పాపారావు బియ్యాల

బియ్యాల వెంకట పాపారావు (జననం 1954 జూన్ 14) భారతీయ చలనచిత్ర నిర్మాత, క్రీడా నిర్వాహకుడు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) మాజీ సభ్యుడు. ఆయన 1998లో రూపొందించిన డాక్యుమెంటరీ షార్ట్-లెంగ్త్ ఫిల్మ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ (Willing To Sacrifice) ఉత్తమ నాన్-ఫీచర్ ఎన్విరాన్‌మెంట్ / కన్జర్వేషన్ / ప్రిజర్వేషన్ ఫిల్మ్‌గా నేషనల్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.

పాపారావు బియ్యాల
(బి.వి.పి రావు అని కూడా పిలుస్తారు)
జననం
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుబి.వి.పి. రావు
వృత్తిసినిమా నిర్మాత,
తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు,
మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి,
అస్సాం హోం సెక్రటరీ (1994–1997)[1]

2020 మార్చిలో, ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) గవర్నింగ్ బాడీ సభ్యుని పదవికి రాజీనామా చేశాడు. మాదకద్రవ్యాల రహిత క్రీడలను రూపొందించే ప్రయత్నాలపై పనిచేసే క్లీన్ స్పోర్ట్స్ ఇండియా ఉద్యమం వెనుక ఉండి నడిపించాడు.

కొసావోలో యుద్ధానంతర పాలన, శాంతిని నెలకొల్పడానికి ఆయన ఐక్యరాజ్యసమితిలో ఏడు సంవత్సరాలు పనిచేశాడు. ప్రస్తుతం చలన చిత్రాలను ఆయన దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ఇళయరాజా స్వరకర్తగా యామిని ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన త్రిభాషాచిత్రం మ్యూజిక్ స్కూల్ 2023 మే 12న విడుదలయింది.[2][3]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

బియ్యాల వెంకట పాపారావు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన మునిగలవేడు అనే గ్రామంలో బియ్యాల కిషన్ రావు, అనసూయాదేవి దంపతులకు 1954 జూన్ 14న జన్మించాడు. ఆయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా తల్లి గృహిణి. ఆయన మునిగలవేడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక, మాధ్యమిక తరగతులను తెలుగు మాధ్యమంలో చదివాడు. తరువాత ఆయన ఉన్నత పాఠశాల తరగతులను వరంగల్‌లోని ఎ.వి.వి హైస్కూల్‌లో చదివాడు. వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో పట్టభద్రుడయ్యాడు.

ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బి పూర్తిచేసాడు. ఆయన 1979లో ఇంటర్నేషనల్ లాలో ఎంఫిల్, పిహెచ్‌డి చేయడానికి న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేరాడు. అయితే ఆయన 1982లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి అర్హత సాధించడంతో అతని పిహెచ్‌డి పూర్తి చేయలేకపోయాడు.

కెరీర్

మార్చు

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్

మార్చు

ఆయన 1982లో దేశంలోని ప్రధాన సివిల్ సర్వీస్ అయిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో చేరాడు. జోర్హాట్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (1991-1993), అస్సాం హోం సెక్రటరీ (1994-1997) వంటి అనేక కీలక హోదాల్లో ఆయన విధులు నిర్వహించాడు.

జోర్హాట్ జిల్లా డిప్యూటీ కమీషనర్‌గా మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పర్యవేక్షిస్తూ తీవ్రవాదులకు వ్యతిరేకంగా వారి కార్యకలాపాలలో జిల్లా స్థాయిలో పోలీసు, సైనిక బలగాలను సమన్వయం చేశాడు. 1992లో నదీ కోతకు ఇళ్లు కొట్టుకుపోయిన దాదాపు 500 కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు కొత్త గ్రామాన్ని సృష్టించేందుకు ఆయన సహాయం చేశాడు.

ఆయన అస్సాం హోం సెక్రటరీగా ప్రతిరోజూ తిరుగుబాటు రాజ్యానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ నివేదికలను విశ్లేషించి, హింస చెలరేగకుండా, ప్రజా శాంతిని కాపాడే విధానం, వ్యూహంపై ముఖ్యమంత్రికి సలహా ఇచ్చాడు. యునైటెడ్ లిబరేషన్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA), బోడో లిబరేషన్ టైగర్స్ (BLTF), ఇతర తీవ్రవాద గ్రూపులను రాష్ట్రవ్యాప్తంగా నిర్వీర్యం చేయడంతో పాటు వారికి పునరావాసం, స్వయం ఉపాధి కల్పించాడు.

ఆయన 2005లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ పొందాడు.

స్పోర్ట్స్

మార్చు

బి.వి.పి. రావు పాఠశాల, కళాశాల రోజులలో పలు క్రీడలలో పాల్గొన్న క్రీడాకారుడు. ఆయన ఈక్వెస్ట్రియన్ క్రీడలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆయన 1985 నుండి 1990 వరకు 5 సంవత్సరాలు ఇండియన్ టెన్త్ పెగ్గింగ్ టీమ్‌లో ఉన్నాడు.

