పి. పద్మరాజన్ (23 మే 1945 - 24 జనవరి 1991) ఒక భారతీయ చలన చిత్ర నిర్మాత, చిత్ర రచయిత, రచయిత. అతను మలయాళ సాహిత్యం, మలయాళ సినిమాల్లో విశేష కృషి చేసాడు. పద్మరాజన్ 1980 లలో భరతన్ , కె.జి.జార్జ్ లతో కలిసి మలయాళ చలన చిత్ర పరిశ్రమలో చలనచిత్ర నిర్మాణానికి గాను కొత్త పాఠశాల స్థాపించాడు. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విస్తృతంగా సంచలనాత్మక చిత్రాలను నిర్మించింది. మలయాళ సినిమా పరిశ్రమ చరిత్రలో అతను గొప్ప నిర్మాతగా గుర్తింపు పొందాడు. పద్మరాజన్ మలయాళ సినిమాలో మైలురాళ్ళుగా నిలిచే చిత్రాలు రూపొందించాడు, వీటిలోని కళాఖండాలు ఓరిడత్తొరు ఫయల్వాన్ (1981), అరప్పట్ట కెట్టియ గ్రామత్తిల్ (1986), కరియిల కాట్టు పోలె (1986), నముక్కు పార్కాన్ ముందిరి తోప్పుకళ్ (1986), తూవనతుంబికళ్ (1987), మూన్నాం పక్కం (1988), న్యాన్ గంధర్వన్ వంటివి.

పద్మరాజన్
పి.పద్మరాజన్
జననం
పి.పద్మరాజన్

(1945-05-23)1945 మే 23
కుతుకులం, హరిప్పాడ్, అలెప్పీ, ట్రావెన్స్‌కోర్
మరణం1991 జనవరి 24(1991-01-24) (వయసు 45)
కాలికట్, కేరళ, భారతదేశం
ఇతర పేర్లుపప్పెట్టన్
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత, ఆల్ ఇండియా రేడియో వార్తలు చదివేవాడు
క్రియాశీల సంవత్సరాలు1975 – 1991
జీవిత భాగస్వామిరాధా లక్ష్మి
పిల్లలుఅనంతపద్మనాభన్, మాధవీకుట్టి
వెబ్‌సైటుpadmarajan.org

ప్రారంభ జీవితం

మార్చు

పద్మరాజన్ 1945 మే 23 న అలప్పుజలోని హరిపాడ్ సమీపంలోని ముత్తుకుళంలో జన్మించాడు. ఇది అప్పటి ట్రావెన్కోర్ రాజ్యంలో ఉంది. అతను తుండత్తిల్ అనంత పద్మనాభ పిళ్ళై, న్యావరక్కల్ దేవకి అమ్మ దంపతులకు ఆరవ కుమారునిగా జన్మించాడు. ముత్తుకుళంలో ప్రారంభ పాఠశాల విద్యనభ్యసించిన తరువాత, అతను ఎం.జి. కళాశాలలో చదివాడు. తరువాత యూనివర్శిటీ కాలేజ్ త్రివేండ్రం లో చదువుకున్నాడు. అతను బియస్సీ (రసాయనశాస్త్రం) ను 1963లో పూర్తిచేసాడు. తదనంతరం ముత్తుకుళంలో పండితుడు చెప్పాడ్ అచ్యుత వారియర్ నుండి సంస్కృతం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రోగ్రాం అనౌన్సర్‌గా ప్రారంభించి, ఆల్ ఇండియా రేడియో, త్రిచూర్ (1965) లో చేరాడు, తరువాత పూజప్పుర, త్రివేండ్రం (1968) లో స్థిరపడ్డాడు; అతను 1986 వరకు ఆల్ ఇండియా రేడియోలో ఉంటాడు, అతను సినిమాల్లో పాల్గొనడం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయటానికి ప్రేరేపించింది. అతడు ముత్తుకులంలోని పండితుడు చేప్పాడ్ అచ్యుత వారియర్ వద్ద సంస్కృతం అభ్యసించాడు. అటుపై అతడు ఆల్ ఇండియా రేడియో, త్రిచూర్లో (1965) మొదట కార్యక్రమ ప్రకటనకర్తగా చేరాడు. తరువాత పూజప్పురా, త్రివేండ్రంలో (1968) స్థిరపడ్డాడు; 1986లో చలన చిత్రాల్లో పనులతో తీరికలేక పోవడంతో, స్వచ్ఛందంగా పదవీవిరమణ స్వీకరించే వరకూ, అతడు ఆల్ ఇండియా రేడియోలో కొనసాగాడు.

