పశుపతి నాథ్ సింగ్

పశుపతి నాథ్ సింగ్ (జననం 11 జూలై 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ధన్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

పశుపతి నాథ్ సింగ్

పదవీ కాలం
2009 – 2024
ముందు చంద్ర శేఖర్ దూబే
తరువాత దులు మహతో
నియోజకవర్గం ధన్‌బాద్

శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1995–2009
నియోజకవర్గం ధన్‌బాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1949-07-11) 1949 జూలై 11 (వయసు 75)
లఖన్‌పర్, పాట్నా, బీహార్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మీరా సింగ్
సంతానం 3
నివాసం ధన్‌బాద్, జార్ఖండ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రాజకీయ నాయకుడు

మార్చు

పశుపతి నాథ్ సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2000 నుండి 2009 వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా, బీహార్ శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా (బిజెపి లెజిస్లేచర్ పార్టీ) పని చేశాడు.[3]

పశుపతి నాథ్ సింగ్ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధన్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ దూబేపై 58,047 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో బొగ్గు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

పశుపతి నాథ్ సింగ్ 2014లో ధన్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ కుమార్ దూబేపై 2,92,954 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో 1 సెప్టెంబర్ 2014 నుండి 31 ఆగస్టు 2015 వరకు సభా సమావేశాలకు సభ్యులు గైర్హాజరుపై కమిటీ సభ్యుడిగా, 1 సెప్టెంబర్ 2014 నుండి 25 మే 2019 వరకు బొగ్గు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 15 సెప్టెంబర్ 2014 నుండి 25 మే 2019 వరకు లోక్‌సభ సభ్యులతో ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన & ప్రభుత్వ అధికారుల ధిక్కార ప్రవర్తనపై కమిటీ, రైల్వే మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడి, 15 సెప్టెంబర్ 2016 నుండి 25 మే 2019 వరకు ప్రైవేట్ సభ్యుల బిల్లులు & తీర్మానాలపై కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[4]

పశుపతి నాథ్ సింగ్ 2019లో ధన్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కీర్తి ఆజాద్ పై 2,92,954 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో బొగ్గు, గనులు & ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[5]

మూలాలు

మార్చు
  1. "Third-time lucky? Litmus test for MP". 31 March 2019. Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  2. Hindustan. "धनबाद लोकसभा सीट : कोल कैपिटल में पशुपतिनाथ सिंह की ट्रिपल हैट्रिक". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  3. The Times of India (7 March 2024). "Speculation rife as BJP mulls candidate change in Dhanbad". Archived from the original on 16 March 2024. Retrieved 24 July 2024.
  4. The Hindu (29 March 2024). "Lok Sabha elections | BJP to face a tough fight in Jharkhand this time" (in Indian English). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  5. DNA India (24 May 2019). "Dhanbad Lok Sabha Election Results 2019 Jharkhand: Kirti Azad loses to PN Singh" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.