పాలకోడేటి శ్యామలాంబ

పాలకోడేటి శ్యామలాంబ (జూన్ 12, 1902 - జూన్ 18, 1953) స్వాతంత్ర్యసమరయోధురాలు.

పాలకోడేటి శ్యామలాంబ

జననం మార్చు

శ్యామలంబ జూన్ 12, 1902లో కైకలూరులో దుగ్గిరాల వియ్యన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించింది. ఈమె భర్త సూర్యప్రకాశరావు కూడా స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు, ప్రేమజ్యోతి అనే పత్రికాసంపాదకుడు. ఈమె బావ డాక్టర్ గురుమూర్తి స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు, అనేక సహకార సంస్థలను స్థాపించాడు.[1]

శ్యామలాంబ 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో ఏడు నెలల పాటు, 1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలోనూ పాల్గొని ఆరు నెలల పాటు జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. ముఖ్యంగా యువతలో దేశభక్తి పెంపొందించి స్వాతంత్ర్య ఉద్యమం వైపు మళ్లించాలనే సంకల్పంతో యువజన సమావేశాలు నిర్వహించి వారిలో ఉద్యమ స్ఫూర్తిని వెలిగించింది. 1946 నుండి 1953 వరకు రాజమండ్రి పురపాలక సంఘ సభ్యురాలిగా రాజమండ్రి నగర పారిశుధ్యంపై శ్రద్ధ వహించింది. ఈమె, ఈమె భర్త ప్రకాశరావు ఒకేసారి రాజమండ్రి కౌన్సిలర్లుగా ఎన్నుకోబడ్డారు.[2]

మరణం మార్చు

శ్యామలాంబ 1953, జూన్ 18 న మరణించింది. ఈమె విగ్రహాన్ని రాజమండ్రిలోని పాల్‌చౌకులో ఉన్న సాతంత్ర్యసమరయోధుల పార్కులో ఆవిష్కరించారు.

మూలాలు మార్చు

  1. "రాజమండ్రి వెబ్ సైటులో పాలకోడేటి శ్యామలాంబ గురించిన వివరాలు". Archived from the original on 2013-06-29. Retrieved 2013-03-16.
  2. "Palakodety Foundation". palakodetyfoundation.com. Archived from the original on 23 ఫిబ్రవరి 2015. Retrieved 20 April 2015.