పలాస కాశీబుగ్గ

ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని పట్టణం
(పలాస-కాశీబుగ్గ నుండి దారిమార్పు చెందింది)

పలాస కాశీబుగ్గ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,శ్రీకాకుళం, పలాస మండలానికి చెందిన పట్టణం.

పలాస
పట్నం
పలాస ప్రదాన రహదారి
పలాస ప్రదాన రహదారి
ముద్దుపేరు(ర్లు): 
White Gold City
పలాస is located in Andhra Pradesh
పలాస
పలాస
Location in Andhra Pradesh, India
నిర్దేశాంకాలు: 18°46′23″N 84°24′28″E / 18.773095°N 84.407830°E / 18.773095; 84.407830Coordinates: 18°46′23″N 84°24′28″E / 18.773095°N 84.407830°E / 18.773095; 84.407830
CountryIndia
Stateఆంధ్ర ప్రదేశ్
Districtశ్రీకాకుళం
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంపురపాలకసంఘం
 • నిర్వహణపలాస కాశీబుగ్గ పురపాలక సంఘం, SUDA
విస్తీర్ణం
 • మొత్తం42.75 కి.మీ2 (16.51 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
38 మీ (125 అ.)
జనాభా
(2011)[2]
 • మొత్తం57,507
 • సాంద్రత1,300/కి.మీ2 (3,500/చ. మై.)
Languages
 • Officialతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
532221,532222
Telephone code08945
వాహనాల నమోదు కోడ్AP–39
జాలస్థలిPalasa–Kasibugga Municipality


కాశీబుగ్గ వీధి

ఇది శ్రీకాకుళం జిల్లాకి అనాదిగ వాణిజ్య కేంద్రం. జిల్లాకి రెండవ రాజకీయ కేంద్రం అని కూడా చెప్పవచ్చు. ఉత్తర శ్రీకాకుళానికి రాజధాని వంటిది. పలాస జీడిపప్పు గురించి వినని వారు ఆంధ్రరాష్ట్రం బహు కద్దు అని చెప్పటం అతిశయోక్తి కాదు. నిజానికి పలాస జీడిపప్పు పశ్చిమ బెంగాల్, ఒడిషా వారికి కూడా సుపరిచితం. పలాస రైల్వే స్టేషను శ్రీకాకుళం జిల్లాలో పెద్ద స్టేషను.ఇది ఖుర్దా డివిజన్ లో అతి ఎక్కువ లాభాలు సముపార్జించిన స్టేషను.

పలాస, కాశీబుగ్గ తొలుత పక్కపక్కనే ఉన్న జంట పట్టణాలుగా ఉత్తరాంధ్ర వాసులు ఎరుగుదురు. ఇవి తొలుత 1995 వరకూ ఇవి గ్రామ పంచాయితీలు. 1996,నవంబరు 22 న నగరపంచాయతీగా ఏర్పాటుచేసారు. ఆదాయవనరులు పెరగడము వలన, జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకొని చుట్టుప్రక్క గ్రామాలు కొన్నింటిని కలిపి 2002లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేసారు.అనేక సంవత్సరాలుగా నగర పంచాయితీగా ఉన్న ఈ పట్టణాలు ఈ మధ్యనే ఉమ్మడి మున్సిపాలిటిగా అవతరించాయి.

పలాస కాశీబుగ్గ ప్రధాన కూడలి

అనేక తర్జన భర్జనల పిదప మున్సిపాలిటిని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటిగా వ్యవహరిస్తున్నారు. పాలబుగ్గ అన్న పేరుకి కొంత ఊతమొచ్చినప్పటికి, ఆ పేరు నిలదొక్కుకొలేక పోయింది. నిజానికి కాశీబుగ్గకి ఆ పేరు రావడానికి ఒక కారణం ఉంది. పల్లి వీధి అవతల వున్న గుడిలో ఒక బుగ్గ ఉన్నదని అందున నీరు కాశీ నుంచి వచ్చునని నానుడి.

ప్రధాన భాష తెలుగు అయ్యినప్పటికి ఒరియా కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. తెలుగు బడులతో సమానంగా ఒరియా బడులు కూడా ఉన్నాయి. పలాస పలాస శాసనసభ నియోజకవర్గం శాసనసభ పరిధిలో ఉంది. ఈ విధముగా నియోజకవర్గము కోలాహలం ఒకే పట్టణంలో చూడవచ్చు.ఎన్నికల సమయంలో ఈ వీధులవారికి నియోజకవర్గముహోరు పరిపాటి.ఈ పలాస పది సంవత్సరాల ముందు ఒక పెద్ద గ్రామం. జీడిపరిశ్రమ ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది.. జనాభా పెరగడం వలన పట్న వాతావరణం నెలకొని ఉండేది.

డేకురు కొండ యాత్రసవరించు

పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల సమీపంలోని డేకురుకొండ యాత్ర ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన జరుగుతుంది. పిల్లలు లేనివారు కొండపైనుంది జారితే పిల్లలు పుడతారని ఇక్కడ ప్రజల నమ్మకము. ఈ విదంగా పలువురు జారుతూ ఉంటారు. ఈ కొండపై ఈశ్వరాలయం, సంతోషిమాత, నాగదేవత ఆలయాలు ఉన్నాయి.

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "STATISTICAL INFORMATION OF ULBs & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. p. 1. Retrieved 24 April 2019.
  2. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.

వెలుపలి లంకెలుసవరించు