వికీపీడియా:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం

కొమర్రాజు లక్ష్మణరావు
వికీమీడియా చిహ్నం

తెలుగు వికీపీడియా ప్రారంభించి 2013 డిసెంబరుకు పదిసంవత్సరాలయింది. ఈ ప్రయాణం ఉత్కంఠభరితంగా సాగిందనే చెప్పాలి. వందలకొలదీ సభ్యుల కృషి ఫలితమే తెలుగు వికీపీడియా, మరి ఇతర తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల ప్రస్తుత రూపం. దశాబ్ది సందర్భంగా ఈ పురోగతికి కారణమైన సభ్యులను గుర్తించి పురస్కారం అందచేయడం సముచితమని దశాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక కమిటీ భావించింది. దీనికి ఒక ఎంపిక మండలి వైజాసత్య గారి అధ్యక్షతన ఏర్పడింది. ఎంపిక మండలి ఈ పురస్కారానికి తెలుగులో విజ్ఞాన సర్వస్వానికి నాందిపలికిన కొమర్రాజు లక్ష్మణరావు పేరుబెట్టాలని నిర్ణయించిది. 2013 ఈపురస్కారానికి దశాబ్ది ఉత్సవాల బడ్జెట్ లో రూ.100,000 మొత్తం కేటాయించబడింది. ప్రతి పురస్కార గ్రహీతకు ప్రశంసాపత్రం మరియు రూ.10,000 చొప్పున గరిష్టంగా పది మందికి పురస్కారాలు అందజేయవచ్చు. ఈ పురస్కార విధానమునకు వికీ భారత సమావేశం 2011 లో ఇవ్వబడిన విశిష్ట వికీమీడియన్ గుర్తింపు (NWR2011) ప్రేరణ. [1]

దీని లక్ష్యమేమిటంటే తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తులను గుర్తించి సన్మానించటం, తద్వారా సభ్యులకు ప్రోత్సాహాన్ని పునరుత్తేజాన్నీ కల్పించడం, తద్వారా మరింత వికీ అభివృద్ధికి అ‌వకాశం కల్పించండం.


ప్రతిపాదన నియమనిబంధనలు సవరించు

పురస్కార రూపం సవరించు

  • పురస్కార కార్డు(ఎలెక్ట్రానిక్)
  • పురస్కార నగదు - ప్రతి విజేతకు రూ.10,000
  • వికీ ప్రచార లేక శిక్షణ కరపత్రాలు లేక పుస్తకాలలో పురస్కార గ్రహీత అంగీకారంతో వారి ఛాయాచిత్రాలు వినియోగించబడతాయి.
  • వార్షికోత్సవంలో బహుమతి ప్రదానం మరియు పురస్కార గ్రహీతలు తమ అనుభవాలను సమావేశంలో పంచుకొనటానికి అవకాశం
  • వార్షికోత్సవంలో అతిథిగా పాల్గొనడానికి, భారతదేశంలోని సాధారణంగా నివసించే/శాశ్వతనివాసం లేక సమావేశ స్థలానికి దగ్గరిలో నున్న విమానాశ్రయం గల స్థలంనుండి సమా‌వేశ కేంద్రానికి మూడవ టియర్ ఎసి కి మించని ప్రయాణ, వసతి సౌకర్యాలు.

2013 ఎంపికమండలి సవరించు

  1. వైజాసత్య, అధ్యక్షుడు
  2. అర్జున, కార్యదర్శి
  3. రాజశేఖర్, సభ్యుడు
  4. టి,సుజాత, సభ్యురాలు
  5. రాధాక్రిష్ణ, సభ్యుడు

ఎంపిక మండలి పాత్ర , బాధ్యతలు మరియు కాలం సవరించు

ఎంపిక మండలి ప్రధానబాధ్యత ప్రతిపాదనా పత్రాలను పశీలించి విజేతలజాబితాను సిఫారస్ చేయటం.

