పల్లవ హనుమయ్య తెలుగు కవి, రచయిత. అతను రాసిన "విభావరి" కావ్యానికి 1979 ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది.[1]

పి.హనుమయ్య

జీవిత విశేషాలు

మార్చు

పల్లవ హనుమయ్య గుంటూరు జిల్లా చినకూరపాడు గ్రామంలో 1925 లో జన్మించాడు. అతను బి.ఏ ఆనర్స్,ఎం.ఏ డిగ్రీలను పూర్తిచేసాడు. గుంటూరు, విజయవాడ కళాశాలల్లో కొంత కాలం అధ్యాపకునిగా పనిచేసాడు. తరువాత కొంతకాలానికి అధ్యాపక ఉద్యోగానికి రాజీనామా చేసి గుంటూరు నుంచి వెలువడే "కేక" పత్రికకు సంపాదకులుగా పనిచేశాడు. పిమ్మట మరికొన్ని పత్రికలకు కూడా సంపాదక బాధ్యతలు నిర్వర్తించాడు. ఆతర్వాత కాకినాడకు మకాం మార్చాడు. ఆ తర్వాత హైదరాబాదు దత్తాత్రేయ నగర్ కాలనీలో వున్నాడు.

సాహిత్యం

మార్చు

అతను అనేక పద్యాలు, కావ్యాలు, అనిబద్ధ కవితలు రచించాడు. అనేక అనువాదాలు కూడా చేశాడు. జాషువా ప్రభావంతో అతను “పునస్సంధానం “ (1971) ఆనే పద్య కావ్యాన్ని రాసి, ప్రచురించాడు. అప్పుడాయన ఏ.సి కళాశాల లో అథ్యాపకులుగా వున్నాడు.

ముద్రిత రచనలు

మార్చు
  • పునస్సంధానం “ అనే స్వతంత్ర పద్య కావ్యం.
  • ఉమర్ ఖయ్యాం రుబాయీల పద్యాను వాదం,”రుబాయత్ “.
  • టాలస్టాయ్ వార్ అండ్ పీస్ తెలుగు అనువాదం “యుద్ధము..శాంతి “,
  • లూసన్ కథానికల అనువాదం పిచ్చివాని “డెయిరీ “
  • ఛందో బద్ధ ఖండికలు,(ఒక సంపుటి ) ,
  • విభావరి ( అనిబద్ధ కవితా ఖండిక)[2]

అముద్రిత రచనలు

మార్చు
  • కాళిదాసు మేఘసందేశానికి పద్యానువాదం " మేఘ సంగదేశం
  • “ టాగూరు లవర్స్ గిఫ్ట్ (వలపు కానుక)
  • ఖలీల్ జిబ్రాన్ దిగార్డెన్ ఆఫ్ ది ప్రొఫెట్,
  • (ప్రవక్తారామం ) డాక్టర్ జివాగో నవల ,

రచనలు

మార్చు
పునస్సంధానం

ఈ కావ్యంలో 224 పద్యాలున్నాయి. అతను తత్వ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అథ్యయనం చేశారు.ఫిలాసఫీలో బిఏ ఆనర్సు డిగ్రీని పొందారు. ఆ ప్రభావం అతని కావ్యంలో కూడా కనబడుతుంది. కావ్యం లోతైన భావుకతతో, చిక్కని తాత్వికతతో అలరిస్తుంది. అతని భావావేశానికి ప్రతీ పద్యం అద్దం పడుతుంది.

చారిత్రిక ఇతివృత్తం ఈ కావ్య వస్తువు. సలీం తన చిన్న నాటి ప్రేయసి నూర్జహాన్ ను పెళ్ళాడతాడు. 'నిజనాధుని సంహరించిన కర్కశ మోహపీడితుడైన చక్రవర్తి ప్రణయ భిక్షకుడై ,కట్టెదుట కన్పట్టగా..విధిలేక కన్నీటి కౌగిటి నర్పించిన దీనురాలైన “ నూర్జహాను రాణి “ మనః ప్రవృత్తిని, నిజాపరాధాన్ని సమర్థించుకుంటూ ...క్షమాభిక్షనర్థించిన సలీమ్ చిత్త వృత్తిని ఈ కావ్యంలో రస రామణీయకంగా చిత్రించాడు.

విభావరి[3]

ఇది ఆధునిక వచన కావ్యం. 1970లో అతను రాసిన మూడు అనిబద్ధ కావ్యఖండికలలో ఓ 80 కవితలను ఏర్చి కూర్చిన ఆధునిక వచన కావ్యమే “విభావరి “. దీనికి 1979 కుందుర్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. ఈ కవి కవిత్వపు పరిథి చాలా విస్తృతమైనది.ఇక కవితా వస్తువులుఅతిసామాన్యమైన మొర్రిపోయిన కుండలు, పులివిస్తరాకులు,అద్దంలో తప్ప తమను తాము చూసుకోలేని నిర్భాగ్యులు, నిరుపేదలు, కార్మికులు,సంఘం,అవీ ఇవీ అనకుండా దైనందిన జీవితంలో తాను చూసిన,తనకెదురైన సమస్త వస్తువులు ఈకవికలంలో కవిత్వంగా మారాయి. ప్రతీ జీవితం ఒక్కొక్క మహాప్రపంచం. తననుతాను వెతుక్కుంటు చేసే మహాయాత్రే జీవితం ‘..అదే ఈ కావ్య వస్తువు.

మూలాలు

మార్చు
  1. ABN (2022-07-04). "కవిత్వం రాసిన తెలుగు సోక్రటీస్‌". Andhrajyothy Telugu News. Retrieved 2024-10-22.
  2. "ఆధునిక కవిత్వంలో అనుభూతివాదం". Silicon Andhra SujanaRanjani (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-16. Retrieved 2024-10-22.
  3. "Yugodayamlo Naa Pradhana Vibhavari By Pallava Hanumaiah – ::MR IT Books". mritbooks.com. Retrieved 2024-10-22.