పాలగిరి రామక్రిష్ణా రెడ్డి

(పాలగిరి రామకృష్ణారెడ్డి నుండి దారిమార్పు చెందింది)

పాలగిరి రామక్రిష్ణా రెడ్డి (Palagiri Ramakrishna Reddy) ప్రముఖ నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనె లను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.

పాలగిరి రామక్రిష్ణా రెడ్డి
పాలగిరి రామకృష్ణా రెడ్డి (2013 లో)
జననంపాలగిరి రామక్రిష్ణా రెడ్డి
(1955-07-01) 1955 జూలై 1 (వయసు 69)
India[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)
నివాస ప్రాంతంహైదరాబాద్ ,ఆంధ్రప్రదేశ్ , ఇండియా
ఇతర పేర్లుపాలగిరి
వృత్తిరచయిత , నూనెల నిపుణుడు
ప్రసిద్ధిఆయిల్ టెక్నాలజీ నిపుణులు
మతంహిందూ

ఈయన ప్రకాశం జిల్లా గిద్దలూరులో జూలై 1, 1955లో జన్మించాడు. ఈయన ఆదోని ఆర్ట్స్ కళాశాలలో B. Sc. (Oil technology) చదివి 1975 లో పట్టభద్రుడైనాడు . తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఆయిల్ టెక్నాలజీలో డిప్లొమా పొందాడు.

అనుభవం

మార్చు

గత 35 సంవత్సరాలుగా నూనె పరిశ్రమలో అనుభవం సంపాదించాడు. నూనెలను విశ్లేషణ చెయ్యడం, నూనె గింజలను ప్రాసెస్ చేసి వంటనూనెలను ఉత్పత్తి చెయ్యడం. సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ ద్వారా బ్రాన్‌, ఆయిల్ కేకుల నుండి నూనెను తీయడం, నూనెలను రిఫైనరీలో రిఫైన్‌ చేసి రిఫైండ్ నూనెలను ఉత్పత్తి చెయ్యడం వీరి ప్రధానమైన వృత్తి. అదేకాకుండా నూనె తీయు యంత్రాలను, పరికరాలను రూపకల్పన చెయ్యడం, నూనె శుద్ధిలో వచ్చు సమస్యలను సరిదిద్దటం, నూనెశుద్ధిలో కలిగే ఖర్చులను తగ్గించడంతో నష్టాలు రాకుండా నిరోధించడంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు.

వివిధ రకాలైన నూనె గింజలకు, నూనెలకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని తెలుగుకి తర్జుమా చేసి నూనె పరిశ్రమలో పనిచేయువారికి పంచడం వీరికి వృత్తిపై వున్న శ్రద్ధను తెలియజేస్తుంది. నూనె పరిశ్రమలో పనిచేయువారిలో అధికులు 10 వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న వారు కావడంవల్ల వారు ఇంగ్లీషును అర్థం చేసుకోలేరు. అలాగే నూనె యంత్రాలకు సంబంధించిన ఆపరేషన్ మాన్యువల్స్ అంటూ ఏమిలేవు. అలాంటి వారికై తెలుగులో 'సాల్వెంట్‌ ప్లాంట్‌ ఆపరేటింగ్ మాన్యుల్', 'ఆయిల్ రిఫైనింగ్', పామాయిల్‌ ప్రాసెసింగ్' వ్రాయడం జరిగింది. అలాగే ఈ పరిశ్రమలో పనిచేయు కెమిస్ట్‌లకు ఉపయోగ పడేటందుకు తెలుగులో 'నూనెలు-కొవ్వులు', ఆయిల్స్ టెస్టింగ్ మెథడ్స్' వ్రాసాడు. ఇవన్నీ కేవలం వారికి ఉపయోగపడాలని తెలుగులో వ్రాసి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి కృషిచేయువారు చాలా అరుదు. ఈ విధమైన కృషి చేయువారిని కూడా శాస్త్రీయంగా విజ్ఞానులుగా తీర్చిదిద్దాలనుకోవడం వీరి పరిణతికి నిదర్శనం.