  • అధ్యక్షుడు: ఎంపిక మండలికి వ్యక్తిరూపం మరియు ప్రతినిధి. ఇతరులతో (వార్షికోత్సవ కమిటీ, సముదాయం..) సమన్వయం, సముదాయమునకు ప్రకటనలు. పురస్కార అభివందన కార్డు, మరియు ధృవపత్రాలపై వార్షికోత్సవ కమిటీ అధ్యక్షునితో కలసి సంతకం చేయటం.
  • కార్యదర్శి: అధ్యక్షుని సూచన మేరకు సమావేశ ఏర్పాట్లు, ప్రక్రియ సజావుగా జరిగేటట్లు చూడడం. అధ్యక్షుడు పాల్గొనలేనప్పుడు మరియు ఎంపికమండలి సూచనమేరకు ప్రాతినిధ్యం వహించడం.
  • సభ్యులు: సమావేశాలలో పాల్గొనటం, ఎంపికకు వ్యక్తిగతంగా బేరీజువేయటం మరియు సమష్టి చర్చలో పాల్గొని ఏకాభిప్రాయదిశగా చర్చలు చేయటం. ప్రక్రియ గురించిన సందేహాలు అంగీకరించిన విధానం మేరకు నివృత్తి చేయటం, ప్రక్రియలో సముదాయానికి సహాయపడటం
  • క్రియాశీలక కాలం: ఎంపికమండలి ఏర్పాటునుండి వార్షికోత్సవ సమావేశాలు ముగిసేంతవరకు.

ప్రక్రియ కాలరేఖ సవరించు

  • ప్రతిపాదనలు ప్రారంభం : 2-12-2013
  • ప్రతిపాదనల ముగింపు సమయం : 9 16-12-2013, 2359 (UTC)
  • ఎంపిక మండలి సిఫారస్ దశాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక కమీటి ఆమోదంతో ప్రకటన : 16 / 23 29 -12-2013
బహుమతి ప్రదానం
దశాబ్ది ఉత్సవసమావేశం లో, బహుశా జనవరి2014

అభినందన మరియు బహుమతి సమావేశం సవరించు

ఎలెక్ట్రానిక్ అభినందన బహుమతి ప్రకటించిన తరువాత వాడుకరి చర్చాపేజీలో ప్రత్యేక పురస్కార కార్డు ద్వారా చేర్చబడుతుంది. తెలుగు వికీపీడియా దశాబ్దిఉత్సవాల కార్యక్రమంలో పురస్కార గ్రహీతలకు నగదు బహుమతి, పురస్కార పత్రాలు అందజేయబడతాయి.

అర్హతలు సవరించు

పురస్కారానికి అనర్హులు
పురస్కారానికి అర్హులు
  • విధానం ప్రకారం అనర్హులు కాని సభ్యులందరు పురస్కారానికి క్రింది పరిమితులకు లోబడి అర్హులు.
    • ప్రతిపాదిత సభ్యుని మొదటి తెలుగు వికీమీడియాప్రాజెక్టు రచన 2012 సెప్టెంబర్ లేక అంతకు ముందరిదై ఉండాలి. (సభ్యుని తొలిరచన తెలుసుకోవటానికి సభ్యుని ప్రధాన తెలుగు వికీ ప్రాజెక్టులోని సభ్యునిపేజీలో వివరముందేమో చూడండి. లేకపోతే అక్కడనుండి ప్రక్క పెట్టెలోని సభ్యుని రచనలు ఎంపికచేసుకొని తొట్టతొలి రచన చూడండి.)
      • 2013 మూడవ త్రైమాసికం (Q3) వరకు చేసిన కృషి పరిగణించబడుతుంది.
    • సభ్యుని రచనలు స్వచ్ఛందంగా చేసినవై వుండాలి. దీనికై ఏ సంస్థనుండైనా పురస్కారం కానిరూపంలో ప్రతిఫలం పొందివుండకూడదు. పరిగణిస్తున్న కాలంలో కొంత కాలం ప్రతిఫలం పొందినట్లైతే ఆ కాలాన్ని పేర్కొని ఆ కాలంలో సభ్యుని రచనలను అభ్యర్ధనలో అదనపు సమాచారంలో వివరించాలి. ఎంపికమండలి ఆ కృషిని తప్పించి మిగతా కృషిని పరిగణించుతుంది.

