రోణంకి గోపాలకృష్ణ

ఉప కలెక్టర్

రోణంకి గోపాలకృష్ణ 2016 సివిల్ సర్వీసు పరీక్షలలో మూడవ ర్యాంకు సాధించిన వ్యక్తి. ఆయన 11 సంవత్సరాల సుదీర్ఘ కృషి ఫలితంగా ఈ విజయాన్ని నాల్గవ పర్యాయంలో సాధించాడు.

రోణంకి గోపాలకృష్ణ
జననం
పారసంబ, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థమహారాజా కళాశాల, విజయనగరం
వృత్తిఉపాధ్యాయుడు, ఐ.ఎ.ఎస్ అధికారి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
2016 సివిల్ సర్వీసు పరీక్షలో మూడవ ర్యాంంకు
తల్లిదండ్రులుఅప్పారావు, రుక్ష్మిణమ్మ

జీవిత విశేషాలు మార్చు

ఆయన శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఆరోవార్డు అయిన పారసంబ గ్రామానికి చెందిన అప్పారావు, రుక్మిణమ్మ దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. ఆయన తండ్రి వ్యవసాయ కూలీ.[1] వారి పెద్ద కుమారుడు కోదండరావు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎస్‌బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె ఊర్వశి డిగ్రీ చదివింది. గోపాలకృష్ణ స్వగ్రామంలోని ఎంపీపీ పాఠశాలలోనే ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివాడు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బ్రాహ్మణతర్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదువు పూర్తి చేసాడు. ఇంటర్మీడియెట్‌ పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పూర్తి చేశారు. 2006 సంవత్సరంలో టీటీసీ ర్యాంకు సాధించి పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్ల డైట్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు.[2] డీఎస్సీ–2007లో ప్రతిభ చూపించి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. తొలుత శిలగాం పాఠశాలలో పనిచేశాడు. ప్రస్తుతం [Nellore] జిల్లాకు “ఉప కలెక్టర్”గా సేవలు అందింస్తున్నాడు.[3] ఆయన విజయనగరం లోని మహారాజా కళాశాలలో దూరవిద్యలో బిఎస్సీ పూర్తిచేసాడు.

యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ను ఎన్నుకొనుటకు కారణం మార్చు

ఆయన కుటుంబ నేపధ్యం పేదరికంతో కూతుకొని ఉన్నందున వారి ఇండ్లలో విద్యుత్ సౌకర్యం తన ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసిన వరకు లేదు. [4] తరువాత రేగులపాడులో ఆయన ఉపాధ్యాయునిగా జాయిన్ అయిన తరువాత ఆ పాఠశాలలో విద్యార్థులకు ప్రథమచికిత్సా సౌకర్యం కూడా లేదు. అపుడు ఆయన స్వంతగా ప్రథమ చికిత్సా సౌకర్యాన్ని పాఠశాలకు అందించి తన సేవలనందించాడు. ఆయన తెలుగు మాధ్యమంలొ చదివినందున, దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసినందున యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ లో ప్రవేశించుటకు యోగ్యుడు కాడని అవమానింపబడ్డాడు. గోపాలకృష్ణ కుటుంబం పాతికేళ్లుగా గ్రామంలో సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వాటన్నింటినీ అధిగమిస్తూనే అప్పారావు దంపతులు తమకున్న అర ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ముగ్గురు పిల్లలను అనేక కష్టాలకోర్చి చదివించారు. తమ తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలన్నా, సమాజంలో అలాంటివారికి అండగా ఉండాలన్నా గ్రూప్‌–1 అధికారి కావాలనేదీ గోపాలకృష్ణ లక్ష్యం. యు.పి.ఎస్.సి పరీక్షలను సాధించలేడని ప్రజలు విమర్శించారు. అందువలన ఎలాగైనా సాధించాలనే పట్టుదలలో ఆయన చదివి ఆ లక్ష్యాన్ని సాధించాడు.


పరీక్షలకు సన్నద్ధత మార్చు

ఆయన 11 సంవత్సరాల పాటు ఆ పరీక్షలో సాధించడానికి కృషిచేసాడు. ఈ విషయం వారి తల్లి దండ్రులకు తెలియదు. వారు తమ కుమారుడు ఒక ఉపాధ్యాయడిగా మాత్రమే వారికి తెలుసు. ఆయన పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యను తెలుగు మాధ్యమంలో పూర్తిచేసాడు. ఆయన సివిల్స్ (మెయిన్స్) లో తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్ గా ఎన్నుకున్నాడు. ఆయన యు.పి.ఎస్.సి యొక్క పర్సనాలిటీ పరీక్షను కూడా తెలుగు లోనే పూర్తిచేసాడు. తెలుగు అనువాదకుని సహాయంతో ఆయన ఇంటర్వ్యూ పూర్తిచేసాడు. "యు.పి.ఎస్.సి లో మూడవ ర్యాంకు సాధించిన ప్రతిభావంతుడు అయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లోని బాగా వెనుకబడిన ప్రాంతానికి చెందినవాడని, ఆయన తమ ఇనిస్టిట్యూట్ లో మాక్ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నాడని" హైదరాబాదు లోని బ్రైన్ ట్రీ ఇండియా కోచింగ్ సెంటర్ డైరక్టరు అయిన డా.గోపాలకృష్ణ అన్నారు.

3వ ర్యాంకు తెచ్చుకున్న ఆయన తనకు ఎవ్వరూ కోచింగ్‌ ఇవ్వడానికి ముందుకు రాలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ ఇదే ఏడాది సివిల్స్‌ ఫలితాల్లో 167వ ర్యాంక్‌ సాధించిన మల్లవరపు బాల లత గోపాలకృష్ణ తన శిష్యుడని, అతనికి నేను కోచింగ్‌ ఇచ్చానని నా విద్యార్ధి సివిల్స్‌కు ఎంపిక కావడం నాకు గర్వంగా ఉందని అతనితో కలిసి ఉన్న ఫొటో ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది.[5][6]

మూలాలు మార్చు

  1. "My Father is a poor farmer, says Ronanki". India.com. Archived from the original on 2017-06-05. Retrieved 2017-06-05.
  2. "కడగండ్లు దాటి కలెక్టరయ్యాడు". Archived from the original on 2017-06-05. Retrieved 2017-06-05.
  3. "Teacher bags 3rd rank in Civil Services Examination". The Hindu.
  4. "No electrcity at home or or enough money to send me to school, says Ronanki". Hindustan Times.
  5. "ఐఏఎస్‌ల‌ను కూడా శ్రీచైత‌న్య కొనేస్తుందా?". Archived from the original on 2017-06-05. Retrieved 2017-06-05.
  6. Success story of Civils 3rd ranker Ronanki Gopalakrishna - TV9

ఇతర లింకులు మార్చు