పహల్గామ్
పహల్గామ్ దీనిని పెగల్గామ్ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర భారతదేశం, జమ్మూ కాశ్మీర్, అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న పట్టణం.[3] అనంతనాగ్ నగరానికి 45 కి.మీ దూరంలో, లిడ్డర్ లోయలో, లిడ్డర్ నది ఒడ్డున, హిమాలయాలలో 7200 అడుగుల ఎత్తులో ఉంది. పహల్గామ్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, హిల్ స్టేషన్.[4][5][6][7][8] ఇది అమర్‌నాథ్ యాత్రకు ప్రారంభ స్థానం. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.[9]
పహల్గామ్
పెగల్గామ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 34°01′N 75°11′E / 34.01°N 75.19°E | |
దేశం | భారతదేశం ( India) |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | అనంతనాగ్ జిల్లా |
Elevation | 2,740 మీ (8,990 అ.) |
జనాభా (2011) | |
• Total | 5,922 |
భాషలు | |
• అధికారిక భాషలు | కాశ్మీరీ భాష, ఉర్దూ భాష, హిందీ, డోగ్రీ భాష, ఆంగ్ల భాష[1][2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 192126 |
Vehicle registration | JK-03 |
వ్యుత్పత్తి శాస్త్రం
మార్చుపహల్గామ్ అనే పేరు కాశ్మీరీ పదాల నుండి వచ్చింది. పుహేల్ అంటే గొర్రెల కాపరి, గోమ్ అంటే గ్రామం అని అర్ధం. ఇది కాలక్రమేణా పుహెల్‌గోమ్ నుండి పహల్గామ్‌గా మారింది. ఈ ప్రదేశంలో అనేక పచ్చికభూములు ఉంటాయి. ఇక్కడ బఖర్వాల్ ప్రజలు వేసవికాలం నుండి చలికాలం ప్రారంభం వరకు వారి పశువులను మేపుకుంటూ ఇక్కడే ఉంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం, పహల్గామ్‌ను మొదట బైల్ గావ్ (ఎద్దుల గ్రామం) అని పిలిచేవారు, అమర్‌నాథ్ గుహలోకి ప్రవేశించే ముందు శివుడు, నందిని ఇక్కడే విడిచిపెట్టాడు.[10]
భౌగోళికం
మార్చుపహల్గామ్ 34.03°N అక్షాంశం, 75.33°E రేఖాంశం వద్ద ఉంది.[11] లిడ్డర్ వ్యాలీలో పహల్గామ్ కేంద్ర స్థానాన్ని కలిగి ఉంది. ఇది సముద్రమట్టానికి సగటున 2,740 మీటర్లు (8,990 అడుగులు) ఎత్తులో ఉంది.
వాతావరణం
మార్చుపహల్గామ్ సుదీర్ఘ శీతాకాలాలను, తక్కువ సమశీతోష్ణ వేసవిని కలిగి ఉంటుంది.[12]
జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[13] పహల్గామ్ జనాభా 5922. వారిలో పురుషులు 56%, స్త్రీలు 44% ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 35%, భారత జాతీయ సగటు 59.5% కంటే తక్కువగా ఉంది, పురుషుల అక్షరాస్యత 49%, స్త్రీల అక్షరాస్యత 17%. జనాభాలో 14% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారు.
పరిపాలన
మార్చుపహల్గామ్ స్థానిక టౌన్ ఏరియా కమిటీకి అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేతృత్వంలోని పహల్గామ్ డెవలప్‌మెంట్ అథారిటీచే నిర్వహించబడుతుంది.
వృక్షజాలం, జంతుజాలం
మార్చుపహల్గామ్ 90% సతత హరిత శంఖాకార అడవులను కలిగి ఉంది. ఈ అడవిలో నివసించే జంతువులలో కస్తూరి జింకలు, పర్వత మేకలు, గోధుమ ఎలుగుబంట్లు, చిరుతలు, బూడిద కోతులు, అడవి కుందేళ్ళు మొదలైనవి ఉన్నాయి. పక్షులలో గ్రిఫ్ఫోన్ గ్రద్దలు, నీలి పావురాలు, మంచు కోళ్లు, అడవి కాకులు మొదలైనవి ఉన్నాయి.
