పామర్తి శంకర్
పామర్తి శంకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రం లోని యాదాద్రి - భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు (కార్టూనిస్టు). ఆయన వ్యంగ్యచిత్రాలు, కారికేచర్ల చిత్రణలో ప్రపంచ ప్రఖ్యాతి గడించారు. కార్టూన్ల రంగంలో నోబెల్ బహుమతిగా పేరుపొందిన గ్రాండ్ పురస్కారానికి ఎంపికైన తొలి ఆసియావాసిగా ఆయన చరిత్ర సృష్టించారు.[1][2][3] 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[4]
పామర్తి శంకర్ గౌడ్ | |
---|---|
జననం | మార్చి 3 1966 నాగిరెడ్డిపల్లి గ్రామం, భువనగిరి మండలం నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ఇతర పేర్లు | కార్టూనిస్ట్ శంకర్ |
వృత్తి | సాక్షి దినపత్రికలో ఎడిటోరియల్ కార్టూనిస్టు |
ప్రసిద్ధి | వ్యంగ్య చిత్రకారుడు |
మతం | హిందూ |
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుశంకర్ మార్చి 3న 1966 లో యాదాద్రి - భువనగిరి జిల్లా జిల్లాలోని నాగిరెడ్డిపల్లిలో జన్మించాడు. నల్గొండలోని నాగార్జునా డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు.
వృత్తి జీవితం
మార్చుపామర్తి శంకర్ హైదరాబాద్ నగరంలో ఉద్యోగిగా తన వృత్తి జీవితం ప్రారంభించాడు. ఆయన 1998లో వార్త దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్టుగా ప్రారంభించి, తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రికలో కార్టూనిస్టుగా ఐదేళ్ళు పనిచేసి, 2008 సంవత్సరం నుండి సాక్షి దినపత్రికలో ఎడిటోరియల్ డెస్క్ ప్రధాన కార్టూనిస్టుగా పని చేస్తున్నాడు.
కార్టూన్లు
మార్చుశంకర్ తన ప్రతి కార్టూన్ లోనూ ఒక ప్రత్యేకత చూపించేందుకు ప్రయత్నిస్తాడు. శంకర్ గీసిన అనేక కార్టూన్లు సాక్షి వంటి దినపత్రికలలో ప్రచురితమై ప్రజాదరణ పొందాయి.
కారికేచర్లు
మార్చుశంకర్ గీసే క్యారికేచర్లు వారి వారి స్వభావాలు, మ్యానరిజాలు, ఇజాలు... ఇలా వ్యక్తిగత లక్షణాలను ప్రతిబింబిచటంతో పాటు తమాషాగా ఆకర్షణీయంగా వుంటాయి. బాల్‌థాకరేను పులి లక్షణాల్తో గీసి... ఓ తోక కూడా పెడతారు. బాపూ గారు పైప్ పీల్చడం మానేశారనే విషయాన్ని ఆదరంగా తీసుకుని అతని క్యారికేచర్ లో వారు వాడే పైపులో పకక్షులు గూడు కట్టుకొని ఉన్నట్లు చిత్రించారు. రామభక్త హనుమానుడిగా వర్ణించుకునే వారికి అదనంగా ఓ తోకకూడా తగిలిస్తారు. అసలే బాగా పొడుగు... ఆ పొడుకు తగ్గట్లు సంపాదించుకున్న అమితాబచ్చన్ చాలా పొడగరి కాబట్టి వీరి క్యారీకేచర్ గీసేప్పుడు కొంగలాగా చిత్రిస్తారు. ఒంటికాలితో బాలివుడ్‌ను మేనేజ్ చేయగల కొంగ కాలికి సెల్యులాయిడ్ ఫిల్మ్ చేపలాగా చిక్కి ఉంటుంది. అదేవిధంగా మైక్ టైసన్లూ, ఇటు చార్లీచాప్లిన్లు, చిరంజీవి లాంటి వారెందరో ఇతని క్యారీ కేచర్లలో ఒడుపుగా ఒదిగిపోయారు.[5]
ప్రదర్శన
మార్చుపామర్తి శంకర్ తాను గీసిన కేరికేచర్లతో ఏర్పాటు చేసిన తొలి ప్రదర్శన 2004లో సినీ నటుడు చిరంజీవి ప్రారంభించాడు. ఆయన హైదరాబాద్ లోని కళాకృతి ఆర్ట్ గేలరీలో 2019లో మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా ‘గాంధీ-150 ‘ పేరుతో మహాత్మ గాంధీజీ 40 కేరికేచర్లను ప్రదర్శించాడు. పామర్తి శంకర్ 9 ఫిబ్రవరి 2019లో రవీంద్రభారతిలోని ఆర్ట్ గ్యాలరీలో 'ది ఇంక్డ్ ఇమేజ్' పేరుతో ఏర్పాటు చేసిన కార్టూన్ చిత్రాల ప్రదర్శనను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రారంభించాడు.[6][7][8]
గుర్తింపులు
మార్చు- మొదటి సారి హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన కార్టూన్ల పోటీలో మూడో బహుమతి పొందాడు.
