పసలపూడి వీరబాబు
పసలపూడి వీరబాబు 2022లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో విరుమాన్ పేరుతో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు ఎం. ముత్తయ్య దర్శకత్వం వహించాడు. కార్తీ, అదితి శంకర్, ప్రకాష్ రాజ్, రాజకిరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.[1]
పసలపూడి వీరబాబు | |
---|---|
దర్శకత్వం | ఎం. ముత్తయ్య |
రచన | ఎం. ముత్తయ్య |
నిర్మాత | సూర్య, జ్యోతిక |
తారాగణం | కార్తీ అదితి శంకర్ ప్రకాష్ రాజ్ రాజకిరణ్ |
ఛాయాగ్రహణం | సెల్వకుమార్ ఎస్.కె |
కూర్పు | వెంకట్ రాజేన్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | 2డి ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 30 సెప్టెంబరు 2022 |
సినిమా నిడివి | 151 నిముషాలు |
భాష | తెలుగు |
కథ
మార్చుపసలపూడికి చెందిన వీరబాబు (కార్తి) చిన్ననాటి నుంచి తన తల్లి మహాలక్ష్మి (శరణ్య) చావుకు తండ్రి భూపతి(ప్రకాష్ రాజ్) కారణం కావడంతో తండ్రిని ద్వేషిస్తుం అతడితో గొడవపడుతుంటాడు. తండ్రి భూపతితో ఉండటం ఇష్టం లేక మామయ్య సత్యమూర్తి (రాజ్‌కిరణ్) దగ్గర పెరుగుతాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి ఇద్దరు కలిసారా ? లేదా ? అన్నదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- కార్తీ
- అదితి శంకర్
- ప్రకాష్ రాజ్
- రాజకిరణ్
- ప్రకాష్ రాజ్
- శరణ్య పోంవన్నన్
- సూరి
- కరుణాస్
- వడివుక్కరసి
- మనోజ్ భారతీరాజా
- సింగంపులి
- ఇళవరసి
- రాజ్ కుమార్
- వసుమిత్ర
- అరుంధతి
- మైనా నందిని
- ఇంద్రజ
- ఇందుమతి
మూలాలు
మార్చు- ↑ Eenadu (1 October 2022). "'పసలపూడి వీరబాబు'గా కార్తి.. నేరుగా ఓటీటీలో తెలుగు వెర్షన్ చూసేయండి". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
- ↑ Eenadu (3 October 2022). "రివ్యూ: పసలపూడి వీరబాబు". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.