పారుపల్లి భైరవ దేవాలయం

పారుపల్లి భైరవ దేవాలయం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, కోటపల్లి మండలంలోని పారుపల్లి సమీపంలోని గుట్టపై ఉన్న దేవాలయం. ఉత్తరానికి ప్రవహిస్తున్న గోదావరిని తూర్పు వైపునకు మళ్ళించేందుకు స్వయంగా భైరవుడే దిగి వచ్చి, గోదావరికి అడ్డుగా దిగంబరంగా నిలబడి నదిని దారికి తెచ్చాడని ఇక్కడి స్థానికుల నమ్మకం.[1]

పారుపల్లి భైరవ దేవాలయం
పారుపల్లి భైరవ దేవాలయం is located in Telangana
పారుపల్లి భైరవ దేవాలయం
పారుపల్లి భైరవ దేవాలయం
తెలంగాణలో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు:18°54′10″N 79°50′59″E / 18.902760°N 79.849628°E / 18.902760; 79.849628
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మంచిర్యాల జిల్లా
ప్రదేశం:పారుపల్లి, కోటపల్లి మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:భైరవుడు

చరిత్ర మార్చు

గోదావరి నది మహారాష్ట్ర నాసిక్‌ సమీపంలోని త్య్రయంబకంలో జన్మించి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అంతర్వేది వద్ద సముద్రంలో కలిసేవరకూ తూర్పువైపునకే ప్రవహిస్తుంటుంది. కానీ మంచిర్యాల జిల్లా, చెన్నూర్‌ మండలం, పొక్కూరు సమీపంలో తన దిశను మార్చుకొని ఉత్తరం దిశగా ప్రవహిస్తోంది. ఆ ప్రాంతంలో గోదావరిని దారి మళ్ళించేందుకు భైరవుడే దిగివచ్చాడనీ, పారుపల్లి గుట్టపై దిగంబరంగా నదికి అడ్డంగా నిలుచున్నాడనీ, దిగంబరంగా ఉన్న భైరవుడి విగ్రహ రూపాన్ని చూడలేకే గోదావరి తూర్పువైపు మళ్ళిందని స్థలపురాణం చెబుతోంది. చెన్నూర్‌కు చెందిన మార్వాడీలు భైరవుడికి దేవాలయాన్ని కట్టించారు.[2]

పూజలు మార్చు

భైరవుడు శివాంశ సంభూతుడు. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు మొదలైనవి ఈ భైరవుడి అదుపాజ్ఞలలో ఉంటాయి. కాలాన్ని కూడా శాసిస్తాడు కాబట్టి ఇతడిని కాలభైరవుడు అని కూడా పిలుస్తారు. భైరవుడిని పారుపల్లితోపాటు ఇతర గ్రామాల ప్రజలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఆదివారం ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ ఆదివారం సంచిక (8 May 2021). "దిశ మార్చిన.. దిగంబర భైరవుడు!". Namasthe Telangana. టి. యువరాజ్‌ గౌడ్‌. Archived from the original on 9 May 2021. Retrieved 8 November 2021.
  2. Engli, Sudheer (2018-01-12). "గోదావరి నది ఉత్తర దిశకు ప్రవహించే అద్భుతం ఎక్కడో తెలుసా ? - Wirally". www.wirally.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-01-22. Retrieved 2021-11-08.