- బ్రెజిల్‌లో అంతర్జాతీయ క్వార్డినాజ్ ఫోర్త్ ఫెస్టివల్‌లో క్యారీకేచర్ కు అవార్డు గెలుచుకున్నాడు.
- రుమేనియాలో 2002లో జరిగిన ట్వెంటియత్ సెంచరీ గేట్ర్ పర్సనాలిటీస్ పోటీలో పాల్గొన్నాడు.
- బ్రెజిల్‌లో 2003లో నిర్వహించిన సలావో ఇంటర్నేషనల్ కార్టూన్ల పోటీకి వీరి కార్టూన్లు ఎంపికయ్యాయి. డీ హూమర్ తెరాస్కాబా పేరిట నిర్వహించిన ఆ సమావేశంలో శంకర్ కార్టూన్లకు ప్రముఖుల నుండి అనేక ప్రశంసలు అందాయి.
- 2003లో చైనాలో సెకండ్ ఫ్రీ కార్టూన్ వెబ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో శంకర్‌ను ప్రత్యేకంగా అక్కడి కార్టూన్ పండితులు అభినందించారు.
- పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు 2014 సంవత్సారానికి గానూ శంకర్ అందుకున్నారు. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు, దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది.[1][2][3]
- 2015 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పామర్తి శంకర్‌కు ఉత్తమ కళాకారుడి అవార్డు ప్రదానం జరిగింది.[9]
అవార్డులు
మార్చుపామర్తి శంకర్ 2015లో 2014 సంవత్సరానికి గాను గ్రాండ్ ప్రిక్స్ వరల్డ్ ప్రెస్ అవార్డును అందుకున్నాడు.[10] శంకర్ గీసిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మార్టిన్ లూథర్‌కింగ్ క్యారికేచర్‌కు గాను మొదటి బహుమతి, పియానిస్ట్ మారియా పైర్స్ క్యారికేచర్‌కు ద్వితీయ బహుమతి దక్కింది.[11] 2021 అక్టోబరులో పోర్చుగల్ పోర్టో కార్టూన్ వరల్డ్ ఫెస్టివల్‌లో ఈ రెండు అవార్డులను అందుకున్నాడు.[12]
చిత్రమాలిక
మార్చు-
'ది ఇంక్డ్ ఇమేజ్' కార్టూన్ చిత్రాల ప్రదర్శనలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
-
'ది ఇంక్డ్ ఇమేజ్' కార్టూన్ చిత్రాల ప్రదర్శనలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
-
గౌడ ఆఫీసియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 నమస్తే తెలంగాణ. "తెలంగాణ బిడ్డకు కార్టూన్ నోబెల్!". Retrieved 3 March 2017.[permanent dead link]
- ↑ 2.0 2.1 సాక్షి. "'సాక్షి' కార్టూనిస్టుకు అంతర్జాతీయ అవార్డు". Retrieved 3 March 2017.
- ↑ 3.0 3.1 తెలుగు వన్ ఇండియా. "కార్టూనిస్ట్ శంకర్‌కు అంతర్జాతీయ అవార్డు". telugu.oneindia.com. Retrieved 3 March 2017.
- ↑ Mee Kosam, Telangana (31 May 2016). "Telangana State Level Awards List 2016". www.meekosam.co.in. Archived from the original on 8 ఆగస్టు 2016. Retrieved 1 October 2021.
- ↑ తెలుగు వన్ ఇండియా. "చిరంజీవికి అలాంటివి అలవాటు లేదు: ఆర్టిస్ట్ శంకర్‌కే చెల్లింది". telugu.oneindia.com. Retrieved 3 March 2017.
- ↑ Sakshi (10 February 2019). "కార్టూనిస్ట్ శంకర్ "ది ఇంక్డ్ ఇమేజ్"". Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.
- ↑ Sakshi (18 February 2019). "ఈయన ప్రాణాన్ని గీసి, బొమ్మను పోస్తాడు!". Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.
- ↑ Sakshi (11 February 2019). "శంకర్ బొమ్మలు అద్భుతం.. చూసిరండి." Archived from the original on 20 October 2021. Retrieved 20 October 2021.
- ↑ సాక్షి. "ఉత్తమ కళాకారుడి అవార్డు అందుకున్న సాక్షి కార్టూనిస్టు శంకర్". Retrieved 3 March 2017.
- ↑ Firstpost (20 July 2015). "Pamarthy Shankar, Telugu daily cartoonist, wins Grand Prix World Press Cartoon Award-India News , Firstpost" (in ఇంగ్లీష్). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
- ↑ Sakshi (17 September 2021). "సాక్షి కార్టూనిస్ట్ శంకర్‌కు అంతర్జాతీయ పురస్కారాలు". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
- ↑ The Hindu (16 September 2021). "International award for Telugu cartoonist" (in Indian English). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.