పిడుగురాముడు

పిడుగురాముడు 1966లో విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, రాజశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. టి. వి. రాజు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. సి. నారయణరెడ్డి, కొసరాజు పాటలు రాశారు. ఈ చిత్రం 1966,సెప్టెంబర్ 10న విడుదలైయింది.[1]

పిడుగురాముడు
TeluguFilm Pidugu Ramudu.jpg
దర్శకత్వంబి.విఠలాచార్య
రచనసముద్రాల జూనియర్
నటవర్గంనందమూరి తారక రామారావు,
రాజశ్రీ,
జగ్గారావు
కూర్పుజి. డి. జోషి
సంగీతంటి.వి.రాజు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
సెప్టెంబర్ 10, 1966
భాషతెలుగు

కథసవరించు

సింహపురి రాజ్యానికి ప్రతాపరుద్ర మహారాజు (రేలంగి) పేరుకే రాజు. ఆయన బావమరిది గజేంద్రవర్మ (రాజనాల) ప్రజలను పన్నులపేరుతో వేధిస్తూ కన్నెపిల్లల్ని పాడుచేస్తుంటాడు. అలా గజేంద్రవర్మ ఒక ఊర్లో ఒక అమ్మాయిని అపహరించి తీసుకువెళుతుండగా రాముడు అడ్డుకుని అతన్ని అవమానించి పంపిస్తాడు. ఇదంతా ప్రజల్లో మారువేషాల్లో తిరుగుతున్న రాకుమారి మధుమతి గమనిస్తుంది.

తారాగణంసవరించు

పాటలుసవరించు

పాట రచయిత సంగీతం గాయకులు
ఈరేయి నీవు నేను ఎలాగైన కలవాలీ నింగిలోని తారలు రెండూ నేలపైన నిలవాలి సి.నారాయణరెడ్డి టి.వి.రాజు ఘంటసాల, పి.సుశీల
పిలిచిన పలుకవు - ఓ జవరాల చిలిపిగ ననుచేర - రావా రావా సి.నారాయణరెడ్డి టి.వి.రాజు ఘంటసాల, పి.సుశీల
మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళా సి.నారాయణరెడ్డి టి.వి.రాజు ఘంటసాల, పి.సుశీల
ఓ! చిన్నదానా చిన్నదానా
ఓ! మిలమిల మెరిసే మనసే
కొమ్మల్లో పాలపెట్ట కూత కూసిందోయ్
రారా కౌగిలి చేర రారా దొర
నిండు మాస నిసిరేత్రికాడ

మూలాలుసవరించు

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు. గోటేటి బుక్స్. p. 19.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.

బయటి లింకులుసవరించు