స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్, రిఫార్మిస్ట్ గా ఆయన 1984 నుండి 1989 వరకు ఐదు సంవత్సరాల పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేశాడు. ఈ సమయంలో ఆయన "స్పెషల్ ఏరియా గేమ్స్" అనే ఒక ప్రధాన టాలెంట్ హంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించి అమలు చేశాడు. దీని ద్వారా దేశంలోని మారుమూల, గిరిజన ప్రాంతాల నుండి క్రీడాకారు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. ఈ పథకం భారతదేశం అత్యంత విజయవంతమైన ప్రతిభను గుర్తించే ఒకటి కాగా ఏస్ ఆర్చర్ లింబా రామ్‌తో సహా అనేక మంది ఒలింపియన్‌లను తయారు చేసింది.

ఆయన గ్రీస్‌లోని ఇంటర్నేషనల్ ఒలింపిక్ అకాడమీలో ఒలింపిక్ స్టడీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసాడు. ఈ కోర్సు ద్వారా, అతను ఒలింపిక్స్ బిడ్ విశ్లేషణలో నైపుణ్యం సాధించాడు. మాజీ క్రీడాకారులను నిమగ్నం చేయడం ద్వారా స్పోర్ట్స్ అసోసియేషన్‌లలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఆయన పలువురు ఒలింపియన్‌లతో కలిసి క్లీన్ స్పోర్ట్స్ ఇండియా అనే NGOను ఏర్పాటు చేశాడు. ఈ NGO డ్రగ్ ఫ్రీ క్రీడలను ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు

మార్చు

ఆయన 2014లో కేబినెట్ మంత్రి హోదాలో తెలంగాణ ప్రభుత్వంలో పాలసీ అడ్వైజర్‌గా చేరాడు. 2019 వరకు అదే హోదాలో ఆయన ప్రభుత్వం కోసం పనిచేసాడు. తెలంగాణ కొత్త ప్రభుత్వం "TSI పాస్" పెట్టుబడుల పాలసీతో సహా అన్ని కీలక విధాన కార్యక్రమాలలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. కొత్త రాష్ట్రం ఏర్పడక ముందు ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహాత్మక కృషిసల్పాడు.

ఫిల్మ్ మేకర్

మార్చు

ఆయన ఐఏఎస్ అధికారిగా అస్సాంలో వివిధ పోస్టింగ్‌లలో ఉన్నప్పుడు, అతని స్నేహితుడు టామ్ ఆల్టర్ ద్వారా ప్రఖ్యాత చిత్రనిర్మాత జాహ్ను బారువాతో పరిచయం అయ్యాడు. అలా ఆయన బారువా నుండి ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్ నేర్చుకున్నాడు. చిత్రనిర్మాణంపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1996లో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి ఫిల్మ్ మేకింగ్‌లో డిప్లొమా చేసాడు.

ఆయన 1998లో విల్లింగ్ టు సాక్రిఫైస్ అనే డాక్యుమెంటరీ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం 2000లో ఉత్తమ పర్యావరణ/పరిరక్షణ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. 1999లో బ్రాటిస్లావాలోని ఎన్విరాన్‌మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెండు అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.

2023 మేలో విడుదల కాబోతున్న మ్యూజిక్ స్కూల్‌తో సహా ఆయన ఐదు సినిమా స్క్రిప్ట్‌లను సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రానికి ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన హైదరాబాద్‌>లోని యామిని ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి మేనేజింగ్ డైరెక్టర్.

ఆయన బారువా అండ్ రావ్ క్రియేషన్స్ LLPలో భాగస్వామిగా ఉన్నాడు.

భారతదేశంలో మూడు ఫిల్మ్స్ ఫెస్టివల్స్, కొసావోలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం ద్వారా ఆయన తన కెరీర్ మొత్తంలో సినిమాపై తన ఆసక్తిని కనబరుస్తున్నాడు.

ఇతర విద్యా అర్హతలు

మార్చు
  • డిప్లొమా ఇన్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్, డెలావేర్ యూనివర్సిటీ, USA, UN యూనివర్సిటీ, 1989.
  • మాస్టర్స్ ఇన్ స్ట్రాటజిక్ స్టడీస్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్, న్యూఢిల్లీ, ఇండియా, 1998.
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఒలింపిక్ స్టడీస్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ అకాడమీ, గ్రీస్, 1996.

మూలాలు

మార్చు
  1. "Telangana Government Advisors". The Hindu. 4 June 2014.
  2. Namasthe Telangana (7 May 2023). "టెక్నాలజీతో పాటు సృజనాత్మక రంగంలో కూడా యువత ఎదగాలి". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  3. "ఒక ఐఏఎస్‌ మ్యూజిక్‌ స్కూల్‌ | IASs special music school". web.archive.org. 2023-05-07. Archived from the original on 2023-05-07. Retrieved 2023-05-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)