చిత్రానువాదకుడు, దర్శకుడిగా వృత్తి

మార్చు

అతడి కథలు, మోసం, హత్య, శృంగారం, రహస్యం, ఉద్వేగం, అసూయ, స్వేచ్ఛాభావం, అరాచకవాదం, వ్యక్తి స్వాతంత్ర్యం, సమాజంలోని ఇతర పాత్రల జీవనం గురించి వివరించేవి. వాటిలో కొన్ని మలయాళ సాహిత్యంలో ఉత్తమమైనవిగా పరిగణించబడ్డాయి. అతడి మొదటి నవల నక్షత్రంగళె కావల్ (కేవలం తారలే సాక్ష్యాలుగా ), కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం (1972) పొందింది.

భరతన్ మొట్టమొదటిసారి దర్శకత్వం వహించిన ప్రయాణం (1975) చిత్రానికి చిత్రానువాదం వ్రాయడం ద్వారా అతను మలయాళ చలనచిత్ర ప్రపంచంలో అడుగుపెట్టి, మలయాళ చలనచిత్రాల్లో అత్యుత్తమ చిత్రానువాదకుల్లో ఒకరిగా గుర్తించబడ్డాడు.

ఆ తరువాత అతడు తన స్వంత చిత్రానువాదాలతో ఉన్న చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వాటిలో మొదటిది పెరువళియంబాలం (వీధియే సత్రంగా ) (1979). అవి కళాత్మక, భావాత్మక, సృజనాత్మక ఔన్నత్యాన్ని కలిగి ఉండడమే కాక, సామాన్య ప్రజలు, పండితులు, చలనచిత్ర విమర్శకులలో కూడా ఎంతో కీర్తి పొందాయి. పద్మరాజన్ తన రచనలలో జీవితంలోని అన్ని రంగాలనూ స్పృశించిన ప్రయోగశీలి. అతడి చిత్రానువాదాల్లో అప్పటివరకూ వినని లక్షణాలు, విషయాలు ఉండేవి. తూవానత్తుంబికళ్ (రాత్రిలో తుమ్మెదలు ) లో వానను పాత్రగా చిత్రీకరించాడు. దేశాటనక్కిళి కరయారిల్ల (వలసపక్షులు ఏడవకూడదు ) లో బలమైన స్నేహం, ప్రేమ లను చిత్రీకరించాడు. నముక్కు పార్కాన్ ముందిరి తోప్పుకళ్ (మనం నివసించడానికి తోటలు ), ఒరిడత్తొరు ఫయల్వాన్ (ఒకానొకప్పుడు ఒక పహల్వాన్ ) లలో అసాధారణ ముగింపుతో చిత్రాలను నిర్మించాడు. అతడి చిత్రాలు చాలావరకూ అతడి రహస్య శృంగార తత్వపు ముద్ర కలిగి ఉంటాయి.

అతడి కొన్ని రచనలు ఖచ్చితంగా మలయాళ భాషలో వ్రాసిన నాజూకైన సంగ్రహాలు. అవి ఇంకా అతడి నిశిత దృష్టి, నిర్దిష్ట భావన, మానవ సంబంధాలు, ఉద్వేగాల చిత్రణకు గొప్ప ఉదాహరణలు. అతడి చిత్రాల్లో చాలావరకూ ఆశ్చర్యకరమైన, వెంటాడే ముగింపులు ఉంటాయి. సాధారణంగా మలయాళ చిత్రాల్లో అటువంటివి చాలావరకూ ఉండవు. అతడి పాత్రలు గొప్ప సున్నితత్వం, తీవ్రతతో తెరపై చిత్రీకరించబడతాయి. దృశ్యాలలో ఎక్కువగా హాస్యం కనబడుతుంది. పాత్రల సంభాషణలు ఎంతో సహజంగా, సామాన్య ప్రజల భాషలో ఉంటాయి. కానీ ఒక సున్నితమైన కవిత్వ లక్షణాలు కలిగి ఉంటాయి.

