పార్వతీ కళ్యాణం (1941 సినిమా)

ప్రతిభా పతాకాన ఘంటసాల బలరామయ్య 'పార్వతీ కళ్యాణం' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇది ప్రతిభావారి తొలి చిత్రం. ఘంటసాల బలరామయ్య సోదరుడు, ఘంటసాల రాధాకృష్ణయ్య, శివుడుగా, పారుపల్లి సత్యనారాయణ నారదుడుగా, పారుపల్లి సుబ్బారావు హిమవంతుడుగా, ఘంటసాల శేషాచలం మన్మధుడుగా, శాంతకుమారి పార్వతిగా, లక్ష్మీదేవి మేనకగా, వెంకటగిరి రతీదేవిగా నటించారు. మద్రాస్‌లోని వేల్‌ పిక్చర్స్‌ స్టూడియోలో షూటింగ్‌ జరిగింది.[1]

పార్వతీ కళ్యాణం
(1941 తెలుగు సినిమా)
దర్శకత్వం ఘంటసాల బలరామయ్య
నిర్మాణం ఘంటసాల బలరామయ్య
తారాగణం దైతా గోపాలం,
శాంతకుమారి,
ఘంటసాల రాధాకృష్ణయ్య,
పారుపల్లి సత్యనారాయణ,
పారుపల్లి సుబ్బారావు,
ఘంటసాల శేషాచలం,
లక్ష్మీదేవి
సంగీతం ఓగిరాల రామచంద్రరావు
గీతరచన దైతా గోపాలం
నిర్మాణ సంస్థ ప్రతిభా పిక్చర్స్
భాష తెలుగు

మూలాలు

మార్చు