పాలకీడు మండలం

తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం

పాలకీడు మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1] పాలకీడు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 26 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండల ప్రాంతం నల్గొండ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మిర్యాలగూడ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

పాలకీడు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, పాలకీడు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, పాలకీడు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, పాలకీడు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°48′01″N 79°42′22″E / 16.800192°N 79.706004°E / 16.800192; 79.706004
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండల కేంద్రం పాలకీడు
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 133 km² (51.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 25,452
 - పురుషులు 12,778
 - స్త్రీలు 12,674
పిన్‌కోడ్ 508218

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు మార్చు

లోగడ పాలకీడు  గ్రామం నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెవెన్యూ డివిజను పరిధిలోని నేరేడుచర్ల మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పాలకీడు గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+09 (పది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 133 చ.కి.మీ. కాగా, జనాభా 25,452. జనాభాలో పురుషులు 12,778 కాగా, స్త్రీల సంఖ్య 12,674. మండలంలో 6,953 గృహాలున్నాయి.[5]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అలంగాపురం
  2. ఎల్లాపురం
  3. కోమటికుంట
  4. గుండెబోయినగూడెం
  5. గుండ్లపహాడ్
  6. గుడుగుంట్లపాలెం
  7. జాన్‌పహాడ్
  8. పాలకీడు
  9. బోతలపాలెం
  10. మహంకాళిగూడెం
  11. మూసిఒడ్డుసింగారం
  12. రావిపహాడ్
  13. సజ్జాపురం
  14. సున్యపహాడ్

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.