నిజానికి, అతడు అత్యద్భుతంగా రచించిన చిత్రానువాదాల నుండి అతడి దర్శకత్వ ప్రతిభ ఉద్భవిస్తుందని చెప్పవచ్చు: అతడు ఎన్నడూ ఇతరులు వ్రాసిన రచనల ఆధారంగా ఒక చిత్రానికి దర్శకత్వం వహించలేదు. అరుదుగా తనది కాని కథలను అనుసరణగా రచనను చేపట్టడం జరిగింది. ఫలితంగా అతడి రచనా నైపుణ్యంతో పాటుగా అతడికి తన పాత్రలపై అసాధారణమైన పట్టు ఉండేది.

భరతన్‍తో సాహచర్యం

మార్చు

భరతన్, కె. జి. జార్జ్ లతో కలిసి, మలయాళ సినిమా పాఠశాలకు విజయవంతంగా పునాది వేశాడు. ఈ పాఠశాల మేథస్సు, వాణిజ్య ఆకర్షణల మధ్య చక్కటి సమతుల్యతను సాధించడం ద్వారా నడవడానికి ప్రయత్నించింది. ఈ పద్ధతి, 'ఎంతో ప్రసిద్ధ' చిత్రాలలోని కృత్రిమ పాత్రలు, మూస పద్ధతులు, అప్రస్తుత విషయాలు లేకుండా, "పక్కింటి" పురుషులు, స్త్రీలే పాత్రలుగా మలచడం వలన సాధ్యపడింది. భరతన్‍తో కలిసి అప్పటివరకూ మలయాళ చిత్రాల్లో తక్కువగా ఉన్న లైంగికతను తెరపై చూపడంలో అతడు ప్రావీణ్యం సంపాదించాడు.

నటులతో సాహచర్యం

మార్చు

ప్రతిభను గుర్తించడంలో అతడికి ప్రత్యేకమైన నైపుణ్యం ఉండేది. అతను తర్వత కాలంలో భారతీయ చిత్రాల్లో కీర్తి పొందిన ఎందరినో చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు, వారు అశోకన్ (పెరువళియంబాలం ), రషీద్ (ఒరిడత్తొరు ఫయల్వాన్ ), రెహమాన్ (కూడెవిడె ), జయరాం (అపరన్ ), రామచంద్రన్ (నవంబరిండె నష్టం ), అజయన్ (మూన్నాం పక్కం ). ఇంకా అతను నితీష్ భరద్వాజ్ (న్యాన్ గంధర్వన్ ), సుహాసిని (కూడెవిడె ) ; శారి (నముక్కు పార్కాన్ ముందిరి తోప్పుకళ్ ) వంటి నటులను మలయాళం తెరకు పరిచయం చేశాడు.

అతడు ఎందరో నటుల నుండి అత్యుత్తమమైన నటనను రాబట్టాడు. వారు భరత్ గోపి, మమ్ముట్టి, మోహన్‍లాల్, కరమణ జనార్దనన్ నాయర్, రెహమాన్, జగతి శ్రీకుమార్, ఇన్నలేలో సురేష్ గోపి, శోభన, సుమలత, తిలకన్, నేడుమూడి వేణు; నిజానికి మూన్నాం పక్కం లో తిలకన్ పోషించిన పాత్ర అతడి నటజీవితంలో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా చెప్పవచ్చు.

