పిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహ వాహకనౌక

320 టన్నులు

పిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహ వాహకనౌక లేదా పిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహ ప్రయోగ నౌక ను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)తయారుచేసినది.పిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి అను నావిగేసన్ వ్యవస్థకు చెందిన ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు.పిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహ వాహకనౌక ను ఆంధ్రప్రదేశ్రాష్ట్రం లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతిష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం లోని మొదటి రాకెట్ ప్రయోగ వేదికనుండి,శుక్రవారం,ఏప్రిల్ 04,2014 న ప్రయోగించారు.

పిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహ వాహకనౌక
తయారీదారు ఇస్రో
దేశము ఇండియా
పరిమాణము
ఎత్తు 44.4 మీటర్లు (146 అ.)
వ్యాసము 2.8 మీటర్లు (9 అ. 2 అం.)
ద్రవ్యరాశి PSLV: 295,000 కి.గ్రా. (650,000 పౌ.)
PSLV-CA: 230,000 కి.గ్రా. (510,000 పౌ.)
PSLV-XL: 320,000 కి.గ్రా. (710,000 పౌ.)
దశలు 4
సామర్థ్యము
ప్రయోగ చరిత్ర
స్థితి Active
ప్రయోగ స్థలాలు సతిష్ ధావన్ అంతరిక్ష కేంద్రం బూస్టర్లు (PSLV-G) - S12
బూస్టర్ల సంఖ్య 6
ఇంజన్లు off
థ్రస్టు 716 కి.N (161,000 lbf)
Specific impulse 262 s (2.57 km/s)
మండే సమయం 49.5 seconds
ఇంధనం HTPB
First దశ
ఇంజన్లు S139
థ్రస్టు 4,815 కి.N (1,082,000 lbf)
Specific impulse 237 s (2.32 km/s) (sea level)
269 s (2.64 km/s) (vacuum)
మండే సమయం 101.5 సెకన్లు
ఇంధనం HTPB
Second దశ
ఇంజన్లు 1 Vikas
థ్రస్టు 804 కి.N (181,000 lbf)
Specific impulse 293 s (2.87 km/s)
మండే సమయం 149 seconds
ఇంధనం N2O4/UDMH
Third దశ
ఇంజన్లు S7
థ్రస్టు 240 కి.N (54,000 lbf)
మండే సమయం 112.1 seconds
ఇంధనం solid HTPB
Fourth దశ
ఇంజన్లు 2 x L-2-5
థ్రస్టు 2 X 7.4KN
మండే సమయం 513 seconds
ఇంధనం Monomethylhydrazine(MMH),Mixed Oxides of Nitrogen(MON)

పిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహ వాహకనౌక-నిర్మాణ వివరాలు

మార్చు

పిఎస్ఎల్‌వి-సీ24 ఉపగ్రహ వాహకనౌక పిఎస్ఎల్‌వి-ఎక్సుఎల్ శ్రేణిలో ఆరవ రాకెట్. పిఎస్ఎల్‌వి-ఎక్సుఎల్ శ్రేణి రాకెట్ లలో పెద్దవైన,అధిక శక్తి వంతమైన స్ట్రాపాన్ బుస్టరు మోటరు లను ఉపయోగించడం వలన,ఈ రాకెట్ యొక్క మొదటి దశ/అంచె/స్టేజి యొక్క చోదకశక్తి ద్విగుణికృతం చెయ్యబడినది.PS1 అనబడు మొదటి దశ,ఘని ఇంధనం నింపబడిన S-138 రాకెట్ మోట రును కలిగి ఉంది, దీనికి బాహ్య వలయంలో ఆరు PS0M-XL బూష్టరులు అనుసంధానింపబడి ఉండును.ప్రతి స్ట్రాపాన్ బూస్టరు S-12 మోటరును కలిగి ఉన్నది. PS2 అనబడు రెండవ L-40 దశ,మొదటి దశ పైభాగాన ఉండును.ఇందులో ద్రవ ఇంధనంద్వారా పనిచేయు వికాస్ ఇంజను అమర్చబడి ఉన్నది. ఈ దశలో UH25, డై నైట్రోజన్ టెట్రాక్సైడ్లు ద్రవచోదకం/ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ దశలోఉపయోగించు వికాస్ ఇంజను ఫ్రాన్స్ కు చెందిన వైకింగ్ ఇంజన్ (ఏరియన్ రాకెట్ సంస్థ )నుండి లైసెన్సు తీసికొని ఇస్రో సంస్థ స్వంతగా భారతదేశంలో నిర్మించి ఉపయోగిస్తుంది.మూడవ దశ PS3. దీనిలో S-7 అను ఘన ఇంధనంను మండించు రాకెట్ మోటరు అమర్చబడినది. మూడవ దశపైన PS4అను నాల్గొవదశ తిరిగి ద్రవ ఇంధనం మండించు మోటరు కలిగిన దశ,ఇందులోద్రవ ఇంధనంను మండించుటకు రెండు ఇంజన్లు అమర్చబడి ఉన్నవి[1].