పర్యాటక ప్రదేశాలు
మార్చుఅమర్నాథ్
మార్చు3,888 మీ (12,756 అడుగులు) ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహ పహల్గామ్‌లో ఉన్న ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం.[14] పురాణం ప్రకారం పహల్గామ్‌లో పార్వతికి పరమశివుడు అమరత్వ రహస్యాన్ని చెప్పాడని నమ్ముతారు. అమర్‌నాథ్ గుహలోకి ప్రవేశించే ముందు శివుడు పహల్గామ్‌లో నందిని, చందన్‌వారిలో చంద్రుడు, శేషనాగ్ సరస్సులో పాములు విడిచిపెట్టాడు అని ప్రజల నమ్మకం.[15]
కోల్హోయ్ గ్లేసియర్
మార్చుకోల్హోయ్ గ్లేసియర్, లిడ్డర్ వ్యాలీలో ఉంది, ఇది కోల్హోయ్ శిఖరం దిగువన ఉన్న హిమానీనదం.[16]
బేతాబ్ వ్యాలీ
మార్చుఇది పహల్గామ్ నుండి 15 కిలోమీటర్లు (9.3 మై) దూరంలో ఉన్న లోయ.
బైసరన్ వ్యాలీ
మార్చుకాశ్మీర్లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పర్యాటక ప్రదేశం, దీనిని "మినీ-స్విట్జర్లాండ్" అని పిలుస్తారు.[17]
మార్తాండ సూర్య దేవాలయం
మార్చుమార్తాండ సూర్య దేవాలయం కాశ్మీర్‌లో ప్రశస్తి పొందిన పురాతన హిందూ ఆలయం. ఇది కాశ్మీర్ లోయలో అనంతనాగ్ పట్టణానికి 9 కి.మీ. దూరంలో ఉంది.
జమ్మూ కాశ్మీర్ లోని కాశ్మీర్ లోయలో గల అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ కు 23 కిలోమీటర్ల దూరంలో, అమర్‌నాథ్ గుహకు వెళ్లే దారిలో ఉంది.
రవాణా
మార్చుశ్రీనగర్, జమ్మూ నగరం నుండి అనంతనాగ్ మీదుగా బస్సులు నడుస్తాయి.
మూలాలు
మార్చు- ↑ "The Jammu and Kashmir Official Languages Act, 2020" (PDF). The Gazette of India. 27 September 2020. Retrieved 27 September 2020.
- ↑ "Parliament passes JK Official Languages Bill, 2020". Rising Kashmir. 23 September 2020. Archived from the original on 24 September 2020. Retrieved 23 September 2020.
- ↑ Betts, Vanessa; McCulloch, Victoria (2014). Footprint Delhi & Northwest India. Footprint Travel Guides. p. 158. ISBN 9781910120866.
- ↑ "Vale of Kashmir | valley, India". Encyclopædia Britannica. Archived from the original on July 16, 2015. Retrieved July 30, 2022.
- ↑ "Jammu and Kashmir | union territory, India". Encyclopædia Britannica. Archived from the original on June 19, 2015. Retrieved July 30, 2022.
- ↑ "Jammu and Kashmir summary". Encyclopædia Britannica. Archived from the original on November 4, 2021. Retrieved July 30, 2022.
- ↑ "Kashmir | Region, Indian subcontinent". Encyclopædia Britannica. Archived from the original on June 17, 2015. Retrieved July 30, 2022.
- ↑ "Kashmir summary". Encyclopædia Britannica. Archived from the original on November 21, 2021. Retrieved July 30, 2022.
- ↑ "Pahalgam: Valley of paradise". Bangalore Mirror. 24 June 2010. Archived from the original on 1 May 2013.
- ↑ Hazra, Rajendra Chandra (2003). Rise of Epic and Purāṇic Rudra-Śiva Or Śiva Maheśvara. Sri Balaram Prakashani. p. 71.
- ↑ "Geography of Pahalgam, Topography of Pahalgam, Pahalgam Climate". pahalgam.jkonline.in. Retrieved 2023-07-19.
- ↑ "Falling Rain Genomics, Inc – Pahalgam". fallingrain.com. Retrieved 1 May 2016.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
- ↑ "Archive News". Retrieved 2020-07-14.
- ↑ Sunita Pant Bansal. (15 November 2012). Hindu pilgrimage;a journey through the holy places of hindus all over india. [Place of publication not identified]: V & S Publishers. p. 121. ISBN 978-93-5057-251-1. OCLC 930451370.
- ↑ N. Ahmed and N. H. Hashimi (1974). "Glacial History of Kolahoi Glacier, Kashmir, India" (PDF). Journal of Glaciology. 13 (68): 279. Bibcode:1974JGlac..13..279A. doi:10.1017/S002214300002308X. Archived from the original (PDF) on 11 December 2013. Retrieved 16 April 2012.
- ↑ "Baisaran Valley Pahalgam | Top Things to Do & Best Time to Visit | J & K Tourism". tour-my-india. Retrieved 2021-09-22.