పిడుగురాముడు
(పిడుగు రాముడు నుండి దారిమార్పు చెందింది)
పిడుగురాముడు 1966లో విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, రాజశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. టి. వి. రాజు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. సి. నారాయణరెడ్డి, కొసరాజు పాటలు రాశారు. ఈ చిత్రం 1966,సెప్టెంబర్ 10న విడుదలైయింది.[1]
పిడుగురాముడు | |
---|---|
దర్శకత్వం | బి.విఠలాచార్య |
రచన | సముద్రాల జూనియర్ |
తారాగణం | నందమూరి తారక రామారావు, రాజశ్రీ, జగ్గారావు |
కూర్పు | జి. డి. జోషి |
సంగీతం | టి.వి.రాజు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | సెప్టెంబర్ 10, 1966 |
భాష | తెలుగు |
కథ
మార్చుసింహపురి రాజ్యానికి ప్రతాపరుద్ర మహారాజు (రేలంగి) పేరుకే రాజు. ఆయన బావమరిది గజేంద్రవర్మ (రాజనాల) ప్రజలను పన్నులపేరుతో వేధిస్తూ కన్నెపిల్లల్ని పాడుచేస్తుంటాడు. అలా గజేంద్రవర్మ ఒక ఊర్లో ఒక అమ్మాయిని అపహరించి తీసుకువెళుతుండగా రాముడు అడ్డుకుని అతన్ని అవమానించి పంపిస్తాడు. ఇదంతా ప్రజల్లో మారువేషాల్లో తిరుగుతున్న రాకుమారి మధుమతి గమనిస్తుంది.
తారాగణం
మార్చు- రాముడి పాత్రలో ఎన్. టి. రామారావు
- మధుమతి పాత్రలో రాజశ్రీ
- పద్మనాభం
- రాజనాల
- రేలంగి
- అల్లు రామలింగయ్య
- మిక్కిలినేని
- రాజబాబు
- జగ్గారావు
- సత్యం
- సుబ్బారావు
- భాస్కర్
- వాణిశ్రీ
- ఎల్. విజయలక్ష్మి
- మణిమాల
- ఋష్యేంద్రమణి
- మీనాకుమారి
- విద్యశ్రీ
- శేషారత్న
- వసుంధర
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఈరేయి నీవు నేను ఎలాగైన కలవాలీ నింగిలోని తారలు రెండూ నేలపైన నిలవాలి | సి.నారాయణరెడ్డి | టి.వి.రాజు | ఘంటసాల, పి.సుశీల |
పిలిచిన పలుకవు - ఓ జవరాల చిలిపిగ ననుచేర - రావా రావా | సి.నారాయణరెడ్డి | టి.వి.రాజు | ఘంటసాల, పి.సుశీల |
మనసే వెన్నెలగా మారెను లోలోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళా | సి.నారాయణరెడ్డి | టి.వి.రాజు | ఘంటసాల, పి.సుశీల |
ఓ! చిన్నదానా చిన్నదానా | సి.నారాయణ రెడ్డి | టీ వి రాజు | ఘంటసాల,ఎల్ఆర్ఈశ్వరి |
ఓ! మిలమిల మెరిసే మనసే | సి.నారాయణ రెడ్డి | టి. వి.రాజు | పి.సుశీల |
కొమ్మల్లో పాలపెట్ట కూత కూసిందోయ్ | కొసరాజు | టి. వి.రాజు | పి. సుశీల |
రారా కౌగిలి చేర రారా దొర | సి.నారాయణ రెడ్డి | టి. వి.రాజు | పి. సుశీల |
నిండు మాస నిసిరేత్రికాడ | కొసరాజు | టీ. వి. రాజు | ఎల్.ఆర్.ఈశ్వరి,మాధవపెద్ది |
రంగులు రంగులు రంగులు హాయ్, సి నారాయణ రెడ్డి, గానం. పి సుశీల
మూలాలు
మార్చు- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు. గోటేటి బుక్స్. p. 19.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.