బాబాజి పాల్వంకర్ బాలూ, (ధార్వాడ్, 19 మార్చి 18764 జూలై 1955, బొంబాయి, ప్రస్తుతం ముంబాయి), పాల్వంకర్ బాలూగా ప్రసిద్ధిగాంచిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను ఎడమ చేతివాటం స్పిన్ బౌలర్. బాలూ బంతిని రెండు వైపులా తిప్పగలడు. ఇతను కొద్దిపాటి నేర్పుగల ఆఖరి వరుస బ్యాట్స్‌మన్. బాలూ 1905/06 నుండి 1920/1921 వరకూ మొత్తం 33 ఫస్టుక్లాస్ మ్యాచులు ఆడి 15.21 సగటుతో 179 వికెట్లను సాధించాడు.