పామిడి
పామిడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, పామిడి మండలానికి చెందిన పట్టణం, మండల కేంద్రం. ఇక్కడ గల భోగేశ్వర స్వామి ఆలయం ఈ ఊరి ముఖ్య ఆకర్షణ.
పట్టణం | |
Coordinates: 14°57′N 77°35′E / 14.95°N 77.58°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం జిల్లా |
మండలం | పామిడి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 27.16 కి.మీ2 (10.49 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 26,886 |
• జనసాంద్రత | 990/కి.మీ2 (2,600/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 979 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్(PIN) | 515775 |
Website |
పేరు వ్యుత్పత్తి
మార్చుపామిడి గ్రామానికి ఆ పేరు "పాము ముడి" అన్న పద బంధం నుండి వచ్చినట్లు చెబుతారు. భోగేశ్వర స్వామి లింగానికి ఒక పాము ఎప్పుడూ చుట్టుకుని ఉండేదని, అందువల్ల ఆ ప్రదేశానికి "పాము ముడి" అన్న పేరు వచ్చిందని, అదే కాలక్రమేణా పామిడి అయిందని చెబుతారు.
భౌగోళికం
మార్చుఇది జిల్లా కేంద్రమైన అనంతపురం నుండి 44వ నెంబరు జాతీయ రహదారిలో హైదరాబాదు వెళ్ళే వైపు 30 కి.మి. దూరంలో ఉంది. జిల్లాలో మరో ముఖ్య పట్టణమైన గుత్తి నుండి 20 కి.మీ. దూరంలో ఉంది.
జనగణన వివరాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6328 ఇళ్లతో, 26886 జనాభాతో 2716 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 13583, ఆడవారి సంఖ్య 13303. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3352 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 286. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 594864[2].పిన్ కోడ్: 515 775.
పరిపాలన
మార్చుపామిడి నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
మార్చుజాతీయ రహదారి 44 (భారతదేశం) పై ఈ పట్టణం ఉంది. గుత్తి రైల్వే జంక్షను పామిడి గ్రామానికి సమీప రైల్వే జంక్షను.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 13, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, సమీప మేనేజిమెంటు కళాశాల గుత్తిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల అనంతపురంలో ఉన్నాయి.
దేవాలయాలు
మార్చు- భోగేశ్వర స్వామి దేవస్థానం: పెన్నానది ఒడ్డున గల ఈ దేవస్థానంలో పరమేశ్వరుడు బోగేశ్వరుడిగా పిలువబడుతూ పెద్దదయిన లింగస్వరూపంతో పెద్ద పాణివట్టముతో నిత్య అభిషేక పూజలు అందుకుంటున్నాడు. ఈ దేవాలయంనందు కార్తీక మాసంలో జరుగు లక్ష దీపారాధన కార్యక్రమంలో పట్టణ ప్రజలు విశేషంగా పాల్గొంటారు. అంతే కాకుండా శివరాత్రినాడు మండల ప్రజలందరూ ఆరోజు ఆలయ ప్రాంగణం నందే ఉపవాసం, జాగరణ చేస్తూ నిత్య అభిషేకాలలో పాల్గొంటారు.
- శ్రీ గజేంద్ర మోక్ష లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం: శ్రీ లక్ష్మి నారాయణ స్వామి దేవస్థానం రాతికట్టడం. ఈ ఆలయం శ్రీ కృష్ణ దేవరాయలు కాలంనాటిది అని ప్రతీతి. ఈ ఆలయం త్రవ్వకాలలో బయటపడినట్టుగా ఈ గ్రామ ప్రజలు చెప్పుకుంటున్నారు. అందుకే ఈ దేవాలయం తగ్గులో వున్నదని నమ్ముతున్నారు.అందువలన ఈ ఆలయం తగ్గు దేవాలయముగా పిలవబడుతుంది. ఈ ఆలయం మూర్తి పూర్తి క్రింది భాగంలో ఒక ముసలి గజేంద్రున్నిపట్టుకున్నట్టు ఆ గజేంద్రుడు తొండం పైకెత్తి దేవుడు గురించి ప్రార్థించినట్టుగా ఉంది. దాని పై భాగం గరుడుని పై నారాయణుడు లక్ష్మీ సమేతుడై వచ్చినట్టుగా అద్భుతంగా ఉంది. అందువలన ఈ మూర్తి గజేంద్ర మోక్ష లక్ష్మీ నారాయణుడిగా నిత్య పూజలు అందుకుంటూ ప్రతి ఏకాదశికి పల్లకి ఉత్సవాలు జరుపుకుంటున్నది.
- పామిడమ్మ దేవత: పఆషాఢ మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం రోజు గ్రామదేవత అయిన పామిడమ్మ దేవత ఉత్సవాన్ని గ్రామ ప్రజలందరూ పామిడమ్మ తేరుగా విశేషంగా జరుపుకుంటారు. అదే ఆషాఢ మాసంలో ఏకాదశి నుండి పౌర్ణమి దాక ఉట్ల తేరు ఉత్సవాలు జరుగుతాయి
భూమి వినియోగం
మార్చుపామిడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 369 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 554 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 80 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 520 హెక్టార్లు
- బంజరు భూమి: 809 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 381 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 1490 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 220 హెక్టార్లు
- కాలువలు: 86 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 133 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చుముఖ్య వృత్తులు
మార్చుపెన్నా నది తీరాన ఉన్న ఈ గ్రామ జనాభాలో అధిక శాతం మందికి కుట్టుపని జీవనాధారం. ఇక్కడి వస్త్ర వ్యాపారం చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ప్రసిద్ధి. వ్యవసాయం మరో ముఖ్య జీవనాధారం. వరి,వేరుశెనగ, పత్తి ముఖ్య పంటలు. పళ్ళ తోటల సాగు కూడా అధికం. ముఖ్యంగా జామ, బత్తాయి, మామిడి తోటలు బాగా సాగులో ఉన్నాయి.
ఇతర విశేషాలు
మార్చుపామిడి గ్రామంలో తెలుగుతో సమానంగా మరాఠి భాష కూడా చలామణిలో ఉంది. దీనికి కారణం ఇక్కడి ముఖ్య వాణిజ్యమైన వస్త్ర వ్యాపారంలో మరాఠి మాతృభాషగా గల భావసార క్షత్రియ ప్రజలు అధిక సంఖ్యలో ఉండటం. అందువల్ల ఇక్కడ వినాయక చవితి పండుగ, కృష్ణాష్టమి ఘనంగా జరుపుతుంటారు. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున ఉట్లు పడగొట్టటమన్నది ఇక్కడ చాలా వేడుకగా జరుగుతుంది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".