శేషనాగ్ సరస్సు (సంస్కృతం: शेषनाग झील) జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీర్ లోయలో గల అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ కు 23 కిలోమీటర్ల దూరంలో, అమర్‌నాథ్ గుహకు వెళ్లే ట్రాక్ వద్ద ఉంది. ఇది సముద్ర మట్టం నుండి 3590 మీటర్ల ఎత్తులో ఉంది. దీని గరిష్ట పొడవు 1.1 కిలోమీటర్లు, గరిష్ట వెడల్పు 0.7 కిలోమీటర్లు.[1]

శేషనాగ్ సరస్సు
శేషనాగ్ సరస్సు is located in Jammu and Kashmir
శేషనాగ్ సరస్సు
శేషనాగ్ సరస్సు
ప్రదేశంఅనంతనాగ్, కాశ్మీరు లోయ, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు34°05′37″N 75°29′48″E / 34.093697°N 75.496686°E / 34.093697; 75.496686
సరస్సులోకి ప్రవాహంమంచు కరగటం
వెలుపలికి ప్రవాహంలిడర్ నది
గరిష్ట పొడవు1.1 కిలోమీటర్లు (0.68 మై.)
గరిష్ట వెడల్పు0.7 కిలోమీటర్లు (0.43 మై.)
ఉపరితల ఎత్తు3,590 మీటర్లు (11,780 అ.)
ఘనీభవనండిసెంబరు నుండి మార్చి

చరిత్ర

మార్చు

ప్రాచీన కాలంలో, ఈ ప్రదేశంలో మేఘాలు విస్ఫోటనం చెందడం వల్ల పర్వతాలతో నిండిన లోతైన గాడి ఏర్పడింది. ఆ పర్వతాలు మంచు పలకలతో కప్పబడి ఉండి, నెమ్మదిగా కరిగాయి, తద్వారా నీరు లోతైన గాడిలోకి ప్రవహించి, సరస్సుగా మారిపోయింది. శేషనాగ అనగా నాగరాజు అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం సృష్టి ఏర్పడిన ప్రాథమిక జీవులలో నాగరాజు ఒకరు కనుక దీనికి శేషనాగ్ అని పేరు పెట్టారు.[2][3]

భౌగోళికం

మార్చు

ఈ సరస్సు బ్రౌన్ ట్రౌట్ వంటి అనేక రకాల చేపలకు నిలయం. ఇది శీతాకాలంలో గడ్డకట్టుకుపోయి తీవ్రమైన మంచుతో నుండి ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ పచ్చటి పచ్చికభూములు, మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్నాయి. కాశ్మీర్ లోయలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో శేషనాగ్ సరస్సు ఒకటి. ఇది ఎక్కువగా మంచు కరగడం, పర్వత శిఖరాల నుండి వచ్చే ప్రవాహాల ద్వారా నిండుతుంది. దీని నుండి వచ్చే ప్రవాహం పహల్గామ్ వద్ద లిడర్ నదిలో కలుస్తుంది.[4]

ప్రయాణం

మార్చు

శేషనాగ్ సరస్సు శ్రీనగర్ నుండి తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో, పహల్గామ్ నుండి 23 కిమీ దూరంలో ఉంది. దీనిని చేరుటకు చందన్వారి వరకు రోడ్డు ద్వారా 113 కి.మీ. ప్రయాణం చేసి, అక్కడి నుండి 7 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ సరస్సుకి ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలో అమర్‌నాథ్ గుహ ఉంది. ఈ సరస్సును జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో సందర్శించవచ్చు.[5]

చిత్రాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Raina, HS; KK Vass (May–June 2006). "Some biological features of a freshwater fairy shrimp, Branchinecta schantzi, Mackin, 1952 in the Northwestern Himalayas, India" (PDF). J. Indian Inst. Sci. 86: 287–291. Retrieved 23 April 2012.[permanent dead link]
  2. "Fishes and Fisheries in high altitude lakes, Vishansar, Gadsar, Gangabal, Krishansar". Fao.org.
  3. Petr, T, ed. (1999). Fish and fisheries at higher altitudes : Asia. Rome: FAO. p. 72. ISBN 92-5-104309-4.
  4. "Pahalgam Sheshnag". cambaytours.com. Retrieved 2012-04-23.
  5. "Travel to Sheshnag lake". travelomy.com. Archived from the original on 2013-01-16. Retrieved 2012-04-23.