్రారంభించి, 15వ ఏట 2008లో అంతు ఇంతు ప్రీతి బంతు (తెలుగు సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులేలో కలర్స్ స్వాతి పాత్ర) కన్నడచిత్రంతో సినీరంగ ప్రవేశంచేసింది.[2] తన అత్తతో సినిమా షూటింగుకు వెళ్ళిన వితికను చూసిన దర్శకుడు కన్నడ సినిమాలో చిన్న పాత్రను ఇచ్చాడు.[1] ఆ తరువాత 2009లో ఉల్లాస ఉత్సాహ సినిమాలో నటించింది.[3]

తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి 2008, 2009లలో ప్రేమించు రోజుల్లో,[4] ఛలో 123,[5] మై నేమ్ ఈజ్ అమృత[6] వంటి తక్కువ బడ్జెట్ తెలుగు చిత్రాలలో కీర్తి పేరుతో నటించింది. తరువాత ఝుమ్మందినాదం, భీమిలి కబడ్డీ జట్టు చిత్రాలలో సహాయనటిగా, ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో ప్రధానపాత్రలో నటించింది. ఈ చిత్రంలో కళాశాల విద్యార్థి పాత్రను పోషించింది.[7] కాస్ట్యూమ్ స్టైలింగ్ కూడా చేసింది.[8] 2014లో ఉయిర్ మోజి సినిమాతో తమిళ సినిమారంగంలోకి ప్రవేశించిన వితిక, ఈ చిత్రంలో అంధురాలైన అమ్మాయిగా నటించింది..[9] ఈ సినిమాలోని పాత్రకోసం బ్రెయిలీని నేర్చుకోవడమేకాకుండా, చాలారోజులు కళ్ళకు గంతలు కట్టుకొని సాధన చేసింది.[10]

2015లో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో ఆమె ప్రధానపాత్రలో నటించింది, ఈ చిత్రం కోసం తన స్వంత దుస్తులను తానే రూపొందించుకుంది.[11] తన రెండవ తమిళ చిత్రం మహాబలిపురంలో నటించింది.[1] విదార్థ్‌తో వేదిక్కై అనే తమిళ చిత్రంలో నటించింది.[12]

ఆర్కేస్ గ్రాండ్ మాల్, భార్గవి ఫ్యాషన్స్, భీమా జ్యువెలరీ, తస్యాహ్ వంటి బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.

నటించిన చిత్రాలుసవరించు

'సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2008 అంతు ఇంతు ప్రీతి బంతు కన్నడ
2009 ఉల్లాస ఉత్సాహ కన్నడ
2009 ప్రేమించు రోజుల్లో తెలుగు కీర్తి
2010 సందడి తెలుగు కీర్తి
2010 ఝుమ్మందినాదం తెలుగు
2010 భీమిలి కబడ్డీ జట్టు తెలుగు
2013 ప్రేమ ఇష్క్ కాదల్ సరయు తెలుగు
2014 ఉయిర్ మోజీ ప్రియ తమిళం
2015 పడ్డానండి ప్రేమలో మరి శ్రావణి తెలుగు
2015 మహాబలిపురం మహాలక్ష్మీ తమిళం

టివీరంగంసవరించు

బాలనటిగా టెలివిజన్ ధారావాహికల్లో నటించింది.[12] 2019లో టెలివిజన్ రియాలిటీ కార్యక్రమమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పోటీలో పాల్గొన్నది.

సంవత్సరం కార్యక్రమం పాత్ర ఛానల్ భాష Exit ఇతర వివరాలు
2019 బిగ్ బాస్ 3 పోటిదారుడు స్టార్ మా తెలుగు టివి రియాలిటి కార్యక్రమం

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 Gupta, Rinku (16 November 2013). "Playing the innocent girl next door". The New Indian Express. Retrieved 29 August 2019.
  2. "Beauty, talent essential for long career: Vithika Sheru (With Image)". Business Standard. 17 May 2013. Retrieved 29 August 2019.
  3. "Beauty, talent essential for long career: Vithika Sheru (With Image)". Sify.com. 17 May 2013. Archived from the original on 29 ఆగస్టు 2019. Retrieved 29 August 2019.
  4. "'Preminche Rojullo' second schedule complete - Telugu Movie News". Indiaglitz.com. 29 January 2008. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 29 August 2019.
  5. "Chalo 1..2..3..' is ready for censoring - Telugu Movie News". Indiaglitz.com. 23 April 2009. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 29 August 2019.
  6. "'My Name is Amrutha' ready for release". The New Indian Express. 10 October 2009. Retrieved 29 August 2019.
  7. sangeetha devi dundoo (8 December 2013). "Love, sex and dhoka". The Hindu. Retrieved 29 August 2019.
  8. "Vithika turns stylist for 'Prema Ishq Kaadhal' - IBNLive". Ibnlive.in.com. 21 May 2013. Archived from the original on 18 మార్చి 2014. Retrieved 29 August 2019.
  9. K. R. Manigandan (4 August 2012). "Confident strides". The Hindu. Retrieved 29 August 2019.
  10. "Vithika on a roll". Deccan Chronicle. 6 January 2014. Retrieved 29 August 2019.
  11. http://www.deccanchronicle.com/140915/entertainment-tollywood/article/offers-pouring-vithika-sheru
  12. 12.0 12.1 Ians (21 May 2013). "Vithika turns stylist for 'Prema Ishq Kaadhal'". Entertainment.in.msn.com. Archived from the original on 13 ఏప్రిల్ 2014. Retrieved 29 August 2019.

ఇతర లంకెలుసవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వితికా శేరు పేజీ