ఉపగ్రహ వాహక నౌక మొత్తం బరువు 320 టన్నులు, పొడవు 44.4 మీటర్లు.మొదటి దశ యొక్క కోర్ పొడవు 20 మీటర్లు. మొదటిదశ యొక్క కోర్ వ్యాసం 2.8 మీటర్లు.మొదటి దశ కోర్ లో నింపు చోదక ఇంధనం పరిమాణం 138.0 టన్నులు.మొదటి దశలో HTPB ఆధారిత ఘన ఇంధనాన్ని చోదకంగా ఉపయోగిస్తున్నారు. మొదటిదశ(కోర్)దహన సమయం 101.5 సెకన్లు.మొదటి దశకు అనుసంధానంగా ఆరు స్ట్రాపాను మోటర్లు అమర్చబడిఉండి, ఒక్కో స్ట్రాపాను మోటరు 14.7 మీటర్ల పొడవు,1 మీటరువ్యాసం కలిగి ఉన్నది. ఒక్కో స్ట్రాపాన్ మోటరులో 12 టన్నుల ఘన HTPB ఇంధనం నింపబడి ఉన్నది.HTPB అనగాహైడ్రాక్సిల్ టెర్మినేటేడ్ పాలిబ్యుటడైన్.ఒక్కో స్ట్రాపాన్ మోటరు 49.5 సెకన్లు మండును.కోర్ మోటరు మండునపుడు 4815కిలో న్యూటనుల త్రోపుడు /తోయు శక్తి విడుదల అగును. ఒక్కో స్ట్రాపాను మోటారు మండునపుడు 716 కిలో న్యూటనుల త్రోపుడు /తోయు శక్తి విడుదల చేయును.రెండవ దశ పొడవు12.5 మీటర్లు, వ్యాసం 2.8 మీటర్లు. నింపిన ద్రవ ఇంధనం పరిమాణం 41.7 టన్నులు. ఉపయోగించిన ద్రవ ఇంధనం (UH25 + N2O4). UH25 అనగా అన్‌సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రాజీన్,, 25% హైడ్రాజీన్ హైడ్రేట్,N2O4 అనగానైట్రోజన్ టెట్రాక్సైడ్ రెండవ దశ మండుసమయం 149 సెకన్లు.దహనచర్య చర్య వలన విడుదలఅగు పీడన /త్రోపుడు/చలన శక్తి 804 కిలోన్యూటనులు.మూడవ దశ పొడవు 3.6 మీటర్లు. దాని వ్యాసం2.0 మీటర్లు.ఇందులో మొదటి దశలో లా HTPB ఘన ఇంధనాన్ని చోదకంగా ఉపయోగిస్తున్నారు.ఇంధన పరిమాణం 7.6 టన్నులు. ఇంధనం మండుటకు పట్టు సమయం 112.1 సెకన్లు. దహనం వలన సృష్టింబడు త్రోపుడు/త్రస్ట్ శక్తి 240 కిలో న్యూటనులు. నాల్గవ దశపొడవు 2.6 మీటర్లు., ఈదశ యొక్క వ్యాసం2.8మీటర్లు.ఈ భాగంలో నింపిన చోదక ఇంధనం బరువు 2.5 టన్నులు,ఇంధనం మండుటకు/దహనం చెందుటకు పట్టు సమయం 513సెకన్ల కాలం.ఇందులో రెండు ఇంజన్లు ఉండి, ఒక్కో ఇంజను 7.2 కిలో న్యూటనుల త్రోపుడు /త్రస్ట్ పీడనాన్నిను కలుగచేయును.ఈ దశలో వాడు ద్రవ ఇంధనం (MMH + MON-3).MMH అనగా మోనో మిథైల్ హైడ్రాజీన్, MON-3 అనగా మిశ్రమ నైట్రోజన్ ఆక్సైడులు(mixed oxides of nitrogen).[2]

పిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగ వివరాలు

మార్చు

కౌంట్ డౌన్ సున్నకు వచ్చిన వెంటనే మొదటి దశ మోటరు మండటం/దహనం చెందటం మొదలైనది.అరసెకండు తరువాత రెండు స్ట్రాపాన్ మోటరులు మండటం మొదలైనది,ఆతరువాత 0.2 సెకన్ల తరువాత మరో రెండు స్ట్రాపాన్ మోటరులు మండటం ప్రారంభించాయి.భూస్థాయిలోనే మొదటి దశమోటరుతో పాటు,నాలుగు స్ట్రాపాన్ మోటరులు పనిచెయ్యడం మొదలైనది.రాకెట్ గమనం మొదలైన 25 సెకన్ల తరువాత మిగిలిన రెండు స్ట్రాపాన్ మోటరులు పనిచెయ్యడం మొదలైనది.70 సెకన్ల రాకెట్ పయనం తరువాత,భూ స్థాయిలో మొదటగా పనిచెయ్యడం ప్రారంభించిన మొదటి జత స్ట్రాపాన్ మోటరులు మొదటి దశనుండి విజయవంతంగా వేరు పడినవి.ఆతరువాత సెకనులో పదో వంతు వ్యవధిలో రెండో జత స్ట్రాపాన్ మోటరులు కూడా వాహక నౌక నుండి ఎటువంటి ఆటంకంలేకుండా వేరుపడినవి.రాకెట్ గమనంలో ఉండంగా మండింపబడిన చివరి రెండు స్ట్రాపాన్ మోటరులు 92 సెకన్ల వరకు మండినవి.మొదటి దశ దహన క్రియ 1 నిమిషం 51.5 సెకన్లపాటు జరిగిన తరువాత,మొదటి దశ రాకెట్ నుండి వేరుపడినది.మొదటి దశదహన చర్య ముగిసిన వెంటనే సెకనులో ఇరవై వంతు కాల వ్యవధిలో రెండో దశయొక్క మోటరు పనిచెయ్యడం మొదలైనది.రెండవ దశ లో ఇంధన దహనం 151.8 సెకన్ల పాటు జరుగగా,రెండవ దశ లో 59సెకన్ల తరువాత,112.8కిలో మీటర్ల ఎత్తులోఉపగ్రహం చుట్టూ,అమర్చిన రక్షక ఉష్ణ కవచం,విజయ వంతంగా వేరుపడినది.రెండవ దశ దహన చర్య ముగిసిన 1.2సెకన్ల తరువాత,మూడవ దశలోని ఇంజను మోటరుపనిచెయ్యడం ప్రారంభంఅయ్యింది.ఈ దశలో మోటరును 234 సెకన్లు మండినది.రాకెట్ పయనం మొదలైన 10 నిమిషాల 8.7 సేకన్లతరువాత మూడవ దశకుడా రాకెట్ నుండి వేరు చెయ్యబడినది.మూడవ దశవేరుపడిన 10సెకన్ల తరువాత చివరి నాల్గవ దశలోని చోదక మోటరులు పనిచెయ్యడం మొదలైనది.నాల్గవదశదహనం 8 నిమిషాల30.1సెకన్లపాటు జరిగింది. నాల్గవ దశ వేరుపడిన 40 సెకన్ల తరువాత ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించినది[1].

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. 1.0 1.1 "India's PSLV successfully launches the IRNSS-1B spacecraft". nasaspaceflight.com. Archived from the original on 2016-02-06. Retrieved 2016-02-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "PSLV-C24". isro.gov.in. Archived from the original on 2015-03-19. Retrieved 2016-02-07.