గాలి (పవనం)

(పవనం నుండి దారిమార్పు చెందింది)

పవనం (ఆంగ్లం: Wind) అనగా వాయువుల ప్రవాహం. భూమిపై పవనం అనేది ఎక్కువగా గాలి యొక్క కదలిక. అంతరిక్షంలో సౌర పవనం అనేది స్పేస్ ద్వారా సూర్యుని నుండి వాయువుల లేదా కణాల యొక్క కదలిక. బలమైన పవనాలు మన సౌర వ్యవస్థలో నెప్ట్యూన్, శని గ్రహాలపై చూడవచ్చు. వేగవంతమైన పవనాల యొక్క చిన్న బరస్టులను గస్ట్స్ అంటారు. ఒక నిమిషం పాటు కొనసాగే బలమైన పవనాలను స్క్వాల్స్ (ప్రచండ గాలులు) అంటారు. ఎక్కువ సమయం పాటు కొనసాగే పవనాల వంటి బ్రిజీ (చల్లగాలి), గలే, హరికేన్, తుఫాను అని పిలవబడేటటు వంటి అనేకరకములున్నవి. పవనం భూమిని తరలించగలుగుతుంది, ముఖ్యంగా ఎడారులలో ఇది జరుగుతుంది. చల్లని పవనాలు కొన్నిసార్లు పశుగణాలలో చెడ్డ ప్రభావాన్ని చూపుతుంటాయి. పవనాలు జంతువుల యొక్క ఆహార నిల్వలపై, రక్షణ మార్గాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.

Pieter Kluyver - Boom in stormwind.jpg
A weather vane is used to find out where the wind comes from.
Wind socks such as this one are often used on airports. They show the direction of the wind. They can also show how strong the wind is.

భాషా విశేషాలుసవరించు

పవనము [ pavanamu ] pavanamu. సంస్కృతం n. Air, Wind గాలి లేదా వాయువు.[1]

మూలాలుసవరించు