పాలకాయతిప్ప, కృష్ణాజిల్లాలోని కోడూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

పాలకాయతిప్ప
—  రెవెన్యూయేతర గ్రామం  —
పాలకాయతిప్ప is located in Andhra Pradesh
పాలకాయతిప్ప
పాలకాయతిప్ప
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°58′37″N 81°05′59″E / 15.977053°N 81.099749°E / 15.977053; 81.099749
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521328.
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ భౌగోళికం

మార్చు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

కృష్ణానదిలోని ఒకపాయ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

కొత్తమాజేరు, నాగాయలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 88 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామం, హంసలదీవి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం

గ్రామ విశేషాలు

మార్చు

షోర్ బేస్డ్ ఫెసిలిటీ కేంద్రo

మార్చు

పాలకాయతిప్ప గ్రామంలో వేటకు వెళ్ళి వచ్చే మత్స్యకారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఒక కోటి రూపాయల వ్యయంతో "షోర్ బేస్డ్ ఫెసిలిటీ" కేంద్రాన్ని ఏర్పాటు చేసేటందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ కేంద్రంలో వలలు దాచుకొనేటందుకు ప్రత్యేక గదులు, బోట్ల మరమ్మత్తులు చేసుకొనేటందుకు ప్రత్యేక ప్లాట్ ఫారం, సామాజిక కార్యక్రమాలను నిర్వహించుకొనడానికి ఒక హాలు తదితర సౌకర్యాలు లభ్యమవుతవి. [1]

మెరైన్ పోలీస్ స్టేషన్

మార్చు

కొత్తగా ఏర్పాటుచేసిన ఈ పోలీస్ స్టేషనులో పాలకాయతిప్ప సముద్రప్రాంతంలో పోలీసులు గస్తీ తిరిగెదరు. ఈ పోలీస్ స్టేషనును 2015, డిసెంబరు-16న ఐ.జి.శ్రీ సూర్యప్రకాశరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ స్టేషనులో పనిచేయుచున్న కానిస్టేబుల్ శ్రీ బి.అంకబాబును విధినిర్వహణలో గుర్తింపుగా ప్రశంసించి పురస్కారాన్ని ప్రకటించారు. [2] ఈ స్టేషన్‌లో పనిచేయుచూ పదోన్నతిపై అనంతపురంలో ఎస్.ఐ.గా శిక్షణ పొందుచున్న శ్రీ కె.నబీ, ముఖ్యమంత్రి మహోన్నత సేవా పతకానికి ఎంపికైనారు. [3]

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, అక్టోబరు-3; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-17; 42వపేజీ. [3] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, మార్చి-29; 1వపేజీ.