పర్గత్ సింగ్

భారతియా మైదాన హాకీ క్రీడాకారుడు మరియు రాజకీయనాయకుడు

పర్గత్ సింగ్ (జననం 5 మార్చి 1965) భారతదేశపు హాకీ ఆటగాడు, శిరోమణి అకాలిదళ్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. 1992 బార్సీలోనా ఒలంపిక్, 1996 అట్లాంట ఒలంపిక్ పోటీలలో పాల్గొన్న భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం (కెప్టన్ గా) వహించాడు. రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్ పోలీసులతో పనిచేశాడు.

పర్గత్ సింగ్
Personal information
Born (1965-03-05) 1965 మార్చి 5 (వయస్సు: 55  సంవత్సరాలు)
మితాపూర్, జలంధర్
పంజాబ్, భారతదేశం
Height180 cm (5 ft 11 in)

ఛాంపియన్ ట్రోఫిసవరించు

ఇండియా * జర్మనీ (1985, పెర్త్):సవరించు

స్కోరు బోర్డు 1-5 ఉన్న సమయంలో పర్గత్ సింగ్ ముందుకొచ్చి 6 నిమిషాల్లో 4 గోల్స్ చేశాడు. ఈ మ్యాచ్ డ్రా అయినాకాని, పర్గత్ సింగ్ ప్రతి భారతీయుడి హృదయంలో నాయకుడిగా మిగిలిపోయాడు.[1]

ఇండియా * హాలండ్ (1986, కరాచీ)సవరించు

1985 సంవత్సరంలో జర్మనీ వ్యతిరేకంగా అద్భుత ఆటను ప్రదర్శించిన పర్గత్ సింగ్ హాలండ్ తో జరిగిన పోటీలో కూడా బాధ్యతాయుతంగా ఆడి, ఇండియాకు 3-2 విజయంను అందించాడు.

రాజకీయ జీవితంసవరించు

ఎస్ఎడి అభ్యర్థిగా జలంధర్ కంటోన్మెంట్ శాసనసభ స్థానంనుండి నామినేట్ చేయబడి, గెలుపోందారు. [2]

గౌరవాలుసవరించు

జలంధర్ లోని సుర్జిత్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్ సొసైటీ వైస్-ప్రెసిడెంట్ నియమించబడ్డారు.[3]

బహుమతులుసవరించు

క్రమసంఖ్య బహుమతులు సంవత్సరం
1 పద్మశ్రీ[4] 1998
2 అర్జున అవార్డు 1989

మూలాలుసవరించు

  1. "Pargat Singh – ESPNSTAR.com". Cite web requires |website= (help)
  2. "Pargat Singh". timesofindia.indiatimes.com.
  3. "Sports Personalities". మూలం నుండి 2014-10-23 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-07-21. Cite web requires |website= (help)
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Retrieved July 21, 2015. Cite web requires |website= (help)