పరిగి పురపాలకసంఘం

పరిగి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] పరిగి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం లోని పరిగి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

పరిగి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
పరిగి పురపాలకసంఘం is located in తెలంగాణ
పరిగి పురపాలకసంఘం
పరిగి పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 17°11′13″N 77°57′04″E / 17.1868810°N 77.9510209°E / 17.1868810; 77.9510209
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు
మండలం పరిగి మండలం
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ ముకుంద అశోక్
 - వైస్ చైర్‌పర్సన్‌ ప్రసన్నలక్ష్మి
పిన్ కోడ్ - 501501
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న పరిగి, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం మార్చు

పరిగి చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°10′34″N 77°52′34″E / 17.176°N 77.876°E / 17.176; 77.876 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 25500 మంది కాగా, అందులో 14300 మంది పురుషులు, 11200 మంది మహిళలు ఉన్నారు. 4225 గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.

పౌర పరిపాలన మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముకుంద అశోక్ చైర్‌పర్సన్‌గా, ప్రసన్నలక్ష్మి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు మార్చు

  1. వాసియా తబసుం
  2. అర్చన కుమారి
  3. వేముల కిరణ్‌కుమార్
  4. వర్ల రవీంద్ర
  5. ప్రసన్న లక్ష్మి
  6. బొంబాయి నాగేశ్వర్ రావు
  7. టి. వెంకటశం
  8. గొల్ల రాములమ్మ
  9. సయ్యద్ షబానూర్ సుల్తానా
  10. జర్పుల శ్రీనివాస్
  11. ఎడిర్ కృష్ణ
  12. ఖాజా బద్రుద్దీన్
  13. ఎర్రగద్దపల్లి అనుసుజ
  14. సమినా బేగం
  15. ముకుంద అశోక్

మూలాలు మార్చు

  1. "Parigi Municipality". parigimunicipality.telangana.gov.in. Retrieved 2021-04-04.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 4 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 4 April 2021.
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 4 April 2021.
  5. admin (2020-05-20). "Parigi municipality Councillors list 2020". Telangana data. Retrieved 17 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు మార్చు