పారసాంబ , శ్రీకాకుళం జిల్లా, పలాస మండలానికి చెందిన గ్రామం.

గ్రామ భౌగోళికం

మార్చు

ఈ గ్రామం, పలాస-కాశీబుగ్గ (జంట పట్టణాల) పురపాలకసంఘం పరిధిలోని ఒక గ్రామం. పిన్ కోడ్ నం. 532 221.

 
రోణంకి గోపాలకృష్ణ

గ్రామ ప్రముఖులు

మార్చు

2017,మే-31న ప్రకటించిన కేంద్రప్రభుత్వ సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలలో అఖిలభారతదేశ స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించిన ఈ విద్యార్ధి, పారాసంబ గ్రామంలోని ఒక సామాన్య రైతు కూలీ కుటుంబలో 1987లో పుట్టి ఇక్కడ పెరిగినవాడే.ఇతని తల్లిదండ్రులు రుక్మిణమ్మ, అప్పారావు.ఇతను ప్రాధమిక విద్య గ్రామంలోని వీధిబడిలోనే జరిగింది. అనంతరం ఆరవ తరగతి నుండి పదవ తరగతి సమీపంలోని బ్రాహ్మణతర్ల గ్రామంలో తెలుగు మాధ్యమంలో జరిగింది. తెలుగు మాధ్యమంలోనే ఈ పరీక్ష వ్రాసి నాల్గవ ప్రయత్నంలో ఈ విజయం స్వంతం చేసుకున్నాడు. ఇంటర్మీడియేట్ వరకు ఇతని ఇంటిలో విద్యుత్తు సౌకర్యం లేదు. రాత్రిపూట దీపం వెలుగులోనే చదువుకున్నాడు. [1]

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు

[1] ఈనాడు మెయిన్; 2017,జూన్-1; 1,2 పేజీలు. .

"https://te.wikipedia.org/w/index.php?title=పారసాంబ&oldid=3595993" నుండి వెలికితీశారు