పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి


ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
30 మార్చి 2023 - 29 మార్చి 2029

వ్యక్తిగత వివరాలు

జననం 1971
వల్లిపేడు, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సుజాతమ్మ, సుందరరామిరెడ్డి
నివాసం తిరుపతి
పూర్వ విద్యార్థి ఎంబీఏ
మతం హిందూ మతము

వ్యక్తిగత జీవితం మార్చు

పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, చిల్లకూరు మండలం, వల్లిపేడు గ్రామంలో జన్మించాడు. ఆయన ఎంబీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప పీడీఎఫ్‌ అభ్యర్థి బాబురెడ్డి పొక్కిరెడ్డి పై 1043 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (18 March 2023). "ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా చంద్రశేఖర్‌రెడ్డి". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
  2. HMTV (17 March 2023). "తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి.. పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి గెలుపు". Archived from the original on 21 March 2023. Retrieved 21 March 2023.
  3. Eenadu (21 March 2023). "ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో వైకాపా విజయం". Archived from the original on 21 March 2023. Retrieved 21 March 2023.