పామిడి నగరపంచాయితీ

అనంతపురం జిల్లాలోనీ నగర పంచాయతీ

పామిడి నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురంజిల్లాకు చెందిన నగరపంచాయితీ.[1] ఈ నగర పంచాయతీ అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం లోని, గుంతకల్లు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందినది.

పామిడి నగరపంచాయితీ
పామిడి
స్థాపన2012
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

చరిత్ర

మార్చు

ఈ నగర పంచాయతీ 2012 లో ఏర్పాటు చేశారు.[2] పామిడి పేరు "పాము ముడి" అన్న పద బంధం నుండి వచ్చినట్లు చెబుతారు. భోగేశ్వర స్వామి లింగానికి ఒక పాము ఎప్పుడూ చుట్టుకుని ఉండేదని, అందువల్ల ఆ ప్రదేశానికి "పాము ముడి" అన్న పేరు వచ్చిందని, అదే కాలక్రమేణా పామిడి అయిందని చెబుతారు.

భౌగోళికం

మార్చు

పామిడినగరపంచాయితీ 14°57′00″N 77°35′00″E / 14.9500°N 77.5833°E / 14.9500; 77.5833అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.ఇది సమీప పట్టణమైన గుత్తి నుండి 20 కి.మీ దూరంలోను జిల్లా కేంద్రమైన అనంతపురం నుండి 44వ నెంబరు జాతీయ రహదారికి 30 కి.మి. దూరంలో ఉంది.[3]

జనాభా గణాంకాలు

మార్చు

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 82,571 జనాభా ఉన్నరు. ఉండగా అందులో పురుషులు 55303, మహిళలు 27268 మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6290 ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే అక్షరాస్యత ఎక్కువ.అక్షరాస్యత రేటు 53.99%, ఉంది[4]

పౌర పరిపాలన

మార్చు

ఈ నగర పంచాయతి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

మూలాలు

మార్చు
  1. "Municipal Corporation and Municipalities | Ananthapuramu District , Government of Andhra Pradesh | India". Archived from the original on 2021-10-10. Retrieved 2021-10-10.
  2. "DTCP". dtcp.ap.gov.in. Archived from the original on 2021-05-10. Retrieved 2021-10-10.
  3. Pamidi in Fallingrain.com
  4. "పామిడి జనాభా గణాంకాలు". Censusindia2011.com. Retrieved 2021-10-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "No polls in Penukonda, Pamidi municipalities". The Hindu. Special Correspondent. 2021-02-18. Retrieved 2021-10-10.{{cite news}}: CS1 maint: others (link)

వెలుపలి లంకెలు

మార్చు