సంస్థలు

మార్చు

ఈయన సుమారు 15-20 నూనె మిల్లులకు తన అమూల్యమైన సేవలను అందించాడు.

  • ఎ.టి.ఆర్. ఆయిల్ మిల్స్, ఆదోని
  • మైసూర్ కాటన్ సీడ్ ఇండస్ట్రీస్
  • కోపరేటివ్ ఆయిల్ యూనిట్, మైసూర్
  • లక్ష్మీ ఆయిల్ మిల్స్, హైదరాబాద్
  • ఫుడ్, ఫేట్స్, ఫెర్టిలైజర్స్, తాడేపల్లిగూడెం
  • చోడి అప్పారావు సాల్వెంట్స్, యానాం
  • శ్రీ నాగావళీ సాల్వెంట్స్, శ్రీకాకుళం
  • అమ్మిరెడ్డి ఆయిల్స్ లిమిటెడ్, అనపర్తి
  • మధవీ ఎడిబుల్ ఆయిల్స్, మండపేట
  • వి.యన్.ఆర్. రిఫైనరీస్

వికీపీడియాలో కృషి

మార్చు
  • తెలుగు వికీపీడియాలో ఈయన సుమారు 40 రకాలైన నూనెలు, వాటి లక్షణాలు, సంగ్రహించే విధానాల గురించి విశదీకరించాడు. వీటిలో కొన్ని రకాల నూనెలు సామాన్య ప్రజలకు తెలియనివి కూడా ఉన్నాయి. ఇవి కాక నూనెగింజలను, నూనెలను పరీక్షించు పద్ధతులను సుమారు 20 వ్యాసాలలో శాస్త్రీయంగా వివరించాడు. ఈ నూనెల లోనున్న సుమారు 20-30 రకాల కొవ్వు ఆమ్లాల గురించి వ్యాసాలు రసాయనశాస్త్ర విషయాలతో తెలియజేశాడు.
  • అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు పై అనేక వ్యాసాలను వ్రాసారు.
  • శాస్త్రీయమైన వ్యాసాలే కాకుండా తెలుగు సాహిత్యానికి సంబంధించిన సుమారు 30 వ్యాసాలను, ముఖ్యంగా జాషువా రచనల మీద వ్యాఖ్యానాలు వ్రాశాడు.
  • కన్నడ, ఆంగ్ల వికీపీడియాలలో కూడా సుమారు 60-70 వ్యాసాలు ప్రారంభించి వృద్ధిచేశాడు.
  • పాలగిరి రామక్రిష్ణా రెడ్డి గారు చాలా విషయాల (ఆల్ రౌవుండర్) లపై చాలా విపులంగా సామాన్యూలకు అయిన అర్ధమయే రీతిగా అనేక రచనలు ...
  • తెలుగుకావ్యాల,కథలపుస్తకాల సమీక్షలు (16)
  • యంత్ర విజ్ఞానమునకు సంబంధించిన/పరికరాలకు సంబందింవిన వ్యాసాలు (19)
  • వెల్డింగు కు సంబంధించిన వ్యాసాలు (26)
  • బాయిలరు సంబంధిత వ్యాసాలు (28)
  • ఉపగ్రహాలు (45), ఉపగ్రహ వాహకనౌకలు (26)
  • రసాయన-భౌతిక శాస్త్రము (177)
  • ఇతర వ్యాసాలు (100) ...

అవార్డులు

మార్చు

రామక్రిష్ణా రెడ్డి గారు తెలుగు వికీపీడియాలో అనేక వ్యాసాలు రాసినందుకు...

  • గారి నుండి తెలుగు_మెడల్ ను, అనేక వ్యాసాలు రాసినందుకు 2012 లో అభివందనలు అందించారు.
  • గారు అవార్డులు గండపెండేరం అందించారు.
  • గారు అభివందనలు అందించారు.
  • గారు అవార్డు, అభివందనలు అందించారు. కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013) అభివందనలు అందించారు.
  • గారు అవార్డు అభివందనలు అందించారు.
  • గారు అవార్డు అభివందనలు అందించారు.
  • గారు అవార్డు అభివందనలు అందించారు.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు