పర్చూరి అశోక్ బాబు
పర్చూరి అశోక్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు, రాజకీయ నాయకుడు. ఆయన 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. [1]
పర్చూరి అశోక్ బాబు | |||
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం 2019 మార్చి 30 – 2025 మార్చి 29 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | 1959 ఏప్రిల్ 24||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | కృష్ణమూర్తి, సరస్వతి | ||
జీవిత భాగస్వామి | మాధవి | ||
నివాసం | విజయవాడ |
వృత్తి జీవితం
మార్చుపి.అశోక్‌బాబు రాజకీయాల్లోకి రాకముందు వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి ఏసీటీఓగా, ఉద్యోగ సంఘం నేతగా, ఏపీఎన్‌జీఓ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే సమైక్యాంధ్రకు మద్దతుగా ఉదోగ్య జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాల్లో కీలకంగా పనిచేశాడు. ఆయన ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు, లంచ్ అవర్ డిమాన్‌స్ట్రేషన్లు, జాతీయ రహదారుల దిగ్బంధం, రిలే దీక్షలు, సైకిల్, మోటార్ సైకిల్ ర్యాలీలు, మానవహారాలు లాంటి అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు.[2]
రాజకీయ జీవితం
మార్చుపి.అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీఓగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 2019లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు.[3] ఆయన 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ Sakshi (1 March 2019). "అయిదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం". Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021.
- ↑ Sakshi (7 February 2014). "సమ్మెతో సీమాంధ్రలో స్తంభించిన పాలన: అశోక్‌బాబు". Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
- ↑ The Hindu (11 January 2019). "Ashok Babu to join TDP" (in Indian English). Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.