ప్రతిపాదనకు సూచనలు సవరించు

  • తెలుగు వికీమీడియన్లు ఎవరైనా వారి అభిప్రాయాన్ని అనుసరించి సహ సభ్యులను కొమర్రాజు లక్ష్మణరావు వికీ పురస్కారమునకు ప్రతిపాదించవచ్చు. అలాగే సభ్యులు ఎవరైనా స్వీయప్రతిపాదన కూడా చేయవచ్చు.
  • ప్రతిపాదిత సభ్యులు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి ఏరూపంలో నైనా(విషయ విస్తరణ, నిర్వహణ, ఎలెక్ట్రానిక్/భౌతిక ప్రచారం, శిక్షణ) గుర్తించతగినకృషి చేసిఉండాలి.
  • ప్రతిపాదన పత్రం వీలైనంతగా పూర్తిచెయ్యాలి.
  • ఎంపికమండలి ప్రతిపాదనపత్రం ఆధారంగా చర్చించి, సభ్యుని కృషిన ప్రభావాన్ని విశ్లేషించి పురస్కార విజేతలను గుర్తిస్తారు. ఎంపికమండలి సభ్యులకు ప్రతిపాదిత వ్యక్తి పని గురించి తెలుసు అని అనుకోకుండా వివరణలతో కూడిన పూర్తి ప్రతిపాదనపత్రం అవశ్యం.
  • ప్రతిపాదనలో పేర్కొన్న కృషికి ఆధారాలను పేర్కొంటే మరీ మంచిది.
  • ప్రతిపాదనను ప్రతిపాదించే సభ్యుడు, ప్రతిపాదిత సభ్యుడు, సమర్థించేసభ్యులెందరైనా పూరించవచ్చు.
  • ఒకసభ్యుడు ఎన్ని ప్రతిపాదనలైనా ప్రారంభించవచ్చును. కాని ప్రతిపాదనను వీలైనంత సమగ్రంగా పూరించటానికి ప్రతిపాదకుడు, ప్రతిపాదిత సభ్యుడు ప్రధాన బాధ్యత వహించాలి.
  • ప్రతిపాదిద్దామన్న సభ్యుని అంగీకారాన్ని తెలుసుకొని ప్రతిపాదిస్తే మంచిది. ప్రతిపాదించినతరువాత ప్రతిపాదిత సభ్యుడిని సంప్రదించి అంగీకారం తెలుపమని కోరవచ్చు. గడువుతేదీలోగా ప్రతిపాదిత సభ్యుడు అంగీకారం తెలపకపోతే ఆ ప్రతిపాదన చెల్లదు.
  • ప్రతిపాదనకు తెలుగు టైపు అంతగా రాని వ్యక్తులు ఆంగ్లభాషకూడా వాడవచ్చు.(Peope who are keen users/contributors of Wiki with accounts, but who are not able to type well in Telugu can also use English to update the form)
  • ప్రక్రియ సజావుగాజరగటానికి ఎంపిక మండలి సభ్యులు ప్రతిపాదనలు, సమర్ధనలు చేయకుడదని నిర్ణయంతీసుకొనడమైనది.
  • ఎంపిక మండలి ప్రతిపాదనలను పరిశీలించి తన విచక్షణ ప్రకారం తమ అనుభవంలో విశేషంగా కృషిచేసిన సభ్యుల పేర్లను ప్రతిపాదనలో వుండి కూడాఏ కారణం చేతనయినా పురస్కారానికి ఎంపికకాకపోతే లేక ప్రతిపాదనలే రాకపోయినా, చర్చించి ఎంపిక మండలి ప్రత్యేక అభినందన కార్డు(ఎలెక్ట్రానిక్) పత్రానికి సభ్యులను వీరిని ఎంపికచేయవచ్చు. వీటి సంఖ్యపై పరిమితి వుండదు. ఈ గుర్తింపుకి నగదు బహుమతులుండవు. వార్షికోత్సవసమావేశాలకు ప్రత్యేక అతిధిహోదావుండదు.
  • ఎంపికమండలి సిఫారస్ వార్షికోత్సవ కమిటీ ఆమోదించితే అదే తుది నిర్ణయమవుతుంది.
  • పురస్కార ప్రక్రియ మరియు ఫలితాలపై ఏదైనా సందేహాలుంటే ఎంపికమండలి నివృత్తి చేస్తుంది
  • ప్రతిపాదనలు గడువు తేదీ మార్చుటకు ఎంపికమండలికి అధికారం కలదు.
  • ఏవైనా కారణాలవల్ల పురస్కారం ప్రక్రియను నిలుపుటకు లేక పురస్కార విజేతలను ప్రకటించకుండా ప్రక్రియ ముగించుటకు ఎంపికమండలికి అధికారం వుంది.

ప్రతిపాదనలు సవరించు

ప్రక్రియ ఫలితాలు మరియు సహాయ పేజీలు/లింకులు సవరించు

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు