పబిత్ర మార్గరీటా

పబిత్ర మార్గరీటా ఒక భారతీయ రాజకీయవేత్త, సినిమా నటుడు, పత్రిక సంపాదకుడు కూడా. ఆయన భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ అస్సాంకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1][2] 2014లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో మార్చి 2022 నుండి చురుకైన సభ్యుడుగా ఉన్నాడు. 2014 నుండి అస్సాం బిజెపి అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు.[3] సోషల్ మీడియా సెల్, అస్సాం బిజెపి, కామరూప్ జిల్లా బిజెపి ప్రభారిగా కూడా ఆయన పనిచేసాడు. ఆయన 2017 నుండి 2021 వరకు అస్సాంలో జ్యోతి చిత్రబన్, గవర్నమెంట్ ఛైర్మన్ గా కూడా పనిచేసాడు.[4] అస్సాంలో నవంబరు 2021 నుండి మార్చి 2022 వరకు[5] ఆయన విద్యార్థులు, యువజన సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సభ్య కార్యదర్శిగా కూడా పనిచేసాడు.[6]

పబిత్రా మార్గరీటా

రాష్ట్ర మంత్రి, భారత ప్రభుత్వం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 9

పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 మార్చి 31
ముందు రాణీ నారా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
నియోజకవర్గం అస్సాం

వ్యక్తిగత వివరాలు

జననం 1974 అక్టోబరు 13
మార్గరీటా, అస్సాం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి గాయత్రీ మహంత
బంధువులు మానస్ రాబిన్ (మేనల్లుడు)
సంతానం 3
నివాసం గౌహతి
పూర్వ విద్యార్థి మార్గరీటా కాలేజ్
అస్సాం టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్

ఆయన రాజకీయవేత్తనే కాకుండా మంచి నటుడిగా కూడా ప్రసిద్ధిచెందాడు. ఆయన నటించిన అతిపెద్ద హిట్ చిత్రాలలో "మోన్ జై" ఒకటి.

ప్రస్తుతం ఆయన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడు.[7] అలాగే ఆయన అస్సాం ముఖ్యమంత్రికి రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.

ఆయన 1998 నుండి 2002 వరకు మాయ మాసపత్రికకు వ్యవస్థాపక ప్రధాన సంపాదకుడిగా ఉన్నాడు. 2002 నుండి 2005 వరకు మరో అస్సామీ సాంస్కృతిక నెలవారీ సారేగామ వ్యవస్థాపక ప్రధాన సంపాదకుడిగా కూడా పనిచేసాడు.[8]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "BJP names Pabitra Margherita for one Rajya Sabha seat in Assam". NORTHEAST NOW (in అమెరికన్ ఇంగ్లీష్). 18 March 2022. Retrieved 29 March 2022.
  2. "Team BJP wins both Rajya Sabha seats in Assam as Opposition unity crumbles". Hindustan Times. 1 April 2022.
  3. "Assam BJP Announces Names Of Office Bearers". Pratidin Time. 18 August 2021. Retrieved 19 August 2021.
  4. "Key Officials | Jyoti Chitraban (Film Studio) Society | Government Of Assam, India". jyotichitraban.assam.gov.in.
  5. "State Level Advisory Committee for Students & Youth Welfare, Assam (SLAC)". Archived from the original on 2022-06-18. Retrieved 2024-06-10.
  6. "Assam approves appointment of chairmen & vice-chairmen for various public sector units; new list issued". Time8. Retrieved 4 November 2021.
  7. "Compositions of Committees | Ministry OF Parliamentary Affairs, Government of India". mpa.gov.in. Retrieved 2022-07-01.
  8. NDTV (11 June 2024). "Pabitra Margherita, The Surprise Addition From Assam To PM Modi's Cabinet". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.