పారుపల్లి సత్యనారాయణ

పారుపల్లి సత్యనారాయణ (1906 - 1948) తెలుగు సినిమా నటుడు, నేపధ్యగాయకుడు, గాయకుడు. అతను "గానసరస్వతి" బిరుదాంకితుడు.

పారుపల్లి సత్యనారాయణ

జీవిత విశేషాలు సవరించు

అతను కృష్ణా జిల్లా దివి తాలూకాలో లక్ష్మీనారాయణ, సీతమ్మ దంపతులకు 1906లో జన్మించాడు.

నాటకరంగం సవరించు

అతను సావిత్రి (1933), లవకుశ (1934), శ్రీకృష్ణ లీలలు (1935) సినిమాలలో నటిస్తూ గానం చేసాడు. పృథ్వీపుత్ర, దశావతారాలు, భీష్మ, విరాటపర్వం, పాదుక మొదలైన చిత్రాలలో వివిధ పాత్రలలో నటించాడు. అతను తెనాలి కంపెనీలో చేరి ద్రౌపది, తులసి, అన్నపూర్ణ మొదలైన స్త్రీ పాత్రలు పోషించారు.

ఆ రోజుల్లో నాటకాలలో,  చలనచిత్రాలలో  అనేక పాత్రలు నటిస్తూ "సత్యనారాయణ గారు మా చిత్రంలో ఒక్క పది నిముషాలు కనపడినా చాలు ... మా చిత్రానికి విలువ  పెరుగుతుంది"  అనుకునే స్థాయిలో అనేక చిత్రాలలో ప్రధాన పాత్రలు ధరించాడు. అతను వాల్మీకి  వేషం వేసిన ఆనాటి   'లవకుశ' చిత్రం.  విజయవాడ దుర్గాకళామందిరంలో  ఒక  ఏడాదిన్నర  పైగా ఆడింది. ఆ చిత్రంలో అతను భాగీశ్వరిలో పాడిన  "సాహసమేల ఈలీలా జానకి" అనే పాట,  బేగడలో పాడిన  "ఇది మన ఆశ్రమంబు" అనే పద్యం ఎంతో గుర్తింపు తెచ్చాయి. ఆ రోజుల్లో ఆయన అసంఖ్యాకంగా పాడిన పాటలు, పద్యాలు  గ్రామ్ ఫోన్ రికార్డుల  ద్వారా అలరించేవి. అతను నటించిన లవకుశ, దశావతారాలు, శ్రీకృష్ణలీలలు, బ్రహ్మరధం, 1944లో సీతారామ జననం (వశిష్టుడు)[1] లాంటి  కొన్ని చలనచిత్రాలు ప్రజాదరణ పొందాయి.

అతని అన్నయ్య "గాయకసార్వభౌమ" పారుపల్లి రామకృష్ణయ్య పంతులు.

అతని మనుమడు పారుపల్లి సత్యనారాయణ కూడా గాయకుడు, శ్రీ శారదా అన్నమయ్య సంగీత విద్యాలయం వ్యవస్థాపకుడు. [2]

పాటలు సవరించు

  • సుజన జనావానా
  • మధుసూదనా
  • సత్యపాలనా ఘనా సాధుశీలుడే
  • సాహసమేల
  • మందం మందం (లవకుశ - 1934)
  • ఈ చరణంబులే...[3]

మూలాలు సవరించు

  1. The Hindu, Cinema (25 February 2012). "Blast From The Past: Sri Sita Rama Jananam (1944)" (in Indian English). M.L. Narasimham. Archived from the original on 18 September 2019. Retrieved 29 September 2020. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch (help)
  2. "PARUPALLI SATYANARAYANA". www.parupalli.com. Retrieved 2020-07-24.
  3. "Ee Charanamule - by "Gana Saraswathi" Parupalli Satyanarayana - YouTube". www.youtube.com. Retrieved 2020-07-24.

బాహ్య లంకెలు సవరించు