పాల్ఘర్

పాల్ఘర్ జిల్లాలోని పట్టణం, కొంకణ్ డివిజన్, మహారాష్ట్ర, భారతదేశం

పాల్ఘర్ మహారాష్ట్ర, కొంకణ్ డివిజన్‌లోని పట్టణం. ఇది ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగం. 2014 నుండి ఇది పాల్ఘర్ జిల్లా ముఖ్యపట్టణంగా ఉంది. పాల్ఘర్ రద్దీగా ఉండే ముంబై-అహ్మదాబాద్ రైలు కారిడార్‌లో ముంబై సబర్బన్ రైల్వే పశ్చిమ మార్గంలో ఉంది. ఈ పట్టణం ముంబైకి ఉత్తరాన 87 కిలోమీటర్ల దూరంలో, విరార్‌కు ఉత్తరాన 35 కిలోమీటర్ల దూరంలో, ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారికి పశ్చిమాన 24 కిలోమీటర్ల దూరంలో మనోర్ వద్ద ఉంది.

పాల్ఘర్
—  పట్టణం  —
[[File:
|250px|none|alt=|వజ్రేశ్వరి ఆలయం,]]వజ్రేశ్వరి ఆలయం,
పాల్ఘర్ is located in Maharashtra
పాల్ఘర్
పాల్ఘర్
మహారాష్ట్ర పటంలో పట్టణ స్థానం
Coordinates: 19°41′59″N 72°46′02″E / 19.699692°N 72.767154°E / 19.699692; 72.767154
దేశం భారతదేశం
రాష్ట్రం మహారాష్ట్ర
జిల్లా పాల్ఘర్
జనాభా (2011)
 - మొత్తం 68,931
భాషలు
 - అధికారిక మరాఠీ
Time zone IST (UTC+5:30)
PIN 401404
Telephone code 02525
Vehicle registration MH-48
వెబ్‌సైటు https://palghar.gov.in/

చరిత్ర

మార్చు

పాల్గర్ చరిత్ర దాని పాత జిల్లా థానేతో ముడిపడి ఉంది. జవహర్, వసాయి, పాల్ఘర్ తహసీల్‌లకు చారిత్రక వారసత్వం ఉంది. వసాయి (అప్పుడు బస్సేన్ అని పిలుస్తారు) పోర్చుగీస్ సామ్రాజ్యంలో ఉండేది. తరువాత చిమాజీ అప్ప, మరాఠా మిలిటరీ కమాండర్ పోర్చుగీసు నుండి వసాయి కోటను స్వాధీనం చేసుకుని, వసాయిపై మరాఠా జెండాను ఎగరేసాడు. 1942లో చలేజావ్ ప్రచారంలోని ముఖ్యమైన ప్రదేశాలలో పాల్ఘర్ ఒకటి.

1942 ఆగస్టు 14న, పాల్ఘర్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఇందులో కాశీనాథ్ హరి పగ్ధరే, గోవింద్ గణేష్ ఠాకూర్, రాంప్రసాద్ భీమశంకర్ తివారీ, రామచంద్ర మహాదేవ్ చూరి, గోవింద్ సుకుర్ మోర్ మరణించారు. ఈ అమరవీరుల గౌరవార్థం పాల్ఘర్ ప్రధాన సర్కిల్‌ను "పాచ్‌బట్టి" (మరాఠీలో 'ఐదు దీపాలు' అని అర్ధం) అని పిలుస్తారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఐదుగురిని సన్మానించడానికి ప్రజలు పాచ్‌బట్టి సర్కిల్‌లో గుమిగూడినప్పుడు ఆగస్టు 14ని పాల్ఘర్‌లో "అమరవీరుల దినోత్సవం"గా ప్రకటించారు.

జనాభా వివరాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] పాల్ఘర్ జనాభా 68,930. ఇందులో పురుషులు 36,523 (52.9%), స్త్రీలు 32,407 (47.1%). అక్షరాస్యత రేటు 77.52%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత 81.2%, స్త్రీల అక్షరాస్యత 73.35%. జనాభాలో 11.8% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

రవాణా

మార్చు
 
పాల్ఘర్ రైల్వే స్టేషన్

పాల్ఘర్‌కు రోడ్డు, రైలు రవాణా సౌకర్యం ఉంది. సూరత్, వాపి, వల్సాద్, వడోదర, భరూచ్, అంకలేశ్వర్, ఆనంద్, ముంబయి, అహ్మదాబాద్, మిరాజ్, సాంగ్లీ, పూణే, వడుజ్, థానే, ఉల్హాస్ నగర్, భివాండి, ఔరంగాబాద్, అహ్మద్ నగర్, కళ్యాణ్, అలీబాగ్, నందుర్బార్, భుసావల్, షిర్డీ, నాసిక్ సహా మహారాష్ట్ర, గుజరాత్‌ ల లోని అనేక పట్టణాలకు నేరుగా కనెక్టివిటీని అందించే మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషనుకు ప్రాంతీయ కార్యాలయంగా పాల్ఘర్ ఉంది.

పాల్ఘర్ రైల్వే స్టేషన్ ముంబై సబర్బన్ రైల్వే యొక్క పశ్చిమ మార్గంలోను, అహ్మదాబాద్-ముంబై ప్రధాన మార్గంలోనూ ఉన్న ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్. షటిల్ / మెము / EMU (స్థానిక రైళ్లు) సేవలతో పాటు, అనేక సుదూర రైళ్లు కూడా ఇక్కడ ఆగుతాయి.


మూలాలు

మార్చు
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
"https://te.wikipedia.org/w/index.php?title=పాల్ఘర్&oldid=3902137" నుండి వెలికితీశారు