వ్యక్తిగత జీవితం

మార్చు

పద్మరాజన్ భార్య రాధాలక్ష్మి ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగిని. ఆమె అతడి జ్ఞాపకాలను, తన పుస్తకం పద్మరాజన్ ఎండే గంధర్వన్ (పద్మరాజన్, నా గంధర్వుడు ) లో వ్రాసింది. వారి కుమారుడు, పి. అనంతపద్మనాభన్, ఒక రచయిత.

సాహిత్యకారునిగా

మార్చు

నవలలు

మార్చు
  • ఇథా ఐవిడే వరే
  • జలజ్వాల
  • కల్లన్ పవిత్రన్
  • మంజు కలాం నోటా కుతిరా
  • నక్షత్రంగలే కావల్
  • నాన్మకలుడే సూర్యన్
  • పెరువళియంబలం
  • ప్రతీమాయం రాజకుమారియం
  • రతినిర్వేదం
  • రితుభేధంగలుడే పరితోశికం
  • శవవాహనంగలం తేడి
  • ఉదకప్పోల (తూవనతుంబికల్)
  • వడక్కక్కు ఓరు హృదయం
  • విక్రమకాళీస్వరం

చిన్న కథలు

మార్చు
  • అపరాన్ (అపరన్)
  • అవలుడే కథ
  • కరిలక్కట్టు ధ్రువం (కరిలక్కట్టు ధ్రువం)
  • కైవారియుడ్ తెక్కెయట్టం
  • కజిన్జా వసంత కలతిల్
  • లోలా
  • మట్టుల్లావరుడే వెనాల్
  • ఒన్నూ రాండు మూన్ను
  • ప్రహేళిక
  • పుకక్కన్నడ
  • సిఫిలిసింటే నాడకావు
  • అతిర్థి
  • జీవిత చర్య
  • చూండాల్
  • అమృతేథ్
  • స్వయన్
  • మజా
  • మృతీ
  • ఓరు స్త్రి ఓరు పురుషన్
  • కుంజు
  • శూర్పణఖ
  • కైకేయి
  • నిషా శాలభం
  • బన్యన్ అవెన్యూ
  • ఓర్మా
  • ఓరు సమీపకాల దురాంతం
  • నింగలుడే తవలంగల్ నింగాల్క్
  • రాణిమరుడే కుడుంబం
  • ఒరే చంద్రన్మార్

సినిమాలు

మార్చు
  • ప్రయాణం (1975)
  • ఇథా ఐవిడ్ వరే (1977)
  • నక్షత్రంగలే కావల్ (1978)
  • రప్పడికలుడే గాథ (1978)
  • రతినిర్వేదం (1978)
  • సత్రాటిల్ ఓరు రాత్రి (1978)
  • వడక్కక్కు ఓరు హృదయం (1978)
  • పెరువాజియంబలం (1979)
  • కొచు కొట్టు తెట్టుకల్ (1979)
  • ఠాకరా (1979)
  • షాలిని ఎంటె కూటుకారి (1980)
  • ఒరిదాతోరు ఫైయల్వాన్ (1981)
  • కల్లన్ పవిత్రన్ (1981)
  • లారీ (1981)
  • నోవింటె నాష్టం (1982)
  • ఇడావెలా (1982)
  • కూడెవిడ్ (1983)
  • కైకేయి (1983)
  • ఈనమ్ (1983)
  • పరను పరన్న పరన్ను (1984)
  • కనమరాయతు (1984)
  • థింకలజ్చ నల్లా దివాసం (1985)
  • ఓజివుకలం (1985)
  • కరింబిన్‌పూవనక్కరే (రచన) (1985)
  • నముక్కు పార్కన్ ముంతిరి తోప్పుకల్ (1986)
  • కరిలక్కట్టు పోల్ (1986)
  • అరప్పట్ట కేట్టియా గ్రామతిల్ (1986)
  • దేశతానక్కిలి కారయరిల్లా (1986)
  • నోంబరతి పూవు (1986)
  • తూవనతుంబికల్ (1987)
  • అపరాన్ (1988)
  • మూన్నం పక్కం (1988)
  • సీజన్ (1989)
  • ఇన్నాలే (1990)
  • ఈ తనుతా వేలుప్పన్ కలతు (1990)
  • న్జన్ గాంధర్వన్ (1991)

పురస్కారాలు

మార్చు
కేరళ సాహిత్య అకాడమీ పురస్కారాలు
  • 1972: నవల – నక్షత్రాంగలె కవల్
నేషనల్ ఫిల్ం పురస్కారాలు
కేరళ రాష్ట్ర చలన చిత్ర పురస్కారాలు[1]
కేరళ సినిమా విమర్శకుల పురస్కారాలు
  • 1977: ఉత్తమ స్క్రీన్ ప్లే - ఇథా ఐవిడ్ వరే
  • 1982: ఉత్తమ చిత్రం - నోవింటె నాష్టం
  • 1983: ఉత్తమ స్క్రీన్ ప్లే-కూడెవిడ్
  • 1984: ఉత్తమ స్క్రీన్ ప్లే - కనమరాయతు
  • 1986: ఉత్తమ స్క్రీన్ ప్లే - నముక్కు పార్కన్ ముంతిరి తోప్పుకల్, నోంబరతి పూవు
  • 1988: ఉత్తమ స్క్రీన్ ప్లే - అపరన్, మూన్నం పక్కం
  • 1990: ఉత్తమ స్క్రీన్ ప్లే - ఇన్నాలే
ఫిల్ం ఫాన్స్ పురస్కారాలు
  • 1975: ఉత్తమ స్క్రీన్ ప్లే - ప్రయాణం
  • 1977: ఉత్తమ స్క్రీన్ ప్లే - ఇథా ఐవిడ్ వరే
  • 1978: ఉత్తమ స్క్రీన్ ప్లే - రాప్పడికలుడే గాథ, రతినిర్వేదం
  • 1980: ఉత్తమ స్క్రీన్ ప్లే - ఠాకరా
ఇతర పురస్కారాలు
  • 1982: కౌలాలంపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ - ఉత్తమ చిత్రం - ఒరిదాతోరు ఫైయల్వాన్
  • 1982: కౌలాలంపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ - ఉత్తమ స్క్రిప్ట్ - ఒరిదాతోరు ఫైయల్వాన్
  • 1982: ఉత్తమ చిత్రానికి గల్ఫ్ అవార్డు - నోవింటె నాష్టం
  • 1983: ఉత్తమ దర్శకుడిగా పౌర్నామి అవార్డు - కూడెవిడ్
  • 1987: ఉత్తమ కథకు ఫిల్మ్ ఛాంబర్ అవార్డు - తూవనతుంబికల్
  • 1988: ఉత్తమ దర్శకుడికి ఫిల్మ్ ఫేర్ అవార్డు - అపరన్
  • 1990: ఉత్తమ కథకు ఫిల్మ్ ఛాంబర్ అవార్డు - ఇన్నాలే
  • 1991: FAC అవార్డు - న్జన్ గాంధర్వన్

పద్మరాజన్ పురస్కారం

మార్చు

పద్మరాజన్ పురస్కారం లేదా పద్మరాజన్ అవార్డు పద్మరాజన్ మెమోరియల్ ట్రస్ట్ అందజేస్తున్న వార్షిక చలనచిత్ర / సాహిత్య పురస్కారం. ఇది ఒక షీల్డు, ₹ 10,000 నగదు పురస్కారాన్ని కలిగి ఉంది. అవార్డు రెండు విభాగాలలో ఇవ్వబడింది[2]:

  1. ఉత్తమ చిన్న కథకు పద్మరాజన్ అవార్డు
  2. ఉత్తమ చిత్రంగా పద్మరాజన్ అవార్డు

మూలాలు

మార్చు
  1. "Kerala State Film Awards". Public Relations Department, Government of Kerala. Archived from the original on 2 జూలై 2006. Retrieved 15 జూలై 2015.
  2. Padmarajan Puraskaram for writer Paul Zachariah Archived 2010-04-21 at the Wayback Machine. The Hindu. April 4, 2010. Retrieved July 15, 2015.

బాహ్య లంకెలు

మార్చు